Ticker

6/recent/ticker-posts

FIITJEE : క్లోజ్‌ అవుతున్న ఫిడ్జి కోచింగ్‌ సెంటర్లు !

  • ఆర్థిక సంక్షోభమే కారణం అంటూ ఊహాగానాలు ! 
  • ఇబ్బందుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు !

దేశంలో పోటీ పరీక్షల కోచింగ్‌ పేరెన్నికగన్న ఫిట్జీ సంస్థ ఆకస్మాత్తుగా తన కోచింగ్‌ సెంటర్లను మూసివేయడం వివాదస్పదమైంది. యూపీ, ఢల్లీిల్లోని ఫిట్జీ కోచింగ్‌ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు. వారం రోజుల నుంచి ఆ సెంటర్లు తెరవపోవడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు.

ఆర్థిక సంక్షోభంలో ఫిట్జీ కోచింగ్‌

ఫిడ్జిలోని అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోవడంతోనే అనేక మంది సంస్థను వీడుతున్న నేపథ్యంలో ఫిట్జీ కోచింగ్‌ కేంద్రాలు మూతపడినట్లుగా సమాచారం. ఫిట్జ్‌లో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. లైసెన్సులు లేవని, ఫైర్‌ సేఫ్టీ రూల్స్‌ పాటించడం లేదని ఆరోపణలు నేపథ్యంలో ఆ సంస్థ బ్రాంచీలపై ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోవైపు బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఫిట్జ్‌ కోచింగ్‌ కేంద్రాలను మూసివేయడం పట్ల విద్యార్థులు, పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్‌ సంస్థ తమకు ఎటువంటి నోటీసు కానీ రిఫండ్‌ కానీ ఇవ్వలేదంటూ మూసివేసిన బ్రాంచీల వద్ద విద్యార్థులు, పేరెంట్స్‌ ఆందోళనకు దిగారు. ఐఐటీ ఢల్లీి నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన డీకే గోయల్‌ ఫిట్జీ సంస్థను 1992లో స్థాపించారు. ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలకు కోచింగ్‌ ఇవ్వడంలో మంచి గుర్తింపు పొందిన ఫిట్జీ సంస్థ దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 కోచింగ్‌ కేంద్రాలకు విస్తరించింది. సంస్థలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంతో పలు నగరాల్లోని కోచింగ్‌ సెంటర్లు మూతపడటంతో ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, పేరెంట్స్‌ కూడా ఇబ్బంది పడుతున్నారు.




Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !