Ticker

6/recent/ticker-posts

Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !

లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం 30 నెలల్లో నాలుగు లక్షల రూపాయలు తిరిగి పొందొచ్చు’ అంటూ భారీ లాభాల ఆశ చూపించిన ఓ ప్రైవేట్ పెట్టుబడి సంస్థ వేలాది మంది అమాయక ఖాతాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన చేపట్టారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి సంస్థ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.

భారీ లాభాల పేరుతో ఆకర్షణ 

కాకినాడ కేంద్రంగా ‘ఆల్మేటి జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట’ సంస్థ అధిక రాబడుల పేరుతో ప్రజలను ఆకర్షించింది. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెల నెలా అసలు, వడ్డీతో కలిపి మొదటి పది నెలల పాటు ప్రతి నెల రూ.15 వేల చొప్పున, అనంతరం మరో 20 నెలల పాటు ప్రతి నెల రూ.12,500 చొప్పున చెల్లించి, మొత్తం 30 నెలల్లో రూ.4 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తున్నామని చెప్పి ప్రజల్లో విశ్వాసం కల్పించినట్లు బాధితులు చెబుతున్నారు.

లక్షల నుంచి కోట్లలో వసూళ్లు 

ఈ పథకాన్ని నమ్మిన అనేక మంది తమ పొదుపు మొత్తాలను సంస్థకు అప్పగించారు. కొందరు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టగా, మరికొందరు రూ.50 లక్షల వరకు చెల్లించినట్లు బాధితులు తెలిపారు. బంధువులు, స్నేహితులను కూడా ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టించిన వారు ఉన్నారని, దీంతో సంస్థకు భారీగా నిధులు సమకూరినట్లు సమాచారం.

జనవరి వరకు చెల్లింపులు, ఆ తర్వాత నిలిపివేత 

బాధితుల  తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జనవరి వరకు సంస్థ నెలవారీ చెల్లింపులను సక్రమంగానే చేసింది. దీంతో పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకం పెరిగింది. అయితే ఫిబ్రవరి నెల నుంచి ఒక్కసారిగా చెల్లింపులు నిలిచిపోయాయి. పలుమార్లు కార్యాలయాన్ని సంప్రదించినా స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయామని భావించిన బాధితులు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

యుద్ధాన్ని బూచిగా చూపి 

సంస్థ ప్రతినిధి మాత్రం సంస్థకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం కారణంగా స్టాక్ మార్కెట్‌లో నష్టాలు ఎదురయ్యాయని, అందువల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని, పెట్టుబడిదారులందరికీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ వివరణపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది బాధితులు ఒకేసారి సంస్థ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంస్థ కార్యకలాపాలపై వివరాలు సేకరిస్తున్నారు.

7000 ల మందికి పైగా  పెట్టుబడిదారులు? 

బాధితుల వివరాల ప్రకారం, ఆల్మేటి జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శాఖలు ఉన్నాయి. దాదాపు ఏడు వేల మందికి పైగా పెట్టుబడులు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క కాకినాడలోనే సుమారు మూడు వేల మంది రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఎంత మేర నిధులు సమీకరించారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం 

సంస్థ నిర్వాహకుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. పెట్టుబడుల సేకరణ, చెల్లింపుల విధానం, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య, నష్టం పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు, పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Post a Comment

0 Comments

Popular Posts

ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
Target Babu : చంద్రబాబుపై సిఐడి రెండు పిటీషన్‌లు !
మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్‌ ! వర్కవుట్‌ అవుతుందా ?
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
 varuntej and lavanya tripathi engagement : మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి...వరుణ్‌తేజ్‌, లావణ్యల నిశ్చితార్థం !
Opposition Parties meeting in Bihar :  విపక్ష నేతల ఐక్యతా రాగం...ప్రధాని అభ్యర్థి ఎవరు ?
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !