- నయవంచనకు కేరాఫ్ అడ్రస్‌గా రెజొనెన్స్ !
- MEGA RESOFAST - 2025 స్కాలర్‌షిప్ ఫలితాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం.
- బహిరంగ పరిచేందుకు విముఖం.
- రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ
- 80% పైగా మార్కులు వచ్చిన వారికి LEVEL - 2 ఎగ్జామ్ అంటూ మెలిక
- ఒక్కో విద్యార్థి నుండి 300/- ఎగ్జామ్ ఫీజు వసూలు !
- టాబ్లెట్లు, మెమెంటోలతోనే మమ.
- ఇతర స్కూల్స్‌లోని విద్యార్థుల వివరాల కోసమే SCHOLARSHIP TEST !
తల్లిదండ్రులను వంచించటంలో ఇతర కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే రెజొనెన్స్ మాస్టర్ డిగ్రీ తీసుకుంది. Mega Reso Fast - 2025 పేరుతో రూ. 100 కోట్ల Scholarship Test అంటూ ఊదరగొట్టిన రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రుల చెవుల్లో పూలు పెట్టింది. కనీసం స్కాలర్‌షిప్ ఫలితాలను బహిరంగ పరచలేక పోయింది. ఫలితాను కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం చేసింది. పరీక్ష వ్రాసిన ఆయా విద్యార్థులు మాత్రమే ఫలితాలు పొందేలా చర్యలు తీసుకుంది. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే స్కాలర్‌షిప్ ఫలితాలను బహిరంగ పరిచి ఎంత మంది విద్యార్థులు రూ. 100 కోట్లు స్కాలర్‌షిప్ పొందారో వారి వివరాలు వెల్లడిరచినట్లతే Resonanceపై విశ్వసనీయత ప్రపంచానికి తెలిసేది. కానీ అంతా గోప్యత పాటించటం వలన ఇతర కార్పొరేట్ స్కూల్ మాదిరిగానే ఎలాంటి కొత్తదనం లేని స్కూల్స్‌గా మొదటిలోనే విశ్వసనీయతను కోల్పోయింది.
నిజాయితీ లేదు ?
స్కాలర్‌షిప్ ఎగ్జామ్ ఎంత మంది వ్రాశారు. ఏ ఏ తరగతుల వారు ఎంత మంది ఉన్నారు. ఎంత మంది స్కాలర్‌షిప్ సాధించారు అనే వివరాలు ఎక్కడా ప్రకటించలేదు రెజొనెన్స్ స్కూల్. అంతకు ముందు కూడా ప్రతి తరగతిలో ఏ ర్యాంకు సాధిస్తే ఎంత స్కాలర్‌షిప్ వస్తుంది అనే క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. మోసాల పునాదులపై కార్పొరేట్ ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది రెజొనెన్స్ స్కూల్స్. ఎక్కడ నిజాయితీ లేదు, పారదర్శకత లేదు. రూ. 100 కోట్లు అనే స్కాలర్‌షిప్ ఎర వేసి విద్యార్థుల వివరాలు సేకరించటమే ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలైన పరమార్థంగా తెలుస్తోంది.
బాధ్యత తీసుకోని జే.డి. లక్ష్మీనారాయణ !
రెజొనెన్స్ స్కాలర్‌షిప్ టెన్ట్‌కి ప్రచారకర్తగా వ్యవహరించిన జె.డి. లక్ష్మీనారాయణ స్కాలర్‌షిప్‌ను విద్యార్థులకు అందజేసే బాధ్యత ఎక్కడ తీసుకున్న పాపాన పోలేదు. సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు ఇలా బాధ్యత మరిచి వ్యవహరించటం బాధాకరం. మెగా రెసో ఫాస్ట్ 2025 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన లక్ష్మీనారాయణ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్ రాయమని ప్రచారం చేసిన వ్యక్తికి దగ్గర ఉంది రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్ ఇప్పించవలసిన బాధ్యత జె.డి. లక్ష్మీనారాయణకు లేదా ? తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్న రెజొనెన్స్ స్కూల్స్ యాజమాన్యాన్ని నిలదీయాల్సిన అవసరం లేదా ? ఈ విషయంపై జె.డి. లక్ష్మీనారాయణ వివరణే కీలకంగా మారింది.

0 Comments