- కోచింగ్ సెంటర్ ముసుగులో ఇంటర్ కాలేజీల నిర్వహణ !
- స్కూల్స్ , కాలేజీ, కోచింగ్ సెంటర్లు అన్ని ఒకే బిల్డింగ్‌లో.
- అడ్మిషన్ల కోసం అలెన్ పేరు, అనుమతులేమో అక్షర !
- నిబంధనలకు పాతర !
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు !
- విద్యార్థులకు, తల్లిదండ్రులకు కుచ్చు టోపీ !
- విద్యార్థుల జీవితాలతో ఆటలా !
మన
ఘనత వహించిన అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్‌కి హైద్రాబాద్‌లో అనుమతులు లేవు
అంటే నమ్ముతారా ? ఇది నిజంగా నిజం. 25 సార్లు జేఈఈ, ప్రీ మెడికల్‌లో
ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించామని డప్పు కొట్టుకుంటున్న అలెన్ కెరీర్
ఇనిస్టిట్యూట్‌కి హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న 11 బ్రాంచీలను అనధికారికంగా
నిర్వహిస్తోందని ప్రజాస్వామ్యం ఆన్‌లైన్ న్యూస్ పరిశీలనలో తేలింది.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని మాధాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్,
మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, మణికొండ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అలెన్
కెరీర్ ఇనిస్టిట్యూట్ ఇంటర్ బోర్డ్ నుండి ఎలాంటి అనుమతులు లేవు. జేఈఈ
మెయిన్ / అడ్వాన్స్‌డ్ మరియు నీట్ వంటి కోచింగ్ మాత్రమే పర్మిషన్లు
తీసుకుని అనధికారికంగా ఇంటర్ కాలేజీలను నిర్వహిస్తోంది. ఇది చట్ట
విరుద్దం. ఏ అడ్రస్‌లో ఏ కాలేజ్ ఉంటే చట్ట ప్రకారం అదే కాలేజీ పేరుతో
అనుమతులు ఉండాలి. కానీ అలెన్ పూర్తి విరుద్ధంగా అక్షర జూనియర్ కాలేజ్
(58374) కొత్తపేట పేరు మీద దాదాపు 6 పాత కాలేజీలను అలెన్ పేరుతో అనధికార
దందా నడుపుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మరో 5 నూతన కాలేజీలను ఓపెన్
చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు పూర్తిగా కొత్త
పర్మిషన్లు తీసుకోవల్సి ఉంది. కానీ అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ ఎలాంటి
అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కితున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ మీద ఇంటర్ బోర్డ్‌కి ఫిర్యాదులు
అందినా అధికారులు నోటీసులు ఇచ్చి సరిపుచ్చుతున్నారు. ఏ కాలేజీపై చర్యలు
తీసుకున్న దాఖలాలు లేవు. అక్షర జూనియర్ కాలేజీ యాజమాన్యం మరియు అలెన్
ప్రాంఛైజీ నిర్వహకులు ఒకటే కావటం వల్ల ఈ దందా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
అనుమతి లేని అలెన్ కాలేజీలను మూసివేయాలి !
విద్యార్థి జీవితంలో ఇంటరీడ్మియట్ విద్య ఎంతో కీలకం, అందుకే అలెన్ అకాడమీ లను అడ్డంపెట్టుకుని ఇంటర్ విద్యను బోధిస్తూ సొమ్ము చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. అక్షర జూనియర్ కాలేజీతో టైఅప్ పెట్టుకున్నట్టు కలరింగ్ ఇస్తూ నాటకాలకు తెరతీస్తోంది. అక్షర జూనియర్ కాలేజ్ పేరుతోనే కాలేజీలను నడపాల్సి ఉండగా, అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ ప్రై.లిమిటెడ్ పేరుతో విద్యార్థులను చీట్ చేస్తోంది. అలెన్ పేరుతో ర్యాంకులు చూపించి అడ్మిషన్లు దండుకుంటోంది. దీనితో పాటు 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్‌తో తరగతులు నిర్వహిస్తోంది. దీనికి అక్షర స్కూల్ పేరు మీద నడవటం గమనార్హం. అలెన్‌కు దేశవ్యాప్తంగా ఎన్నో అకాడమీలు, కోచింగ్ సెంటర్‌లు/ ట్రెనింగ్ ఇనిస్టిట్యూట్‌లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో నిబంధనల ప్రకారం జేఈఈ, నీట్ వంటి కోచింగ్ సెంటర్‌లు మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారికంగా ఇంటర్ విద్యాబోధన చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇంటర్ విద్య బోధిస్తున్న అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ పై ఇంటర్ బోర్డ్‌లు అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితంతో చలగాటమాటే అలెన్ లాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

0 Comments