Ticker

6/recent/ticker-posts

anasuya-talks-about-war-with-vijay : ఇంతటితో ముగించాలనుకుంటున్నా - అనసూయ

  

నటుడు విజయ్‌ దేవరకొండతో ట్వీట్టర్‌ వార్‌పై నటి అనసూయ తొలిసారి స్పందించారు. గతంలో విజయ్‌ తనకు మంచి స్నేహితుడని, కొన్ని పరిస్థితుల వల్ల తమ మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్‌ ఆన్‌లైన్‌ వార్‌పై మాట్లాడారు. 

 ట్రోల్‌ చేయడం

విజయ్‌ దేవరకొండ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’లో అభ్యంతరకర పదాలను మ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌ విజిట్‌కు వెళ్లి ఆయన.. అక్కడ ఉన్న అభిమానులతో ఆ పదాలను పలికించారు. ఒక తల్లిగా అది నన్నెంతో బాధించింది. ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ మొదలయ్యాయి. ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన నేను విజయ్‌ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’లో నటించాను. విజయ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్‌ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్‌ అయ్యాను. విజయ్‌కు తెలియకుండానే ఇది జరుగుతోందా? అనిపించింది. విజయ్‌ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదు. కానీ, ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి’’ అని ఆమె చెప్పారు.

అనసూయ-విజయ్‌ దేవరకొండ మధ్య గత కొంతకాలంగా ట్వీట్టర్‌ వేదికగా కోల్డ్‌ వార్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె తరచూ విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్స్‌ చేసేవారు. ఇటీవల ఆయన నటించిన ‘ఖుషి’ పోస్టర్‌పై ‘ది విజయ్‌ దేవరకొండ’ అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్స్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్‌ అభిమానులు ఆమెను ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా