Ticker

6/recent/ticker-posts

Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !

  • అర్హత లేకపోయినా విచ్చలవిడిగా క్లినిక్‌ల ఏర్పాటు
  • వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
  • నెలకు రూ. 2 కోట్లు దోచేస్తున్న నాగరాజు
  • హాస్పిటల్‌లో పెట్టుబడులు పెడుతున్న వైనం.
  • పట్టిల నుండి మోకీళ్ళలోని గుజ్జు ఎలా వస్తుందో చెప్పలేకపోతున్న నాగరాజు
  • బట్టతలపై జుట్టు అంటూ తైలాన్ని అంటగడుతున్న నాగరాజు
  • 100 లో 5 గురికే సక్సెస్...95 మంది బాధితులే.
  • బాదితులు తిరగబడితే...స్టాఫ్‌చే బెదిరింపులు !

చదివింది 7 వ తరగతి, చేసేది డాక్టర్ వత్తి... ఎంటబ్బా ఈ తిరకాసు అనుకుంటున్నారు. ఆయుర్వేద నిపుణుడు అని తనకు తానే చెప్పుకుంటూ ఈ కేటుగాడు చేసే మోసాలను అన్నీ ఇన్నీ కాదు. మోకీళ్ళు అరిగిపోయాయా ? ఆపరేషన్ లేకుండా నేను నయం చేస్తాడు అంటాడు, బట్టతల మీద జుట్టు మెలిపిస్తాడు. స్పెషలిస్ట్ డాక్టర్లు సైతం చేయలేని మిరాకిల్స్‌ను చేసి చూపి జనాల్ని బురిడీ కొట్టిస్తున్నాడు శ్రీýక్ష్మీ ఆయుర్వేదం ఉరఫ్ ఐజెక్స్ ఆయుర్వేదం హాస్పిటల్ ఓనర్ నాగరాజు. ఆయన పేరు ముందు డాక్టర్ అని ఉండదు, పేరు చివర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండదు, కానీ రోగాన్ని నయం చేస్తాడు అనే గుడ్డి నమ్మకంతో కేటుగాడు నాగరాజును ఆశ్రయించటం అమాయక ప్రజల అవగాహన లేమికి అద్దం పడుతుంది. ఇతడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో పాగా వేసి మోకాళ్ళలో గుజ్జు వస్తుంది, బట్టతల మీద జుట్టు వస్తుంది అని ఈ డాక్టర్ కాని డాక్టర్ సేవలు అందిస్తున్నాడు. ఈ మోసగాడు ఎంచుకున్న మార్గం ఎంటో తెలుసా మార్కెటింగ్. ఫేస్‌బుక్ , ఇన్‌స్టగ్రామ్‌లో అది తగ్గించా, ఇది తగ్గించా అని పోస్టులు పేడుతూ తనకు అనుకూలమైన వారితో మంచి రివ్యూలు ఇప్పించుకుని దానిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి జనాన్ని మోసగించటం అలవాటుగా మార్చుకున్నాడు ఈ కేటుగాడు.

నాగరాజు నేపధ్యం

ఆయుర్వేద నిపుణులు ఎల్చూరి దగ్గర సహాయకుడిగా పనిచేసిన నాగరాజు తదనంతరం రేపల్లెలో ఆయుర్వేద మందుల అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. మొదటి నుండి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే ఉండేవాడు. కరోనా సమయంలో కరోనా మందు తయారు చేశాను అంటూ వేలల్లో వసూలు చేసి డబ్బు గడించాడు. అనంతరం జనం బాగా ఇబ్బందులు పడుతున్న రోగాలను గుర్తించాడు. ఇదే అదునుగా మోకీళ్ళకు ఆపరేషన్ లేకుండా నయం చేస్తాం అంటూ పట్టీలు వేస్తూ వంచనకు పాల్పడుతున్నాడు. మరో వైపు స్నూహ్నాది తైలం పేరుతో బట్టతల మీద జుట్టు వస్తుంది అంటూ ప్రచారం చేస్తూ తనే తయారు చేసిన నూనెను 100 గ్రా. 2300/`అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నాడు. ప్రతి రోజూ క్యాంపుల పేరుతో వివిధ జిల్లా కేంద్రాలు తిరుగుతూ ఒక్కో పేషెంట్ నుండి రూ. 5000/` నుండి 7000/` వసూలు చేస్తున్నాడు. స్నూహ్నాది తైలం పేరుతో అదనంగా దోచుకుంటున్నాడు. రోజుకి 200 మంది చొప్పున పేషెంట్లకు సేవలందిస్తూ రూ. 10 లక్షల నుండి 12 లక్షల చొప్పున వెనకేసుకుంటున్నాడు ఈ ఆయుర్వేద కేటుగాడు. అలా నెలకి ఈజీగా 20 క్యాంప్‌ల పేరుతో నెలకు 2 కోట్లు దోచుకుంటున్నాడు. ఈ సంపాదనతో హైదరాబాద్ కూకట్‌పల్లిలో, గుంటూరులో ఐజెక్స్ ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో హాస్పిటల్ ఓపెన్ చేశాడు. దీనిలో ఆయుర్వేదంతో పాటు ీVAమియోపతి, అల్లోపతి సేవలు అంటూ ప్రచారం చేస్తున్నాడు. ఒక సహాయకుడు ఒక డాక్టర్‌గా అవతారం ఎత్తడమే కాకుండా ఇప్పుడు హÃమియోపతి, అల్లోపతి పేరుతో హాస్పిటల్ తెరిచాడు. 

బట్టతల మీద జుట్టు మొలవదు : డాక్టర్ల 

జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే బట్టతలపై మందులు లేదా నూనెలతో మళ్లీ జుట్టు రావడం దాదాపు అసాధ్యం. అక్కడ వెంట్రుకల ఫోలికల్స్ పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. ఇక పోషకాహార లోపం, ఒత్తిడి లేదా ఇన్ఫెక్షన్ల వల్ల జుట్టు రాలితే, సరైన చికిత్స మరియు నూనెలతో (స్నూహ్యాది తైలం వంటివి కాదు, అవి వేరే సమస్యలకు) తిరిగి జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది.
స్నూహ్యాది తైలం గురించి ఒక నిజం !
స్నూహ్యాది తైలం ప్రధానంగా చర్మ వ్యాధులు, పుండ్లు, మరియు చెవి సమస్యలకు వాడేందుకు తయారు చేసిన ఆయిల్. కానీ పోషకాహార లోపం కారణంగా జుట్టు ఊడిపోయిన వారికి పనిచేయటం మూలంగా దానిని అందరికీ అంటగట్టి మార్కెటింగ్ మాయజాలంతో నాగరాజు డబ్బు దండుకోవటం మొదలుపెట్టాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బట్టతలపై జుట్టు పెంచడానికి స్నూహ్యాది తైలం వాడతారని ఆయుర్వేద గ్రంథాలలో ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. పైగా ఇది చాలా స్ట్రాంగ్ అయిన మందు. దీనిని తలకు తప్పుగా రాస్తే మంట పుట్టడం లేదా చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది.

తప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్త

చాలా కంపెనీలు తమ వ్యాపారం కోసం “10 రోజుల్లో బట్టతలపై జుట్టు” అని ప్రకటనలు ఇస్తుంటాయి. తాయరైన ప్రతి మందు ప్రతి ఒక్కరి బట్టతలను నయం చేస్తుందని గ్యారెంటీ లేదు. ఇక నాగరాజు విషయానికి వస్తే తలలో చుండ్రు ఉండకూడదు, తలతో చెమట పట్టకూడదు, గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి అని కండీషన్స్ పెడుతున్నాడు. రోజుకి మూడు సార్లు మర్థన చేయాలి అని చెప్తున్నారు. అప్పుడు 100 గ్రా. బాటిల్ ఎన్ని రోజులు వస్తుంది. అంటే తప్పని సరిగా ఎక్కువ బాటిల్స్ కొనిపించటమే ఇతడి టార్గెట్. సరే అని డబ్బులు లేక కొన్ని రోజులు ఆపేస్తే మళ్ళీ మీ బాల్డ్ హెడ్ బయటపడుతుంది. బట్టతలకు శాశ్వత పరిష్కారం లేదని గుర్తించటం. నాగరాజు లాంటి తప్పుడు వ్యక్తిని నమ్మి డబ్బు పోగొట్టుకోకండి. తప్పుదారి పట్టించే ప్రకటనలు: భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బట్టతలని పూర్తిగా నయం చేస్తామని మాయా మాటలు చెప్పడం చట్టవిరుద్ధం. ఇంక లైసెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఎక్కడ లేదు. ఇది ఒక ఫేక్ ప్రాడక్ట్. ప్రభుత్వ నుండి ఎలాంటి గుర్తింపు లేదు. నాగరాజు అమ్మే అన్ని ప్రాడక్ట్‌లకు ఒకటే లైసెన్స్ ఉండటం గమనార్హం.

మోకీళ్ళకు పట్టీల మాయ !

మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్), అధిక బరువు, వృద్ధాప్యం, గాయాలు, కీళ్లపై ఎక్కువ ఒత్తిడి (మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం), విటమిన్ డి3 లోపం, బలహీనమైన కండరాలు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వైద్య పరిస్థితుల వల్ల వస్తాయి. ఇవి కీళ్లలో వాపు, నొప్పులు మరియు కదలికలో ఇబ్బందులను కలిగిస్తాయి. మోకీళ్ళ నొప్పులకు వివిధ రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆయుర్వేదాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న నాగరాజు ఇవేమి పట్టనట్టు మోకాళ్ళకు పట్టీలు వేసి తగ్గిస్తాను అన్ని ఛాలెంజ్‌లు చేస్తున్నాడు. ఒక్కరిద్దరీ కాదు నాగరాజు దగ్గరకు విచ్చేసే అందరికీ శాస్త్రీయంగా తగ్గించి చూపిస్తే నాగరాజు వేసే శిక్షలకు మేము సిద్ధం. అసలు నాగరాజు వేసే పట్టీలో ఏముంది ? అందులోని కెమికల్ మోకాలిలోకి ఎలా వెళుతుంది ? మోకాలు లోపల గుజ్జును ఎలా పెంచుతుంది అనే శాస్త్రీయంగా వివరించి తగ్గించి చూపగలరా ? 





Post a Comment

0 Comments