Ticker

6/recent/ticker-posts

NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !

NEET UG 2024 పరీక్షను మే 5 వ తేదీన ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా నిర్వహించింది. అయితే ఎన్‌టీఏ (NTA) అధికారికంగా ఎలాంటి కీ (KEY) ని విడుదల చేయలేదు. అప్పుడే శ్రీచైతన్య (SRI CHAITANYA) తన మార్కెటింగ్‌ స్ట్రాటజీని మొదలుపెట్టింది. సబ్జెక్టు నిపుణలతో నీట్‌ యూజీ (NEET UG 2024  ) కీ ని ప్రిపేర్‌ చేయించింది. దాని ప్రకారంగా శ్రీచైతన్య విద్యార్థులు 4 గురు 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చేసినట్టు సోషల్‌ మీడియా (SOCIAL MEDIA) వేదికగా మే, 6 వ తేదీ రాత్రి నుండి ప్రచారం చేస్తోంది. ఎన్‌టీఏ (NTA) అధికారికంగా ప్రకటించేదాకా ఎందుకు ఆగలేకపోతోంది. ఎందుకు ఇంత తొందరపడుతోంది అంటే అడ్మిషన్ల కోసం ఇదో రకమైన జిమ్మిక్కు. శ్రీచైతన్యకే ఎక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చాయి అని ప్రచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్ని మభ్యపెట్టడంలో ఆరితేరిపోయింది శ్రీచైతన్య. అసలు ఎన్‌టీఏ (NTA) ప్రకటించకుండా కీ ని ఎందుకు తయారు చేస్తోంది. తన విద్యార్థుల కోసం, మార్కుల అంచనాల కోసం అనుకున్నా...తనకు తానుగా మార్కులు ప్రకటించేసుకుని తనకు తానే ప్రచారం చేయటం నేరం. ఇక ఎన్‌టీఏ ఎందుకు ? ఈ చర్య ఎన్‌టీఏ (NTA) స్వయం ప్రతిపత్తిని అవమానించటమే. ఎన్‌టీఏ (NTA) కన్నా శ్రీచైతన్యనే ఎక్కువ అని భావిస్తున్నట్లు ఉంది. దీనిపై చర్యలు తీసుకోవలసిందిగా విద్యార్థులు, తల్లిదండ్రులూ కోరుతున్నారు.

Post a Comment

0 Comments