Ticker

6/recent/ticker-posts

Skanda Relise Date : డాన్స్‌ కుమ్మేసిన రామ్‌, శ్రీలీల !

 

వారియర్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్డడంలో ఇప్పుడు ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడు రామ్‌. ఈ క్రమంలోనే మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు స్కంద అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో లేటెస్ట్‌ సిల్కర్‌స్క్రీన్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత హిట్‌ అందుకోలేకపోయారు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నపటికీ రామ్‌కు సాలిడ్‌ హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. 

ప్రమోషన్స్‌పై స్పీడ్‌

ఈ సినిమాను సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌పై స్పీడ్‌ పెంచారు మేకర్స్‌.ఈ క్రమంలోనే స్కంద మూవీనుంచి తొలి సాంగ్‌ ను రిలీజ్‌ చేశారు. నీ చుట్టూ చుట్టూ అంటూ సాంగ్‌ ఈ సాంగ్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ సాంగ్‌ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్‌లో రామ్‌, శ్రీలీల డాన్స్‌తో అదరగొట్టారు. రామ్‌ చాలా రోజుల తర్వాత మరోసారి డాన్స్‌ తో కుమ్మేశాడని చెప్పాలి. అలాగే శ్రీలీల కూడా తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ కు ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫ్‌ చేశారు. మాస్‌ మసాలా కంటెంట్‌ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుందంటున్నారు రామ్‌ ఫ్యాన్స్‌. ఇక ఈ సినిమాతో పాటు పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో డబుల్‌ ఇస్మార్ట్‌ అనే సినిమా చేస్తున్నారు రామ్‌.

Post a Comment

0 Comments

Popular Posts

Viindhya Gold : అధిక వడ్డీ వల విసురుతూ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న వింధ్య గోల్డ్ !
VIINDHYA BULLION : భారీ కుంభకోణం దిశగా ‘వింధ్యా బులియన’ అడుగులు
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
ALLEN : అలెన్‌ పేరుతో అక్షర మార్క్‌ దందా !
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
AVI CLINIC : IT కన్నుగప్పేలా ‘AVI’ మాయాజాలం ?
AP Governor Reacts on Babu Arrest  : చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్‌ విస్మయం !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !