Ticker

6/recent/ticker-posts

IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగళూరు మరియు ముంబైలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలలో ఐదు రోజుల పాటు జరిగిన సోదాలను ఆదాయపు పన్ను అధికారులు శనివారం ముగించారు . పన్ను ఎగవేత మరియు నిధులను ఇతర వ్యాపార కార్యకలాపాలకు మళ్లించడం వంటి అనుమానాలపై సుధీర్ఘంగా నిర్వహించిన సోదాలను శనివారం ముగించారు. రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. దర్యాప్తు అధికారులు డిజిటల్‌ ఆధారాలు, ఖాతా పుస్తకాలు, సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల నుండి డేటా మరియు నగదు రుసుము వసూలు రికార్డులను కూడా కనుగొన్నారని వర్గాలు తెలిపాయి. అంతర్గత లావాదేవీల కోసం యాజమాన్యం రెండు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తున్నట్లు సోదాల్లో వెల్లడైంది. ఒకటి విద్యార్థుల ఫీజులు వసూలు చేయడానికి, మరొకటి పన్ను చెల్లింపులను ఎగవేసేందుకు ఉపయోగించారని వెల్లడిరచారు.

75% నగదు రూపంలో !

నివేదికల ప్రకారం, సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలను పరిశీలించినప్పుడు, యాజమాన్యం 75% రుసుములను నగదు రూపంలో వసూలు చేసి, మిగిలిన 25% మాత్రమే పన్నులను ఎగవేసేందుకు ప్రభుత్వానికి నివేదించిందని తేలింది. విద్యార్థుల నుండి సేకరించిన నగదును రియల్‌ ఎస్టేట్‌తో సహా ఇతర వ్యాపార సంస్థలలోకి మళ్లించినట్లు అధికారులు కనుగొన్నట్లు సమాచారం. అక్రమంగా సంపాదించిన నిధులను దేశవ్యాప్తంగా ఏడాది వ్యవధిలోనే వందల కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని దర్యాప్తు అధికారులు వెల్లడిరచారు. ట్యూషన్‌ మరియు అడ్మిషన్‌ ఫీజులలో ఎక్కువ భాగం నగదు రూపంలో వసూలు చేయగా, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌ చెల్లింపులు లేదా చెక్కుల ద్వారా కొద్ది భాగం మాత్రమే నమోదు చేయబడిరదని వెల్లడైంది. ఈ ఆపరేషన్‌ సమయంలో, ఐటీ బృందాలు సంస్థ డైరెక్టర్లు మరియు ముఖ్య ఉద్యోగుల నివాసాలను సోదా చేసి, రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. డైరెక్టర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేక బ్యాంకు లాకర్లను కూడా అధికారులు యాక్సెస్‌ చేశారు. తాజా ఆపరేషన్‌ తర్వాత, పన్ను ఎగవేత కేసు మరియు ఇతర ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలతో వచ్చే వారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని సంస్థ నిర్వహణ మరియు డైరెక్టర్లను పన్ను శాఖ సమన్లు ​​జారీ చేసింది.

విద్యారంగంలో లోపించిన జవాబుదారితనం !

ఐటీ శాఖ పెద్ద ఎత్తున నిర్వహించిన ఆపరేషన్‌లో శ్రీచైతన్య విద్యాసంస్థ యొక్క భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు బహిర్గతం అయ్యింది. ఇది విద్యారంగం ముసుగులో అక్రమాలకు శ్రీచైతన్య పాల్పడినట్లు నిర్థారణ అయ్యింది. ఇక పన్ను ఎగవేత కోసం శ్రీచైతన్య విద్యాసంస్థ అనుసరించిన ద్వంద విధానాలు విద్యారంగంలో జవాబుదారీతనంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. సొసైటీలు/ ట్రస్ట్‌ల పేరుతో విద్యాసంస్థలను నిర్వహిస్తూ ఇష్టారాజ్యంగా ఉల్లంఘనలను పాల్పడుతుండటంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు అయ్యింది. సొసైటీలు/ ట్రస్ట్‌ల్లో జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే ఓ కమిటీ వేసి దోపిడీ విధానలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. శ్రీచైతన్య అక్రమాలకు గట్టి చర్యలు తీసుకోకపోతే ఇతరులు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Post a Comment

0 Comments