అసలు కథ ఏమొటంటే...
కట్టిన ఫీజుతోనే ఒక తరగతిలోని అన్ని పరీక్షలతో పాటు అన్ని సౌకర్యాలు అందించాలి. కానీ శ్రీచైతన్య బుక్స్‌కి ఎక్స్‌ట్రా, డ్రస్‌కి ఎక్స్‌ట్రా, ఇన్ఫినిటీ మెటా జానియర్ యాప్‌కి ఎక్స్‌ట్రా, ఒలింపియాడ్స్‌కి ఎక్స్‌ట్రా...ఇలా తల్లిదండ్రుల్ని వివిధ రకాల ఫీజుల పేరుతో స్కూల్ ఫీజు కన్నా ఎక్కువగా దోచుకుంటోంది శ్రీచైతన్య. దీంతో తల్లిదండ్రులు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తోంది శ్రీచైతన్య. కోవిడ్ 19 సమయంలో అంతా ఆన్‌లైన్ అయిన సందర్భంలో ఈ యాప్ ద్వారా బోధన జరిగింది. దానిని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ ఆ యాప్‌ని బలవంతంగా విద్యార్థులపై రుద్ది తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజలు లాగేస్తున్నారు. క్లాస్‌రూమ్ డైరెక్ట్‌గా బోధిస్తున్నప్పుడు ఆన్‌లైన్ యాప్‌లోతో పనేముంది. శ్రీచైతన్య దోపిడీకి అలవాటు పడిరది అని ఈ విషయం చెప్పకనే చెబుతోంది. ఇక ఈ ఫీజుని నెక్ట్‌జెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద వసూలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య స్కూల్స్ మరియు కాలేజ్‌లలో చదివే 6 లక్షల మంది దగ్గర నుండి రూ. సరాసరిన రూ. 2000/` వసూలు చేసినా కోటానుకోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ నిధులన్నీ నెక్ట్‌జన్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి శ్రీచైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలోని ర్యాంక్‌గురు టెక్నాలజీ సొల్యుషన్స్ ప్రై.లి. కంపెనీలోకి మళ్ళిస్తోంది. విద్య ఏ రూపంలో ఉన్నా సేవ క్రిందే వస్తుంది కానీ సొసైటీల పేరుతో వసూలు చేయటం, శ్రీచైతన్య షెల్ కంపెనీలైన ప్రై.లిమిటెడ్ కంపెనీల్లో కి మళ్ళించటం వాటిని సొంతానికి వాడుకోవటం శ్రీచైతన్యకు వెన్నతో పెట్టిన విద్య. అసలు ఈ యాప్‌ని వినియోగించుకునే వారి సంఖ్య అత్యల్పం. దీని వలన ప్రయోజనం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలతో పాటు యాప్‌కి కూడా డబ్బు కడితేనే పుస్తకాలు ఇస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవలసినదిగా ప్రభుత్వాలను కోరుతున్నారు. పైకి ఇన్ఫినిటీ మెటా జూనియర్ యాప్ ఉచితం అని చెప్తూనే ఒక్క శ్రీచైతన్య విద్యార్థులకు మాత్రమే యాక్సిస్ కల్పిస్తోంది. ఇందులో డబ్బులు దండుకునే దురుద్ధేశ్యమే కన్పిస్తోంది.
0 Comments