- AVI కంపెనీ లెక్కల్లో భారీ గోల్‌మాల్ ?
- ఐటీ కన్నుగప్పేలా ‘AVI’ మాయాజాలం!
జీతాల విషయంలో డబుల్ గేమ్!
కంపెనీ యొక్క ఆదాయం మరియు పన్ను విషయంలో చాలా గందరగోళం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పెరుగుతున్న లాభాలు చూస్తే వ్యాపారం బాగా రన్ అవుతున్నట్తు తెలుస్తోంది. కానీ 2023లో ఆదాయం రూ. 1.5 కోట్లు కాగా టాక్స్ ప్రొవిజన్ కింద మేనేజ్‌మెంట్ చూపింది ఎంతో తెలుసా రూ. 63 లక్షలు. సాధారణంగా ఇలాంటి ఆదాయానికి పన్ను ఈ స్థాయిలో ఉండదు. అసలు ఆదాయం పూర్తి స్థాయిలో ప్రకటించబడుతోందా ? లేక లాభాలు తగ్గించి చూపుతున్నారా ? లేక ఖర్చులు కృత్రిమంగా పెంచబడుతున్నాయా ? ఈ అనుమానాలు లెక్కల్లో అసమానతలను బయటపెడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే సాధారణంగా ఏ కంపెనీ అయినా తన ఆర్థిక లావాదేవీలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసినప్పుడు, ఎవరు ఎప్పుడు మార్పులు చేశారో తెలిపే ‘ఆడిట్ ట్రయల’ (Edit Log) ఫీచర్ ఉండాలి.. అయితే, ఈ కంపెనీ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో ఈ ఫీచర్ లేదని ఆడిటర్ స్వయంగా ధృవీకరించారు. ఈ ఫీచర్ లేకపోవడం వల్ల కంపెనీ తన ఖర్చులను, లాభాలను ఇష్టమొచ్చినట్లు ఎప్పుడంటే అప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది పక్కాగా పన్ను ఎగవేతకు అనుకూలంగా చేసుకున్న ఏర్పాటని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఏవీఐ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రై.లి. రెండు రకాల సాప్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాష్ ద్వారా వచ్చే సొమ్మును చూపకుండా దాచివేత ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది.
కన్సల్టెన్సీ పేరుతో ఖర్చుల భారీ పెంపు
కేవలం ఒకే ఏడాదిలో కంపెనీ ‘కన్సల్టెన్సీ ఛార్జీలు’ ఏకంగా 52% పెరిగాయి. గతేడాది సుమారు రూ.6.96 లక్షలు ఉన్న ఈ ఖర్చు, ఈ ఏడాది రూ.10.59 లక్షలకు చేరింది. దాదాపు రూ.1.54 కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న మెడికల్ కంపెనీలో, కన్సల్టెన్సీ మరియు ప్రొఫెషనల్ ఫీజుల కోసమే రూ.16.8 లక్షలు ఖర్చు చేయడం సాధ్యమేనా?. లాభాలను తగ్గించి చూపడానికే ఈ ‘సాఫ్ట్ కాస్ట్స’ సృష్టించారా?అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
లగ్జరీ కార్లు.. ట్యాక్స్ షీల్డులు!
కంపెనీ దగ్గర ఉన్న వోల్వో (Volvo) మరియు హోండా సిటీ (Honda City) కార్లపై భారీగా డిప్రిసియేషన్ (తరుగుదల) క్లెయిమ్ చేస్తున్నారు.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే కంపెనీ మొత్తం రూ.20,25,749 డిప్రిసియేషన్ చూపించింది.. కార్ల లోన్ వడ్డీ కిందే సుమారు రూ. 5 లక్షలు ఖర్చు రాశారు. అసలు సంగతి ఏమిటంటే మెడికల్ సర్వీస్ ద్వారా వచ్చే లాభాలను తగ్గించడానికి, లగ్జరీ కార్లను బిజినెస్ అవసరాలుగా చూపిస్తూ భారీ పన్ను మినహాయింపు పొందుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
బంధువుల నుండి లోన్లు.. బోర్డులో మౌనం!
యాక్సిస్
బ్యాంక్ నుండి రూ. 67 లక్షల లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఎక్కడ
హాస్పిటల్ విస్తరణ చేసినట్లు రికార్డు లేదు, కొత్త ఆస్తులు కొన్నట్లు
చూపలేదు, వ్యాపార పెరుగుదల స్పష్టంగా లేదు. అయితే ఈ డబ్బు ఎక్కడికి
వెళ్ళింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరో వైపు డైరెక్టర్లు మరియు వారి
బంధువుల నుండి సుమారు రూ.5.17 లక్షలు అన్‌సెక్యూర్డ్ లోన్లను కంపెనీ
తీసుకుంది. కానీ, బోర్డు రిపోర్టులో మాత్రం “రిలేటెడ్ పార్టీలతో ఎటువంటి
ఒప్పందాలు లేవు” అని బుకాయించింది. కానీ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 68
ప్రకారం, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది.
తప్పుల తడకలు
వరుసగా తప్పు నివేదికలు ఇవ్వడం, ఆడిట్ ట్రయల్ లేకపోవడం, మరియు జీతాల విషయంలో గోల్‌మాల్ చేయడం చూస్తుంటే ఇది కేవలం పొరపాటు కాదని, ఒక పక్కా వ్యూహంతో చేసిన పన్ను ఎగవేత అని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దీనిపై ఐటీ శాఖ లోతైన విచారణ జరిపితే మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.ఈ నివేదికపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి !



0 Comments