Ticker

6/recent/ticker-posts

Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !

  • అనుమతులు లేకుండా కాలేజీల నిర్వహణ ! 
  • నార్త్‌ రెజొనెన్స్‌ వేరు, సౌత్‌ రెజొనెన్స్‌ వేరు. 
  • కానీ అక్కడ ఫలితాలు ఇక్కడ. 
  • అడ్డంగా దొరికిపోయిన రెజొనెన్స్‌ ! 

అనుమతులు లేకుండా కాలేజీల నిర్వహణలో రెజొనెన్స్‌ రాటుదేరిపోయింది. హైద్రాబాద్‌ పరిధిలో దాదాపు 30 క్యాంపస్‌లను నిర్వహిస్తున్న రెజొనెన్స్‌కు కొన్ని క్యాంపస్‌లను అనుతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ప్రజాస్వామ్యం ఆన్‌లైన్‌ వెబ్‌పోర్టల్‌ పరిశోధనలో తేలింది. కె.జి.ఎన్‌.టవర్స్‌, మణికొండ బ్రాంచ్‌తో పాటు హెచ్‌.టి. రోడ్‌, అల్వాల్‌ బ్రాంచ్‌కు పర్మిషన్‌ తీసుకోలేదు. అలాగే వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న కాలేజ్‌కు అనుమతులు లేనట్లు తెలుస్తోంది. మరికొన్ని బ్రాంచీలకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుండి ఎన్‌ఓసీ లేనట్లు వెల్లడైంది. ఒక కాలేజీతో పర్మిషన్‌ తీసుకుని రెండు, మూడు బ్రాంచీలను నిర్వహిస్తుంది రెజొనెన్స్‌. 

మరింత లోతుకి వెళితే...

కోట, రాజస్థాన్‌ వేదికగా నడుపుతున్న రెజొనెన్స్‌కి, సౌత్‌ ఇండియాలోని రెజొనెన్స్‌కి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. కోటకు చెందిన రెజొనెన్స్‌ రెజొనెన్స్‌ ఎడ్యువెంచర్స్‌ లిమిటెడ్‌ పేరు మీద నడుస్తుండగా, హైద్రాబాద్‌కు చెందిన రెజొనెన్స్‌ మాత్రం జూనియర్‌ కాలేజీలకు మైడెన్‌ డ్రాప్‌ ఎడ్యు ఫౌండేషన్‌ సొసైటీ పేరు మీద నడుపుతున్నట్లు తేలింది.అలాగే అకాడమీలకు మైడెన్‌ డ్రాప్‌ ఎడ్యు ఫౌండేషన్‌ ప్రై.లి. కంపెనీ పేరు మీద ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ వెరైటీ ఏమిటంటే నార్త్‌ ఇండియాలో రెజొనెన్స్‌కి వచ్చిన ర్యాంకులు అన్నీ సౌత్‌ ఇండియా రెజొనెన్స్‌ ప్రకటనల్లో వాడుకుంటుంది. ఒకే కంపెనీ మీద లేదా ఒక సొసైటీ మీద నడవని కాలేజీలు ఒకే పేరు మీద ప్రకటనలు గుప్పించటం చట్ట రిత్యా నేరం. ఇంకా వేరైటీ ఏమిటంటే అకాడమీలు, జూనియర్‌ కాలేజీలు ఒకే బిల్డింగ్‌లో నడుపబడుతున్నాయి. ఇక లోగో విషయానికి వస్తే రెజొనెన్స్‌ జూనియర్‌ కాలేజెస్‌ విత్‌ ఐఐటి`జెఈఈ అండ్‌ నీట్‌. జూనియర్‌ కాలేజీలు సొసైటీ లేదా ట్రస్ట్‌ పేరు మీద నడవాలి కానీ జేఈఈ, నీట్‌ కోచింగ్‌ మాత్రం అకాడమీ లేదా కోచింగ్‌ సెంటర్‌ మీద నడవాలి. కానీ రెండిరటిని కలిపి రెజొనెన్స్‌కు నిబంధనలు వర్తించవు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇంటర్‌ విద్యామండలి ఇక నైనా నిద్ర లేచి చర్యలు తీసుకుంటుందా లేక అలాగే నిద్ర నటిస్తుందా చూడాలి. 

అమలు కాని నిబంధనలు ! 

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలల విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్‌ అమలు చేయాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు తరగతులు ప్రారంభించాలని రూల్స్‌ ఉన్నా  ప్రవేటు కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం పాటించటం లేదు.  నిబంధనలు పాటించని కాలేజీ గుర్తింపు రద్దు చేసే అధికారం ఉన్నా అధికారులు చర్యలు తీసుకోరు. ఇక అనుమతి లేని కళాశాలల సంగతి సరే సరి. అడుగడుగునా నిబంధనలు బేఖాతర్‌ చేస్తున్నాయి. 

రొజొనెన్స్‌ స్కూల్స్‌కి కొన్నింటికే పర్మిషన్‌ ?

2026`27 విద్యాసంవత్సంలో ప్రారంభించబోతున్న రెజొనెన్స్‌ 16 స్కూల్స్‌కి కొన్నింటికి మాత్రమే పర్మిషన్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ సంవత్సరం కొన్ని స్కూల్స్‌కి పర్మిషన్‌ తీసుకుని వచ్చే సంవత్సరం కొన్ని తీసుకునే ఆలోచనలో రెజొనెన్స్‌ యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. ఎవరైనా అడిగితే 2 లేదా 3 బ్రాంచీలకు సంబంధించి ఒకటే పర్మిషన్‌ చూపించి మభ్యపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఒకేసారి అన్నింటికీ పర్మిషన్‌ అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి రావటంతో యాజమాన్యం ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులారా పారాహుషార్‌. రెజొనెన్స్‌ స్కూల్‌కి పర్మిషన్‌ లెటర్‌ ఉంటేనే చేర్పించండి. లేదంటే వేరే ఆప్షన్‌ చూసుకోవలసినదిగా విన్నవిస్తున్నాము. 





Post a Comment

0 Comments