Ticker

6/recent/ticker-posts

ALLEN AP : ఆంధ్రాలోనూ అలెన్‌ ముసుగు దందా !

అలెన్‌కు ఐఐటిలో 100 లోపు ఇన్ని ర్యాంకులు, అలెన్‌కు నీట్‌లో 100 లోపు ఇన్ని ర్యాంకులు...అంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలెన్‌ పేరుతో ఇంటర్‌ విద్యలో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడ, విశాఖపట్నంలో అలెన్‌ పేరుతో నడుస్తున్న సంస్థలు అసలైన అలెన్‌వి కావు. అవి సంకల్ప ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌కు చెందినవి, ఇక పోతే తిరుపతి అలెన్‌ పేరుతో నడిచే సంస్థకు రాజు జూనియర్‌ కాలేజీ పేరుతో నడుపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ కాలేజీ పేరుతో అనుమతులు తీసుకుంటే ఆ పేరుతోనే నడపాల్సి ఉంది. కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా నడిచే సంస్థలతో అలెన్‌ టై అప్‌ పెట్టుకుని సర్టిఫికెట్లలో లోకల్‌ విద్యాసంస్థల పేరుతో తల్లిదండ్రులను , విద్యార్థులను మోసం చేస్తోంది. అలెన్‌కు దేశవ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు / అకాడమీలకు మాత్రమే పర్మిషన్‌ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్వహించే కోచింగ్‌ సెంటర్‌/ అకాడమీలకు అయినా అనుమతి ఉందా అంటే అదీ అనుమానమే. విశాఖపట్నం అలెన్‌ యాజమాన్యాన్ని సంప్రదిస్తే అతిత్వరలో అందుబాటులోకి వస్తాం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఒకే క్యాంపస్‌లో రెండు కాలేజీల నిర్వహణ ఎలా ?

కోచింగ్‌ సెంటర్‌లు వేరు, ఇంటర్‌ కాలేజీలు వేరు. వేర్వేరుగా పర్మిషన్లు తీసుకుని ఒకే క్యాంపస్‌లలో నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇవి అన్ని సర్వసాధారణం. అధికారులతో కుమ్మక్కు అయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు అనటానికి అలెన్‌ ` సంకల్ప ఎడ్యుకేషన్‌  మరియు అలెన్‌ ` రాజు జూనియర్‌ కాలేజ్‌ వ్యవహరమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి కమర్షియల్‌ పోటీ పరీక్షలకు మాత్రమే కోచింగ్‌ సెంటర్ల నిర్వహణ మాత్రమే చేయవలసి ఉంది. కానీ ఇంటర్‌తో పాటే ఈ పోటపరీక్షల కోచింగ్‌ ఆనవాయితీగా మారటంతో ఇంటర్‌ కాలేజీల పర్మిషన్లు వేరే కాలేజీలతో నిర్వహించే దందాకి తెరతీసింది. ఏ క్యాంపస్‌ని అయినా నిశితంగా గమనించండి అలెన్‌ జూనియర్‌ కాలేజీ అనే ఎక్కడా ఉండదు.  ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి కేవలం కమర్షియల్‌ ట్రైనింగ్‌ సర్విస్‌లను మాత్రమే ఇవ్వగలదు.  

మీ పిల్లాడు చదివేది అలెన్‌ కాదు ! 

మీ పిల్లాడు అలెన్‌లో చదువుతున్నాడా ? ఒక్కసారి ఫీజు రశీదు చెక్‌ చేసుకోండి, వేరే ఎదో లోకల్‌ కాలేజీ పేరు ఉంటుంది. లక్షల్లో డబ్బులు కట్టి ఊరు పేరు లేని కాలేజీలో చదివించటం ఎంత వరకు కరెక్టో తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి. పేరుకే అలెన్‌లో చదువుతున్నారు, కానీ సర్టిఫికెట్‌ లోకల్‌ కాలేజీ. దానిలోని అధ్యాపకులు కూడా లోకల్‌ వాళ్ళే. ఇప్పటిదాకా టాప్‌ ర్యాంకులు సాధించిన దాఖలాలు కూడా లేవు, కేవలం నార్త్‌ ఇండియా ర్యాంకులతో మభ్యపెడుతూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులను దోచుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి అక్రమార్కులను సమర్థిస్తే భవిష్యత్తులో మరింత మంది ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది. అలెన్‌ వాళ్ళు చేస్తున్నది తప్పు కానప్పుడు మేము చేస్తే తప్పా అని ప్రతి ఒక్కరూ తప్పుడు దారిలో నడిచే అవకాశం లేకపోలేదు. 


Post a Comment

0 Comments