Ticker

6/recent/ticker-posts

AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?

కేవలం అకౌంట్ బుక్స్ మాత్రమే కాదు.. అవి ఒక వ్యవస్థీకృత ఫైనాన్షియల్ క్రైమ్ స్టోరీని చెబుతున్నాయా? భాగ్యనగరానికి చెందిన ‘అవజ్ఞ లాబొరేటరీస్ LLP (AVIGNA LABORATORIES LLP) సమర్పించిన వార్షిక నివేదికలు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖాధికారుల కనుబొమ్మలు ముడిపడేలా చేస్తున్నాయి. సంస్థ లావాదేవీలను లోతుగా విశ్లేషిస్తే, పన్ను ఎగవేత కోసం అనుసరించిన ‘ఫోరెన్సిక్ మిస్టరీ’లు బయటపడుతున్నాయి.  

అప్పుల ప్రవాహం 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం, కంపెనీ ఖాతాల్లోకి వచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది, 2016-17లో సుమారు రూ. 1.01 కోట్ల ‘అన్ సెక్యూర్డ్ లోన్స’ (Unsecured Loans) చూపిన సంస్థ, తరువాతి కాలంలో వాటిని తెలివిగా ‘పార్ట్నర్ కరెంట్ క్యాపిటల’ కిందకు మార్చేసింది.  పెట్టుబడి మాత్రం కేవలం రూ. 10 లక్షలే ఉన్నప్పుడు, ఆ ‘పార్ట్నర్ క్యాపిటల’ అకస్మాత్తుగా రూ. 4.6 కోట్లకు ఎలా చేరింది? ఇది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రక్రియ కాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ఉన్న ఈ సంస్థ, అతి తక్కువ కాలంలో కోట్ల రూపాయల అప్పులను ఎలా సేకరించిందనేది పెద్ద ప్రశ్న.  2019లో ఇండసఇండ్ బ్యాంక్ ద్వారా రూ.50 లక్షల చార్జ్ Charge) సృష్టించబడగా, 2022 నాటికి అది ఏకంగా రూ. 5 కోట్లకు (300% పెరుగుదల) చేరుకుంది. 

నష్టాల్లో ఉన్నా పన్ను చెల్లింపులా? 

సంస్థ ఆర్థిక పరిస్థితి ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపిస్తోంది. లాభనష్టాల ఖాతాలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.  2016-17లో రూ. 1.14 కోట్ల భారీ నష్టాన్ని చూపిన సంస్థ, 2021-22 నాటికి రూ. 2.19 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023-24లో మళ్ళీ రూ. 95 లక్షల నష్టాన్ని ప్రకటించింది. అయితే, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా రూ.16 లక్షల టాక్స్ ప్రొవిజన్ (Tax Provision) చూపడం చూస్తుంటే, వ్యాపారానికి సంబంధం లేని ఖర్చులను చూపించి పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం జరిగిందా అనే అనుమానం కలుగుతోంది.అంటే, సొంత ఖర్చులను కంపెనీ అకౌంట్‌లో రాసి టాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.

పెరిగిన ‘ఇతర ఖర్చులు’.. టర్నోవర్ రివర్స్ గేర్ ! 

వ్యాపారం పెరిగితే ఖర్చులు పెరగాలి. కానీ ఇక్కడ విచిత్రంగా ఆదాయం తగ్గుతుంటే ఖర్చులు ఆకాశాన్నంటాయి.  2022-23లో రూ.2.23 కోట్లుగా ఉన్న ‘ఇతర ఖర్చులు’, 2023-24 నాటికి రూ. 3.12 కోట్లకు చేరాయి. ఆదాయం తగ్గుతున్నా ఈ 40% ఖర్చుల పెరుగుదల వెనుక ఉన్న మర్మమేంటో ఐటీ శాఖ తేల్చాల్సి ఉంది.

అంకుర హాస్పిటల్స్ లింక్.. మల్టీ-కంపెనీ నెట్‌వర్క్?

ఈ ఎల్.ఎల్.పి.లో సింహభాగం (80%) వాటా అంకుర మెడికల్ & రీసెర్చ్ సెంటర్ కలిగి ఉండటం గమనార్హం. పదే పదే మారుతున్న నామినీ భాగస్వాములు, రుణాల కోసం బ్యాంకుల మార్పిడి (ndusInd qT+& ICICI కి రూ.1.5 కోట్లకు పెరిగిన రుణం) చూస్తుంటే, ఇది ఒక ‘ప్రాఫిట్ షిఫ్టింగ’ (Profit Shifting) నెట్‌వర్క్ లాగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


అవిజ్ఞ లాబొరేటరీస్ సమర్పించిన డాక్యుమెంట్లలోని పొంతన లేని లెక్కలు, భారీగా మారుతున్న అప్పుల వివరాలు ఐటీ శాఖ దృష్టికి వెళ్తే గనక, భారీ జరిమానాలు మరియు విచారణ తప్పదనిపిస్తోంది. పారదర్శకత కోసం పెట్టిన నియమాలను ఈ సంస్థ తుంగలో తొక్కిందా అనేది వేచి చూడాలి.


Post a Comment

0 Comments

Popular Posts

My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
VIZAG :  QVSE తరహాలోనే SSC DEVELOPERS ఘరానా మోసం !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు..
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
 Neet Ranks : శ్రీచైతన్యలో నీట్‌లో సీటు హామీ పథకమా ? నమ్మేలాలేదే...!?
 Sri Chaitanya : సిగ్గులేని శ్రీచైతన్య... మరోసారి దిగజారి IIT ఫలితాలు !
No Qualified Teachers in SriChaitanya : అనర్హులతో శ్రీచైతన్య పాఠాలు ... విద్యార్థుల భవితపై నీలినీడలు !