- శ్రీచైతన్యలో చదివే లక్షలాది మంది విద్యార్థులే టార్గెట్‌గా శ్రీచైతన్య నయా స్కెచ్
- ఒలింపియాడ్స్, వర్క్‌షాప్స్, టెస్ట్‌సిరీస్, కోర్స్‌ల పేరుతో దోపిడీకి సరికొత్త వ్యూహం !
- శ్రీచైతన్య ప్రాడజీ పేరుతో నయా వెబ్‌సైట్ !
- శిక్షణలో భాగం కాదు, ! ప్రతి కోచింగ్‌కి అదనపు ఫీజు !
- ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా శిక్షణ.
- కష్టం విద్యార్థులది, ఫలితమేమో శ్రీచైతన్యది.
- ఇప్పటికే ఐఎన్‌టీఎస్‌ఓ ఎడ్యుకేషన్, క్యాట్ వంటి ఫేక్ ఒలింపియాడ్స్‌తో దోపిడీ చేస్తున్న శ్రీచైతన్య.
- తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దండుకుంటున్న శ్రీచైతన్య
- ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు, కనీసం హైకోర్టులైన సుమోటాగా కేసులు నమోదు చేయలేవా ?
- శ్రీచైతన్య విద్యాసంస్థల మొత్తాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్.
కార్పొరేట్
స్కూల్స్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాలు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కార్పొరేట్ స్కూల్స్ ఆడిరదే ఆటగా
మారింది. ఆయా కార్పొరేట్ సూల్స్ నిబంధనలను తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే స్కూల్ ఫీజులు, డొనేషన్‌లు, పుస్తకాలు,
డ్రస్‌లు ఇవీకాక ఐఐటి/ నీట్ ఫౌండేషన్స్ పేరుతో వేలు, లక్షల రూపాయలు ఫీజుల
రూపంలో దోపిడీ చేస్తుంది. ఇది చాలదన్నట్టు అదనపు ఆదాయం కోసం కొత్త రకం
దందాకు తెరతీసింది శ్రీచైతన్య. ఇప్పటికే ఫేక్ ఒలింపియాడ్స్‌ను
నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్న శ్రీచైతన్య, ఒలింపియాడ్స్
కోచింగ్, వర్క్‌షాప్స్ కోచింగ్, టెస్ట్‌సిరీస్ కోచింగ్ అంటూ వేలకు
వేలు ఫీజలు వసూలు చేసేందుకు శ్రీచైతన్య ప్రాడజీ పేరుతో ఓ వేదికను సిద్ధం
చేసింది. దీనిలో వివిధ రకాల ఒలింపియాడ్స్, వర్క్‌షాప్స్ మరియు
టెస్ట్‌సిరీస్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే స్కూల్ ఫీజుల
భారంతో తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులపై మరింత భారం మోపేందుకు సిద్ధం
అయ్యింది. వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న శ్రీచైతన్య
విద్యలో భాగంగా ఉచితంగా అందించే అవకాశం ఉన్నా అలాంటి ఏర్పాట్లు చేయకుండా
దోపిడీకి పథకం రూపొందించింది. శ్రీచైతన్యలో చదివే లక్షలాది మంది
విద్యార్థులను దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఎగ్జామ్స్ వ్రాసే
ప్రతి విద్యార్థికి మెడల్స్ వస్తాయని గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు.
ఇప్పటి దాకా వచ్చిన బహుమతులను లెక్కిస్తే కేవలం వేళ్ళ మీదే లెక్క
పెట్టవచ్చు. ఇక ఈ కోచింగ్ కూడా శ్రీచైతన్యలో చదివే స్కూల్ మరియు కాలేజీ
చదివే విద్యార్థులనే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వేరే
ఇతర ప్రైవేట్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులను ఆయా ప్రైవేట్ స్కూల్స్
శ్రీచైతన్యలో కోచింగ్‌కు అనుమతించవు.
దోపిడీని విస్తృతం చేసుకుంటున్న శ్రీచైతన్య !
ఒలింపియాడ్స్‌ను
పోలిన పేర్లతో ఇప్పటికే శ్రీచైతన్యనే తన వాళ్ళతో ఫేక్ ఒలింపియాడ్స్
నిర్వహిస్తూ దోచుకుంటున్నది చాలదన్నట్టు ఈసారి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన
ఒలింపియాడ్స్‌కు శిక్షణ పేరుతో వేలాది రూపాయలు దోచుకునేందుకు సిద్ధం
అయ్యింది. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే సాధ్యమైయ్యే
ఒలింపియాడ్ ఎగ్జామ్స్‌ను అందరి చేత రాయించేందుకు ప్రణాళిక సిద్ధం
చేసింది.అందుకు మంచి శిక్షణ శ్రీచైతన్యలో మాత్రమే ఉన్నట్లు ప్రకటనల ద్వారా
ఊదరగోడుతోంది. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటోంది
శ్రీచైతన్య. మీ పిల్లలు ఒలింపియాడ్స్ రాస్తే భవిష్యత్తులో ఐఐటి సాధించే
అవకాశం ఉంటుంది అని తల్లిదండ్రుల్ని మభ్యపెడితే చాలు పిల్లలకు ఆ సబ్జెక్టు
ఇష్టం ఉందా లేదా, చదువుల ఒత్తిడిని తట్టుకోగలడా లేదా అనేది తల్లిదండ్రులు ఏ
మాత్రం ఆలోచించటం లేదు. డబ్బులు కడుతున్నాం నువ్వు చదువు అని పిల్లల్నిపై
పెనుభారాన్ని మోపుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక పిల్లలు
అల్లాడిపోతున్నారు అనే విషయం తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.
ఐఐటి/ నీట్ ఫౌండేషన్స్ అంతా బూటకం !
లేని ఓ పోటీ ప్రపంచాన్ని సృష్టించి, తల్లిదండ్రుల మనస్సులో భయం అనే విషాన్ని నింపి, విద్యార్థులను పోటీప్రపంచం అనే పంజరంలో బంధించి దాని నుండి డబ్బు దండుకోవటం శ్రీచైతన్యకు మాత్రమే సాధ్యమైన దృష్ట ఆలోచన. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్‌ల కోసం నిర్వహించే పరీక్షలను అడ్డంగా పెట్టుకుని స్కూల్ స్థాయి పిల్లలందరి చేత ఒలింపియాడ్స్ వ్రాయించి వీలైనంత దోచుకోవాలన్నదే శ్రీచైతన్య ప్రాడజీ లక్ష్యం. మీ పిల్లాడి చేత ఒలింపియాడ్ రాయిస్తాం, గెలిపిస్తాం అని రాజకీయ నాయకుల మాదిరి హమీలతో తల్లిదండ్రులను మాయపుచ్చుతోంది శ్రీచైతన్య. 6 వ తరగతి నుండే ఐఐటి / నీట్ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాం దీంతో మీ వాడిని ఐఐటి ర్యాంకర్‌ని చేస్తాం, డాక్టర్ సీటు తెప్పిస్తాం అని అకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రల్ని మభ్యపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ప్రకటన వలలో చిక్కిన కష్టమర్స్ (తల్లిదండ్రులు)ని ట్యూషన్ ఫీజు, డొనేషన్, బిల్డింగ్ ఫండ్ అంటూ నిలువునా దోచేస్తున్నారు. 8, 9, 10 వ తరగతిలోని సబ్జెక్టుల్లోని అంశాలనే 6, 7 వ తరగతుల్లో బోధించటమే ఐఐటి/ నీట్ ఫౌండేషన్. పాపం చిన్న పిల్లల అవగాహన సామర్థ్యం ఎంత అని కూడా ఆలోచించకుండా ఫౌండేషన్ పేరుతో చిన్న బ్రెయిన్స్‌పై అనవసరపు ఒత్తిడిని పెంచుతున్నారు. ఇది వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కార్పొరేట్ స్కూల్స్‌లో విద్యార్థులను ప్రతిభవంతులైన విద్యార్థులను ఓ గ్రూపుగా మిగతా వారని మార్కులను బట్టి వేరే వేరే గ్రూపులుగా విభజించి క్లాసుల నిర్వహణ జరుగుతుంది. టెక్నో కరిక్యులమ్, సి`బ్యాబ్, ఆ బ్యాబ్ అంటూ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ఐఐటి / నీట్ టాప్ ర్యాంకు ఆశ చూపి అదనంగా డబ్బులు గుంజుతున్నారు. మేము చెప్పే ఐఐటి / నీట్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకోవటం ద్వారానే ఒలింపియాడ్స్‌లో విజయాలు సాధిస్తున్నారు అని మభ్యపెడుతోంది శ్రీచైతన్య. అన్ని ఒలింపియాడ్స్‌లో విజేతల సంఖ్య కేవలం పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం.
ఒలింపియాడ్స్ విద్యార్థులపై అదనపు ఒత్తిడే !
మంత్లీ
ఎగ్జామ్స్, క్వాటర్లీ ఎగ్జామ్స్, ఆఫ్‌ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రాక్టీస్
ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఇలా విద్యార్థికీ ప్రతి రోజూ ఒక పరీక్షే.
పోటీ ప్రపంచం పేరుతో పరీక్షల మీద పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల
బాల్యాన్ని చిదిమేస్తూ, మరోవైపు చదువు పేరుతో మెదడుపై ఒత్తిడిని పెంచుతూనే
ఉన్నాయి కార్పొరేట్ సంస్థలు. ఇవి సరిపోవన్నట్లు కార్పొరేట్ సంస్థలు ఏ
పరీక్షలు చెబితే అవి గుడ్డిగా నమ్మి ఎగ్జామ్స్ పేరుతో మీ పిల్లలను
తీవ్రఒత్తిడికి గురి చేస్తూ, మరో వైపు సొమ్మును కోల్పోతున్నారు. ఇప్పటికైనా
మేల్కోకుంటే రాబోయే తరాలు ఒత్తిడితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడే
ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులపై అంత ప్రేమ,
వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని చెప్పే శ్రీచైతన్య
స్టూడెంట్స్‌కి ఉచితంగా ఇలాంటి ఒలింపియాడ్స్ నిర్వహించవచ్చు కదా అనే
అభిప్రాయం తల్లిదండ్రుల నుండి వ్యక్తం అవుతోంది.
బాల్యం చెర...
ఆహ్లాదంగా గడపాల్సిన బాల్యాన్ని కార్పొరేట్ సంస్థల పంజరాల్లో బందీని చేశాయి నేటి విద్యావిధానాలు. పోటీప్రపంచం అనే బూచిని చూపి తరగతి గోడల మధ్య జీవిత ఖైదీగా మార్చాయి. జైలు లాంటి తరగతి గదుల్లో బాల్యాన్ని బిక్కుబిక్కుమంటూ వెళ్ళదీస్తున్న మనసుల్ని పరికించి చూసే తీరిక ఎవరికీ లేదు. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం తప్పించి, బాహ్య ప్రపంచంలో తర్కంతో ఎలా మసులుకోవాలో తెలియని విద్యార్థులు కోకొల్లలు. రోజులో 10 నుండి 14 గంటలు చదువు పేరుతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. మానసిక పరిణతి లేక విద్యార్థులు వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే ఆటలు లేవు, పాటలు లేవు. అందమైన బాల్యానికి జ్ఞాపకాలు అంతకంటే లేవు. కార్పొరేట్ స్కూల్స్‌కి జీవితకాలపు కష్టమర్స్‌లా బ్రతుకు ఇంకెంత కాలమో కాలమే నిర్ణయించాలి.


0 Comments