Ticker

6/recent/ticker-posts

Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?

  • B.Ed అర్హత ఉన్న టీచర్లు ఎంత మంది ఉన్నారు ?  
  • ఇతర స్కూల్స్‌ ఉపాధ్యాయులే దిక్కా ? 
  • ఇతర స్కూల్స్‌ నుండి వచ్చే టీచర్లకు రెజొనెన్స్‌ ప్రోగ్రామ్‌ను ఎలా అర్థం చేసుకుంటారు. 
  • అంటే 8 రకాల ఫౌండేషన్స్‌ హుళక్కెనా ? 
  • ప్రచారం మీద ఉన్న శ్రద్ధ టీచర్ల పై ఏది ? 

ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు, ప్రైవేటు మరియు కార్పొరేట్‌ స్కూల్స్‌లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. తక్కువ జీతాలు, ప్రైవేటు యాజమాన్యాల అనుచిత ప్రవర్తన Ê విపరీత పోకడ కారణంగా టీచర్‌ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా ఉంది. ముఖ్యంగా గణితం, సైన్స్‌. సోషల్‌ సబ్జెక్టులకు సంబంధించిన టీచర్స్‌ కొరత అధికంగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  

కొత్తదనమేమీ లేని రొజొనెన్స్‌ స్కూల్స్‌ ! 

ఇటీవల రొజెనెన్స్‌ అనే సంస్థ కొత్తగా హైద్రాబాద్‌ వేదికగా 16 కొత్త స్కూల్స్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపింది. 8 రకాల ఫౌండేషన్స్‌తో 8 కోణాల్లో విద్యార్థులను అభివృద్ధి చేస్తాం అంటూ ప్రచార ఆర్భాటంతో తల్లిదండ్రులను ఆకుట్టుకునే ప్రయత్నం చేస్తోంది రెజొనెన్స్‌. ప్రచారం మీద, మౌలిక సదుపాయాల మీద పెట్టే శ్రద్ధలో కనీసం 50% టీచర్ల మీద ఉంచటం లేదు అని పరిశోధనలో వెల్లడైంది. ఇప్పటికే రొజొనెన్స్‌ స్కూల్స్‌ను సంప్రదించి, సందర్శించిన వేలాది మంది తల్లిదండ్రుల్లో రొజొనెన్స్‌ స్కూల్స్‌ మీద ఎలాంటి పాజిటివిటీ లేదని తెలుస్తోంది. అన్ని ప్రైవేటు స్కూల్స్‌ మాదిరిగానే రెజొనెన్స్‌ కూడా తమకు ఒక ఛాయిస్‌ అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికీ రెజొనెన్స్‌ స్కూల్స్‌లో ఎలాంటి టీచర్ల నియామకం చేపట్టిన దాఖలాలు లేవు. అంటే రొజొనెన్స్‌ స్కూల్స్‌కి ప్రత్యేకంగా టీచర్లు లేరు. వచ్చే విద్యాసంవత్సరానికి ఇతర స్కూల్స్‌లో పనిచేసే టీచర్లను ఎక్కువ మొత్తంలో జీతం ఆఫర్‌ చేసి టీచర్లను నియామకం చేసే ఉద్ధేశ్యంతోనే యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రెజొనెన్స్‌ ప్రకటించినట్టుగా 8 రకాల ఫౌండేషన్స్‌తో 8 కోణాల్లో విద్యార్థులను అభివృద్ధి చేస్తాం అనే హమీ గాలిలో దీపమే. ఎందుకంటే వేరే స్కూల్స్‌ నుండి వచ్చిన టీచర్స్‌కి రెజొనెన్స్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌లు ఇతర ఫౌండేషన్స్‌ గురించి అవగాహన ఉండదు. ఈ ప్రోగ్రామ్‌ల మీద టీచర్లకు అవగాహన రావాలంటే కనీసం ఒక సంవత్సర కాలం పడుతుంది. ఈ లెక్కన రొజొనెన్స్‌ స్కూల్స్‌ ఇచ్చిన హమీ ఎలా నెరవేర్చగలుగుతుంది అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

బీటెక్‌, డిగ్రీ అభ్యర్థులతోనే నెట్టుకొస్తున్న ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు !

శ్రీచైతన్య, నారాయణ వంటి సాంప్రదాయ విద్యాసంస్థలు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో చేసేది లేక బీటెక్‌, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులను ఎంచుకుని ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టులపై పూర్తి పట్టు వచ్చిన తర్వాతే క్లాసుల నిర్వహణ అప్పగిస్తున్నారు. వీరితో పాటు ఐఐటి, ఎన్‌.ఐ.టీ, ఐఐఐటీలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులను ఎంపిక చేసుకుని 2 సంవత్సరాల కఠిన శిక్షణా తరగతుల అనంతరం వారిని పూర్తి స్థాయి టీచర్లుగా నియమించటం జరుగుతోంది. కానీ రెజొనెన్స్‌కి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేకుండా ఇతర ప్రైవేటు పాఠశాలల టీచర్లపై ఆధాపడటం శోచనీయం. ఇక పోతే అవే శ్రీచైతన్య, నారాయణ ప్రోగ్రామ్‌లు, అవే విధానాలు, అవే ఫీజలు..ఆయా స్కూల్స్‌లో పనిచేసిన టీచర్లనే ఇక్కడ నియమిస్తే ఇక కొత్తదనమేముంది. ఈ తరహా విధానాలు అవలంభిస్తే తల్లిదండ్రుల నుండి తిరస్కరణ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నారు

దమ్ము ఉందా ? 

రెజొనెన్స్‌ స్కూల్‌ నోటీస్‌ బోర్డ్‌లో టీచర్ల వివరాలు వారి సర్టిఫికెట్ల వివరాలు, వారి విద్యార్హత, అనుభవం వంటి వివరాలు సవివరంగా ప్రకటించి విశ్వసనీయత చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు పడితే వారు కార్పొరేట్‌ స్కూల్స్‌ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు తప్పించి నిజాయితీగా అన్ని వివరాలను పబ్లిక్‌ ఉంచే ప్రయత్నం చేయటం లేదని తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నుండి కొత్త సంస్థలు ఏవైనా టీచర్ల వివరాలు మరియు స్కూల్‌ గుర్తింపు పత్రాలు బహిరంగ పరిస్తేనే అడ్మిషన్లు చేపట్టాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.





Post a Comment

0 Comments