Ticker

6/recent/ticker-posts

Siddhartha Public School : సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ‘షెల్ ’ కంపెనీల గుట్టు రట్టు !



  • సుమన్ కుమార్ చింతలపల్లి పేరుపై ఇబ్బడిముబ్బడిగా ప్రై.లి. కంపెనీలు ! 
  • నామామాత్రపు పెయిడప్ క్యాపిటల్‌తో కంపెనీలు ఓపెన్ ! 
  • ఒకే అడ్రస్ మీద 19 షెల్ కంపెనీల ఏర్పాటు ! 
  • మెడికల్, రియల్ ఎస్టేట్ కంపెనీలే అధికం !

ఆ సంస్థల్లో ఉద్యోగులు ఉండరు, ఆస్తులు ఉండవు, నిజానికి అసలు వ్యాపార కార్యకలాపాలు ఉండవు. కానీ పేపర్ల మీద కంపెనీలు నడుస్తూనే ఉంటాయి. అదే డా॥ సుమన్ కుమార్ చింతలపల్లి షెల్ కంపెనీల మాయాజాలం. ప్లాట్ నెం. 256, కార్తికేయ నగర్, నాచారం, ఉప్పల్, హైద్రాబాద్ చిరునామా పేరు మీద 19 కంపెనీలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏవీఐ ఆక్వాకల్చర్ పై.లి., ఏవీఐ కెరీర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రై.లి., ఏవీఐ కోకోనట్ ఫార్మింగ్ ప్రై.లి., ఏవీఐ మెడికల్ & రీసెర్చ్ సెంటర్స్ ప్రై.లి., ఏవీఐ డైరీ ప్రై.లి., ఏవీఐ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రై.లి. , అమరావతి ఆర్చిడ్స్ ప్రై.లి., అమరావతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రై.లి., అమరావతి లాండ్ డెవలపర్స్ ప్రై.లి., గౌతమీ HOMES ప్రై.లి., గౌతమీ INFRA డెవలపర్స్ ప్రై.లి., సవితా ఎనర్జీస్ ప్రై.లి., విష్ణు తేజ లేబొరేటరీస్ ప్రై.లి., విష్ణుతేజ ప్రాజెక్ట్స్ ప్రై.లి. ఇవీ అన్నీ  డా॥ సుమన్ కుమార్ చింతలపల్లి పేరు మీద నెలకొల్పిన షెల్ కంపెనీల లిస్ట్ ఇదీ. ఇవే కాక అంకుర హాస్పి{ల్స్ ఎ.ఎస్.రావు నగర్ ఎలఎల్‌పి, అంకుర హాస్పిటల్స్ ఉప్పల్ ఎలఎల్‌పి, ఏవీఐ సూర్యాన్ష్ ప్రాజెక్ట్స్, అవిఘ్న లేబొరేటరీస్, సిహెచ్ సుమన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, సూర్య ఏవీఐ ఇన్‌ఫ్రా ఎల్.ఎల్.పి., సూర్యతేజ ప్రాపర్టీస్ ఎల్.ఎల్.పి., సూర్య ఏవీఐ ల్యాండ్ డెవలపర్స్, సూర్య ఏవీఐ ప్రాపర్టీస్, ఉదయా పీడియాట్రిక్ హాస్పిటల్స్ ఎల్.ఎల్.పి. మొత్తంగా దాదాపు 22 కంపెనీలు లిస్ట్ ఉంది. వీటిల్లోని కొన్ని కంపెనీల్లో స్వప్న చింతలపల్లి, జగదీశ్వరరావు చింతలపల్లి, అమరావతి చింతలపల్లి మరియు ఇతరులు కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. 

డొల్ల కంపెనీల సామ్రాజ్యం ! 

సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ (గౌతమీ ఎడ్యుకేషన్ సొసైటీ) పేరుతో తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న కోట్లాది రూపాయలు ఎలాంటి లాభం లేని సంస్థగా ప్రభుత్వానికి చూపిస్తూ కేవలం సేవ కోసమే అని కలరింగ్ ఇస్తూ కోట్లాది రూపాయలు ఈ షెల్ కంపెనీల్లోకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏవీఐ క్లినిక్స్ , ఫార్మా, ల్యాబ్స్ ద్వారా వచ్చే సొమ్మును ఇతర సంస్థల్లోకి పెట్టుబడులుగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అంకుర హాస్పిటల్స్‌లోనూ (ఉప్పల్, ఎ.ఎస్.రావు నగర్) నల్లధనాన్నే పెట్టుబడులుగా పెడుతున్నట్లు తెలుస్తోంది. మద్యం సిండికేట్‌గా మారి మద్యం షాపుల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే అన్ని మార్గాల్లో వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్స్ వైపు మళ్ళిస్తున్నట్లు తెలుస్తోంది. విద్య, వైద్యం, మద్యం మరియు భూములపైన పెట్టుబడులతో వచ్చే నల్లధనాన్ని ఈ షెల్ కంపెనీ ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీల్యాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని కంపెనీల్లో ఆర్థిక లావాదేవీలు చూపి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకుý నుండి పెద్దమొత్తంలో లోన్స్‌ను పొందుతూ వాటిని వేరే కంపెనీల్లోకి మళ్ళించటం ఇదో తంతుగా జరుతున్నట్లు వెల్లడైంది. ఈ కంపెనీలకు కనీసం కార్యాలయాలూ లేకపోవడం గమనార్హం. నమోదిత కార్యాలయాల వద్ద ఆరా తీసిన ఆ పేర్లతో ఆఫీసులే లేవని తెలియవచ్చింది.

రియల్ ఎస్టేట్ భారీ పెట్టుబడులు !

ఇప్పటి దాకా డాక్టర్‌గా మరియు విద్యాసంస్థ డైరెక్టర్‌గా రాణిస్తున్న సుమన్ కుమార్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తున్నారు. హాస్పిటల్స్‌లో, విద్యారంగంలో పెట్టుబడుల కంటే అత్యధికంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన షెల్ కంపెనీలే ఎక్కువ ఉన్నాయి. సూర్య ఏవీఐ ఇన్‌ఫ్రా ఎల్.ఎల్.పి., సూర్య ఏవీఐ ల్యాండ్ డెవలపర్స్, సూర్య ఏవీఐ ప్రాపర్టీస్, సూర్యతేజ ప్రాపర్టీస్ ఎల్.ఎల్.పి., సిహెచ్ సుమన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, అమరావతి లాండ్ డెవలపర్స్ ప్రై.లి., గౌతమీ ీVAమ్స్ ప్రై.లి., గౌతమీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రై.లి., విష్ణుతేజ ప్రాజెక్ట్స్ ప్రై.లి. ఈ కంపెనీలన్నీ డాక్టర్ సుమన్ కుమార్ వే. ఒకే కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్‌లో కొనసాగించవచ్చు. కానీ లాభాలు చూపకుండా ఉండేందుకు ఎక్కువ షెల్ కంపెనీలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.



Post a Comment

0 Comments

Popular Posts

Viindhya Gold : అధిక వడ్డీ వల విసురుతూ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న వింధ్య గోల్డ్ !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
VIINDHYA BULLION : భారీ కుంభకోణం దిశగా ‘వింధ్యా బులియన’ అడుగులు
Ankura Hospital ఉప్పల్ LLPలో భారీగా ఆర్థిక అక్రమాలు ?
Siddhartha Public School : సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ‘షెల్ ’ కంపెనీల గుట్టు రట్టు !
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
AVI CLINIC : IT కన్నుగప్పేలా ‘AVI’ మాయాజాలం ?
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
ALLEN : అలెన్‌ పేరుతో అక్షర మార్క్‌ దందా !