Ticker

6/recent/ticker-posts

Vijaya SaiReddy Tweet on Nellore Narayana : నెల్లూరు నారాయణ వేధింపుల పర్వంపై విజయసాయి ట్వీట్‌ !

 
నెల్లూరు నారాయణ వేధింపుల పర్వం రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. టీడీపీ నేత పొంగూరు నారాయణ వేధింపులను ఎండగట్టారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు.. ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్న మైనర్‌ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ట్విటర్‌ వేదికగా నారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. పెద్ద మనిషి ముసుగులో పొంగూరు నారాయణ చేస్తున్న తేడా పనుల్ని ఆయన మరదలు ప్రియా వీడియో సాక్షిగా ఒక్కొక్కటిగా ఆయన పనుల్ని బయటపెడుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులు ఎప్పుడూ తన కాళ్ళ క్రిందే బ్రతకాలనేది ఆయన ఉద్ధేశ్యమని దుయ్యబట్టారు. సడెన్‌గా తన భర్తను ఉద్యోగం నుండి తీసేసి ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. ఇంకా పలు సంచలన విషయాలను డైలీ సీరియల్‌ మాదిరిగా ప్రియ పొంగూరు రీల్స్‌ ద్వారా విడుదల చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా