Ticker

6/recent/ticker-posts

Neet Ranks : శ్రీచైతన్యలో నీట్‌లో సీటు హామీ పథకమా ? నమ్మేలాలేదే...!?

శ్రీచైతన్య ఏమి చెప్పినా అందరూ నమ్ముతారు ? శ్రీచైతన్య ఏది చూపించినా విశ్వసిస్తారు ? అనే అతివిశ్వాసంతో ప్రవర్తిస్తోంది శ్రీచైతన్య. సమయానికి అనుగుణంగా తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ దోపిడీకి పాల్పడుతోంది. ఇక నుండి శ్రీచైతన్య చెబితే వినే రోజులు మారాయి. ప్రకటనల్లో ర్యాంకులు చూపిస్తే నమ్మే రోజులు పోయాయి. ఇక విషయంలోకి వస్తే శ్రీచైతన్య సోషల్‌ మీడియా వేదికగా నీట్‌ ర్యాంకు అష్యురెన్స్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ప్రకటనలు గుప్పిస్తోంది. అంటే నీట్‌ ర్యాంకుకి హామీ అన్నమాట. అంటే దాదాపుగా గ్యారెంటీ ఇస్తున్నట్లే లెక్క. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. టూత్‌పేస్ట్‌, డెటాల్‌, హ్యాడ్‌వాష్‌ వంటి కంపెనీ ప్రకటనలు ఒక్కసారి గమనించండి...ఏ ప్రకటన చూసినా 99.9  జెమ్స్‌ ఫ్రీ అనే ప్రకటన ఉంటుందే కానీ 100 % జెమ్స్‌ ఫ్రీ అనే ప్రకటన ఉండదు. ఎందుకంటే ఎక్కడా 100% సాధ్యం కాదు. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఆయా సూచనల మేరకు ఏజెన్సీలు 99.9% కి మార్చాయి. అలాంటి శ్రీచైతన్య ర్యాంకుకు హామీ ఎలా ఇస్తుంది ? మరి ర్యాంకు రాని విద్యార్థులందరికీ ఫీజులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందా కూడా చెప్పాల్సింది.

శ్రీచైతన్యలో చదువుతున్న అందరికీ ర్యాంకులు తెప్పించగలదా ?

ఇప్పటికే దేశవ్యాప్తంగా శ్రీచైతన్యలో సీనియర్‌ ఇంటర్‌తో పాటే నీట్‌ వ్రాసే విద్యార్థులతో పాటు లాంగ్‌టర్మ్‌ మరియు రీపీటర్స్‌ బ్యాచ్‌ పేరుతో దాదాపు 60000 మంది నీట్‌లో ర్యాంకు కోసం శ్రీచైతన్యలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ 100 లోపు, 1000 లోపు ర్యాంకుకు హామీ ఇస్తున్నారా ? ఇంత మందికి ర్యాంకు తెప్పించి న్యాయం చేయగలరా ? అయ్యే పనేనా ? జరిగే మాటేనా ? గత ఏడాది నీట్‌ 2023లో శ్రీచైతన్యలో చదివిన విద్యార్థుల సంఖ్య దాదాపు 54000 మంది, శ్రీచైతన్య సగర్వంగా ప్రకటించిన ర్యాంకులు 8793, శ్రీచైతన్యలోనే చదివి మిగిలిన 45000 మంది మెడికల్‌ ర్యాంకులు సాధించలేదు. మరి వారి పరిస్థితి ఏంటి ? మళ్ళీ ఇప్పుడు నీట్‌ ర్యాంక్‌ అష్యూరెన్స్‌ ప్రోగ్రామ్‌ (ర్యాప్‌) పేరుతో మరోసారి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని వంచన చేసే ప్రయత్నం చేస్తోంది శ్రీచైతన్య. నీట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన వారిలో 90% స్కూల్‌ విద్యార్థులే, స్కూల్‌ స్థాయి నుండే ఫౌండేషన్‌ కోచింగ్‌ ఇచ్చాం అని నీతులు చెప్పే శ్రీచైతన్య మరి కేవలం ఇంకా మూడు నెలల్లో నీట్‌ పరీక్ష వ్రాయబోయే విద్యార్థులకు ర్యాంకు హామీ ఎలా ఇస్తుంది ? కేవలం 3 నెలల వ్యవధిలో 7 సంవత్సరాల సబ్జెక్టు ఫండమెంటల్స్‌ మరియు ఫార్ములాలపై ఎలా అవగాహన కల్గిస్తుంది ? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అసలు చేసేది ఏమిటంటే గతంలో నీట్‌ ప్రశ్నాపత్రాలు వాటి సమాధానలు బట్టిపట్టించి నీట్‌కి ప్రిపేర్‌ చేయటమే ర్యాంకు ఎష్యూరెన్స్‌ ప్రోగ్రామ్‌ ఉద్ధేశ్యం.ఈ ప్రకటన వెనుక శ్రీచైతన్య ఉద్దేశ్యం ఏమిటంటే వేరే కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో కొందరైనా శ్రీచైతన్యలో చేరాలనీ, కనీసం స్టడీమెటీరియల్‌ ద్వారా అయినా డబ్బు సంపాదించాలనే యావ తప్ప ర్యాంకు గ్యారెంటీ ఎలా ఇస్తారు.

Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !