Ticker

6/recent/ticker-posts

Fake Ayurvendam Doctor : కాంపౌండర్ డాక్టర్‌గా మారితే !

  • డాక్టర్‌గా నాకు అర్హత లేదు అని స్వయంగా ఒప్పుకున్న నాగరాజు
  • నా దగ్గర 6 గురు డాక్టర్లు పనిచేస్తున్నారు అంటూ ముక్తాయింపు !
  • స్పెషలిస్ట్ డాక్టర్లు చేయాల్సిన పని నాగరాజు ఎందుకు చేస్తున్నట్టు !
  • ప్రతి ప్రకటనలోనూ నాగరాజే వైద్యం చేస్తున్నట్టు స్పష్టంగా ఉంది.
  • ప్రకటనల్లో మరియు ప్రమోషనల్ వీడియోల్లో గ్యారెంటీ ఇవ్వటం నేరం !
  • జుట్టురాని వారికి డబ్బు తిరిగి ఇచ్చేసే దుమ్ము నాగరాజుకి ఉందా ? 
  • ఫిర్యాదు చేసిన స్పందించని ఆయుష్ శాఖ.

గొర్రె కసాయి వాడినే నమ్మినట్టు...నాగరాజు అనే నకిలీ అయుర్వేద డాక్టర్‌ని నమ్ముతున్నారు. పాముకి పాలు పోసి పెంచినట్టు ప్రజలు ఆదరిస్తున్నారు. ఏదో ఒక రోజు అసలు నాగరాజు డాక్టర్ కాదు కాంపౌండర్ అనే చేదు నిజం తెలిసిన రోజు వీడినా మనం నమ్మింది అని ముక్కున వేలేసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళితే అన్ని ప్రాడక్ట్‌ల మీద ఒకటే లైసెన్స్ మరియు బ్యాచ్ నెంబర్ ఉంది అన్న అనుమానంతో ఆయుర్వేదం సర్టిఫికేట్లు అడిగిన పాపానికి నకిలీ జర్నలిస్ట్ అని ముద్ర వేస్తూ ఎవరు ఇలాంటి ఆర్టికల్స్ నమ్మవద్దు అంటూ వీడియో చేసి తన కస్టమర్లను నమ్మించే ప్రయత్నం చేశాడు 

ఫేక్ డాక్టర్ నాగరాజు వీడియోలో మాట్లాడుతూ...

నేను డాక్టర్‌ని కాకపోవచ్చు నా దగ్గర 6 గురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ట్రీట్‌మెంట్ చేస్తారు అని చెప్పారు. అంటే అర్హత లేదు, వైద్యం చేయడానికి పనికి రాను అని నాగరాజు తనకి తానే ఒప్పుకున్నట్టే కదా. మరి ఎందుకు అన్ని చోట్ల నాగరాజే వైద్యం చేస్తున్నట్లు వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారో చెప్పాలి. క్వాలిఫైడ్ డాక్టర్లే కదా వైద్యం చేయాలి, వారి వీడియోలు కదా పెట్టాలి. కానీ అసలు నాగరాజు పెట్టే వీడియోలో డాక్టర్లు ఉన్నట్లే ఉండదు. అనధికారికంగా కాంపౌండరే డాక్టర్ వైద్యం చేస్తున్నట్లు ఉంది. ఇది ముమ్మాటికీ వంచించటం కాదా ? అంత నైతిక విలువలు ఉన్న వ్యక్తి అయితే స్పెషలిస్ట్ డాక్టర్‌లచే వైద్యం చేపించవచ్చు కదా. 

నిబంధనలకి విరుద్దం ! 

డాక్టర్ కాదు అన్ని ఒప్పుకున్న నాగరాజు వైద్యం ఎందుకు చేస్తున్నారు ? సోషల్ మీడియాలో నాగరాజు వీడియోలతో ఎందుకు ప్రచారం చేస్తున్నారు ? ఇలా చేయటం నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్, 2019, సెక్షన్ 34 ప్రకారం నేరం. రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ కాకుండా ఎవరికైనా వైద్యం చేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు 5 లక్షల వరకు జరిమానా విధించటం ఈ చట్టం యొక్క ప్రత్యేకత. భారతదేశంలో అర్హత లేని వ్యక్తులు ప్రాక్టీస్ చేయడాన్ని ఈ చట్టం ప్రకారం నిషేధం ఉంది. బట్టతల మీద జుట్టు వస్తుంది ? మోకీళ్ళలో గుజ్జు వస్తుంది అని గ్యారెంటీ ఇవ్వటం తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు వినియోగదారుల రక్షణ చట్టాలు అనుసరించి డ్రగ్స్ మరియు మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్, 1954 , సెక్షన్ 3 & 4 ప్రకారం చట్ట రిత్యా నేరం. ఈ సెక్షల ప్రకారం మొదటిసారి నేరం చేస్తే 6 నెలల జైలు, రెండోసారి నేరం చేసే ఒక సంవత్సరం జైలు శిక్ష వేసే వీలుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాంపుల పేరుతో నాగరాజు వైద్యం చేయటం స్పష్టంగా ఉంది, అలాగే జుట్టు పెరుగుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనే విషయాలు స్పష్టంలో వీడియాలలో ఉంది. ఆయా వీడియాలను పరిగణనలోకి తీసుకుని నాగరాజుపై వీలైనన్నీ కేసుల పెట్టవచ్చు. ఇప్పటికే ఆయుష్ శాఖకు మరియు ప్రకటనల రంగానికి సంబంధించిన వారికి ఫిర్యాదు చేయటం జరిగింది.ఈ ఫేక్ డాక్టర్ని బ్యాన్ చేసే వరకు మా పోరాటం ఆగదు.

సిగ్గుచేటు ! 

ఒక కాంపౌండర్ కూడా పనికిరాని నాగరాజు దగ్గర 6 గురు స్పెషలిస్ట్ వైద్యులు పనిచేయటం ఎంత సిగ్గు చేటు. ఈ 6 గురు స్పెషలిస్ట్ వైద్యులను అడ్డుపెట్టుకుని వారు చేయాల్సిన వైద్యాన్ని నాగరాజే చేస్తుండటం గమనార్హం. ఆయుర్వేద వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతం. చదువులేని వాడి దగ్గర చదువుకున్న ఆయుర్వేద వైద్య నిపుణులు పని చేయటం, అతడు చేసే మోసాల్ని మౌనంగా చూస్తూ సపోర్ట్ చేయటం ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా ? చదువుకున్న ఆయుర్వేద వైద్యుల కంటే చదువుకోని వాడి ఆయుర్వేదానికే ఎక్కువ డిమాండ్ ఉందని స్పెషలిస్ట్ వైద్యులే చెప్పకనే చెబుతున్నారు.

ప్రజలకు సేవ చేస్తున్నట్లు అభివర్ణన !

తనకు తానే దైవదూతగా భావించి బట్టతల లేని ప్రపంచాన్ని చూడటం తన ఉద్ధేశ్యంగా వీడియోల్లో ప్రచారం చేస్తున్న నాగరాజు ఏం సేవ చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి. 100 గ్రాములు సుహ్నాది తైలం రూ. 2300/` అమ్మటం సేవ లేక దోపిడీనో ప్రజలే తేల్చుకోవాలి. ప్రతి కస్టమర్ దగ్గర మినిమం 5300 నుండి 7000 వరకు వసూలు చేయటం లక్ష్యంగా పెట్టుకున్న ఫేక్ డాక్టర్‌ది సేవ అంటారా అనేది ప్రజలే తేల్చుకోవాలి. అంత ప్రజా సేవ చేయాలి అనుకుంటే 100 /` లకే నూనె మరియు ఇతర టాబ్లెట్స్ అందించి ప్రజల్ని ఆదుకోవాలి. దోచుకోకూడదు.

ఒక్కో పేషెంట్ నుండి రూ. 5000/- నుండి 7000/- వసూలు !

ప్రతి రోజూ క్యాంపుల పేరుతో వివిధ జిల్లా కేంద్రాలు తిరుగుతూ ఒక్కో పేషెంట్ నుండి రూ. 5000/- నుండి 7000/- వసూలు చేస్తున్నాడు. రోజుకి 200 మంది చొప్పున పేషెంట్లకు సేవలందిస్తూ రూ. 10 లక్షల నుండి 12 లక్షల చొప్పున వెనకేసుకుంటున్నాడు. మళ్ళీ దీనిని సేవ చేస్తున్నాను అంటూ మొసలికన్నీరు కార్చుతున్నాడు. అలా నెలకి ఈజీగా 20 క్యాంప్‌ల పేరుతో నెలకు 2 కోట్లు దోచుకుంటున్నాడు. ఈ సంపాదనతో హైదరాబాద్ కూకట్‌పల్లిలో, గుంటూరులో ఐజెక్స్ ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో హాస్పిటల్స్ ఓపెన్ చేశాడు. దీనిలో ఆయుర్వేదంతో పాటు ీVAమియోపతి, అల్లోపతి సేవలు అంటూ ప్రచారం చేస్తున్నాడు. కేవలం 5 సంవత్సరాల్లో ఆయుర్వేదం మందులు అమ్మే వ్యక్తి హాస్పిటల్స్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగాడు. ఎంత దోచుకుంటే హాస్పిటల్ పెట్టొచ్చు మీ రే ఆలోచించండి.

బట్టతల మీద జుట్టు మొలవదు : డాక్టర్లు 

జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే బట్టతలపై మందులు లేదా నూనెలతో మళ్లీ జుట్టు రావడం దాదాపు అసాధ్యం. అక్కడ వెంట్రుకల ఫోలికల్స్ పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. ఇక పోషకాహార లోపం, ఒత్తిడి లేదా ఇన్ఫెక్షన్ల వల్ల జుట్టు రాలితే, సరైన చికిత్స మరియు నూనెలతో (స్నూహ్యాది తైలం వంటివి కాదు, అవి వేరే సమస్యలకు) తిరిగి జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది.

పోషకాహార లోపం వారికి పనిచేస్తుంది.

స్నూహ్యాది తైలం వాడిన ప్రతి ఒక్కరికీ జుట్టు పెరగాలి, కానీ కొంత మందికే దాని రిజల్ట్ కనిపిస్తోంది. 90% పైగా నిరాశలో ఉన్నారు. కొత్తగా జుట్టు వచ్చిన వారిని కొంత మందిని ప్రమోట్ చేసుకుంటూ 90 మందిని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు. పోషకాహార లోపం కారణంగా జుట్టు ఊడిపోయిన వారికి పనిచేస్తుంది. జన్యుపరంగా పరంగా బట్టతల ఉన్న వారికి ఈ మందు పనిచేయటం లేదని వాడిన వినియోగదారులు చెప్తున్నారు.  దారుణమైన ప్రచారంతో అందరినీ మభ్యపెడుతూ మార్కెటింగ్ మాయజాలంతో నాగరాజు డబ్బు దండుకోవటం మొదలుపెట్టాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బట్టతలపై జుట్టు పెంచడానికి స్నూహ్యాది తైలం వాడతారని ఆయుర్వేద గ్రంథాలలో ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. సరే ఇంత ఎందుకు జుట్టురాని వారికి డబ్బు తిరిగి ఇచ్చేసే దుమ్ము నాగరాజుకి ఉందా ? 

ఉపశమనం మాత్రమే, గుజ్టు రాదు !

మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్), అధిక బరువు, వృద్ధాప్యం, గాయాలు, కీళ్లపై ఎక్కువ ఒత్తిడి (మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం), విటమిన్ డి3 లోపం, బలహీనమైన కండరాలు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వైద్య పరిస్థితుల వల్ల వస్తాయి. ఇవి కీళ్లలో వాపు, నొప్పులు మరియు కదలికలో ఇబ్బందులను కలిగిస్తాయి. మోకీళ్ళ నొప్పులకు వివిధ రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆయుర్వేదాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న నాగరాజు ఇవేమి పట్టనట్టు మోకాళ్ళకు పట్టీలు వేసి తగ్గిస్తాను అన్ని ఛాలెంజ్‌లు చేస్తున్నాడు. ఒక్కరిద్దరీ కాదు నాగరాజు దగ్గరకు విచ్చేసే అందరికీ శాస్త్రీయంగా తగ్గించి చూపిస్తే నాగరాజు వేసే శిక్షలకు మేము సిద్ధం. అసలు నాగరాజు వేసే పట్టీలో ఏముంది ? అందులోని కెమికల్ మోకాలిలోకి ఎలా వెళుతుంది ? మోకాలు లోపల గుజ్జును ఎలా పెంచుతుంది అనే శాస్త్రీయంగా వివరించి తగ్గించి చూపగలరా ? 

Post a Comment

0 Comments

Popular Posts

Fake Ayurvedic Doctor : పట్టీల నాగరాజు కాదు...దోపిడీ కాట్‌రాజ్ !
Fake Ayurvendam Doctor : కాంపౌండర్ డాక్టర్‌గా మారితే !
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
ALLEN AP : ఆంధ్రాలోనూ అలెన్‌ ముసుగు దందా !
ALLEN : అలెన్‌ పేరుతో అక్షర మార్క్‌ దందా !
Sri Chaitanya Hostel : శ్రీచైతన్యపై చర్యలు ఉండవా ? రంగంలోకి AP ‘ముఖ్య’నేత !?
Score Edge 2024 : చీటింగ్‌ శ్రీచైతన్య ! రూ. 1000 కోట్లు బోగస్‌ స్కాలర్‌షిప్‌ !!
Resonance School : తల్లిదండ్రుల నమ్మకం కోల్పోయిన రెజొనెన్స్‌ !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Vijaya SaiReddy Tweet on Nellore Narayana : నెల్లూరు నారాయణ వేధింపుల పర్వంపై విజయసాయి ట్వీట్‌ !