Ticker

6/recent/ticker-posts

SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !

  • శ్రీచైతన్యలో చేరి మోసపోతున్న మెడికల్‌ విద్యార్థులు !
  • ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు లేక వెలవెలబోతున్న శ్రీచైతన్య ! 
  • క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ అంటూ ఆల్‌కేటగిరీ ర్యాంకులతో మోసం !!

ఒక వైపు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని జలగలా పీల్చుతూ..మరోవైపు లేని ర్యాంకుల్ని ఉన్నట్లు మభ్యపెడుతూ అడ్డంగా దొరికిపోతోంది. నీట్‌ 2025 ప్రకటన అందుకు వేదికగా నిలిచింది. 1, 5, 6, 8, 10, 11 వంటి ర్యాంకులు ప్రముఖంగా ప్రకటించింది శ్రీచైతన్య. కానీ అవి అన్నీ వివిధ కేటగిరీ ర్యాంకులు అని చిన్న చిన్న అక్షరాలతో ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులుగా భావించేలా ప్రమింపజేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. శ్రీచైతన్యకు 10 లోపు ఓపెన్‌ కేటగిరీ ర్యాంకు ఒక్కటంటే ఒక్కటీ రాకపోవటం శ్రీచైతన్య దుస్థితికి నిదర్శనం. 33 వ ర్యాంక్‌ నుండి శ్రీచైతన్యకు ర్యాంకులు ప్రారంభం కావటం శ్రీచైతన్య చదువుకు అద్దంపడుతోంది. 

పేరు గొప్ప, ఊరు దిబ్బ  

హీరోయిన్‌ శ్రీలీల ఫోటో వేసి మీర డాక్టర్‌ కలలను ఈజీగా నేరవేర్చుతాం అంటూ ఊదరగొడుతోంది. కానీ ఫలితాలు మాత్రం పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నాయి. ఇక పోతే ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 19 ర్యాంకులు ప్రకటించిన శ్రీచైతన్య వాటిలో వచ్చింది కేవలం 11 ర్యాంకులు మాత్రమే. మిగిలిన 8 ర్యాంకులు డి.ఎల్‌.పి (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌)/ ఏ.ఐ.టి.ఎస్‌ (ఆల్‌ఇండియా టెస్ట్‌ సిరీస్‌) ర్యాంకులే. ఇక 500 లోపు, 1000 లోపు ర్యాంకుల్లో ఇంకెన్ని డి.ఎల్‌.పి.లు ఉంటాయో మీ రే ఊహించుకోవచ్చు. ఈ సంవత్సరం దాదాపు 25000 లకు పైగా విద్యార్థులు దేశవ్యాప్తంగా శ్రీచైతన్యలో చదివితే వచ్చిన ర్యాంకులు వందల్లోనే ఉండటం గమనార్హం. ఇక జనరల్‌ ఈ.డబ్యూ.ఎస్‌ కేటగిరీ సంబంధించి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థి కవీష్‌ క్లాస్‌రూమ్‌ విద్యార్థిగా ప్రకటించింది. కవీష్‌ ఓపెన్‌ కేటగిరీ ర్యాంక్‌ 35,  ఇతడు చదివింది ఆకాష్‌ విద్యాసంస్థలో అని ఆకాష్‌ విద్యాసంస్థ ప్రకటించుకుంది. కవీష్‌ శ్రీచైతన్య అకాడమీలో చదివినట్టు వీడియో వదిలి అతితెలివి ప్రదర్శించింది. దీనితో శ్రీచైతన్య నమ్మకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

నీట్‌లో శ్రీచైతన్య వెనుకబాటుకు కారణాలు 

శ్రీచైతన్యలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీని బోధించే అనుభజ్ఞులైన అధ్యాపకలు అందరూ వేరే కార్పొరేట్‌ కాలేజీలకు వలస పోతుంటడంతోనే శ్రీచైతన్య ర్యాంకులు తగ్గుతున్నాయి అనేది విద్యార్థుల మాట. శ్రీచైతన్య యాజమాన్యం నిర్లక్ష్యం, జీతాల కోతల కారణం ఒకటి కాగా, మరో వైపు మంచి జీతాలు ఇచ్చే కార్పొరేట్‌ కాలేజీల ఆగమనం వల్ల అటువైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు విజయవాడ లాంటి చోట లెక్చరర్లు అందరూ కలిసి సొంత సంస్థ స్థాపించి శ్రీచైతన్యను వీడుతుండటం పెద్దదెబ్బగా చెప్పవచ్చు.  

Post a Comment

0 Comments