హైదరాబాద్ మహానగరంలో స్కూల్స్ సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతుంది. లాభసాటి వ్యాపారంగా ఉండటంతో కొత్త సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ప్రతి ప్రాంతానికి విస్తరించాయి. అదే కోవలో రెజొనెన్స్ సంస్థ కొత్తగా స్కూల్ విద్యలోకి ప్రవేశించింది. ఒకే సారి 16 స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటనల ద్వారా తెలిపింది. కార్పొరేట్ గుత్తాధిపత్యం క్రింద నలిగిపోతున్న తల్లిదండ్రులకు మరో ప్రత్యామ్నాయంగా కొత్త స్కూల్స్ రావలసిన అవసరం ఎంతో ఉంది. కాంపిటీషన్ ఎంత ఉంటే అంత క్వాలిటీ పెరుగుతుంది. కానీ కొత్త స్కూల్స్ కూడా కార్పొరేట్ విషనాగుల నీడలోనే కొనసాగితే తల్లిదండ్రుల పరిస్థితి ఆందోళనకరమే.అన్ని కార్పొరేట్ సంస్థల్లాగే...అందరూ చెప్పేదే !
ప్రతి విద్యార్థిని మేము 8 కోణాల్లో ఆవిష్కరిస్తాం. జీవితానికి సరైన పునాది వేస్తాం, ప్రతి పీరియడ్‌లో మార్కుల కంటే జీవితాన్ని మలచడానికే వినియోగిస్తాం అంటూ గారడీ మాటత్తో తల్లిదండ్రుల్ని మాయచేయడానికి మరో సంస్థ రంగం సిద్ధం చేసుకుంటోంది. కార్పొరేట్ మాయా ప్రపంచంలోకి ఎంటరయ్యే వరకే ఈ మాటలు ఆ తర్వాత వారు చేసేది చూడటం తప్ప తల్లిదండ్రులు చేసేది ఏమి లేదు. మాట మీద నిలబడే సంస్థలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి. 8 కోణాల్లో విద్యార్ధులను ఆవిష్కరిస్తాం అంటున్న రెజొనెన్స్ స్కూల్స్ బాండ్ పేపర్ మీద గ్యారెంటీ ఇవ్వగలదా ? మీ పిల్లల భవిష్యత్తును కచ్చితంగా తీర్చిదిద్దగలగని ?
డబ్బుల కోసం...ఒలింపియాడ్ ప్రోగ్రామ్, విజడమ్ ప్రోగ్రామ్ !
ఈ ప్రోగ్రామ్‌కి ఇంత రేటు, ఆ ప్రోగ్రామ్‌కి ఇంత రేటు...అంతే తప్ప...చదువులో పెద్ద తేడా ఉండదు. చెప్పేది అంతా ఒక్కటే సిలబస్. ప్రతి స్టూడెంట్‌ని 8 కోణాల్లో అభివృద్ధి చేస్తాం అంటారే తప్ప నిజంగా చేసి చూపించే సంస్థలు ఎన్ని ? మీ అబ్బాయి సరిగా చదవటం లేదు ? మీ పిల్లాడి కెపాసిటీ ఇంతే ? అని సాకులు చెప్పకుండా తీసుకున్న ఫీజులకు న్యాయం సంస్థలు ఎన్ని ఉన్నాయి ? అన్ని కార్పొరేట్ సంస్థల మాదిరిగానే అదే కమర్షియల్ ధోరణి రెజొనెన్స్ స్కూల్స్‌కి కనిపిస్తోంది.
అసలు రొజొనెన్స్ స్కూల్స్‌కి పర్మిషన్స్ ఉన్నాయా ?
2026-27 విద్యాసంవత్సంలో ప్రారంభించబోతున్న రెజొనెన్స్ 16 స్కూల్స్‌కి అసలు పర్మిషన్స్ ఉన్నాయా ? ఈ సందేహంతోనే రెజొనెన్స్‌కు ఈ-మెయిల్ చేసినా యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేదు. స్కూల్స్‌కి పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు నిర్వహించటం చట్టవిరుద్దం. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి కార్పొరేట్ సంస్థలు బరితెగించి వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే స్కూల్స్ నిర్వహించే నాటికి అన్ని కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే రొజొనెన్స్ స్కూల్స్ వ్యవహరిస్తుంది అనడానికి ఎలాంటి డౌటు లేదు.
0 Comments