Ticker

6/recent/ticker-posts

ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?

  • అంకుర హాస్పిటల్స్ మాదినగూడ LLPలో ఆస్తుల మాయం.. 
  • రూ. 70 కోట్ల అప్పు....అసలేం జరుగుతోంది ? 

హైదరాబాద్: సామాన్యులకు వైద్యం అందించే ఆసుపత్రులు తెరవెనుక చేసే ఆర్థిక లావాదేవీలు ఒక్కోసారి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాయి. ప్రముఖ వైద్య సేవల సంస్థ ‘అంకుర హాస్పిటల్స్ మదీనాగూడ ఎల్.ఎల్.పి’ సమర్పించిన దశాబ్ద కాలపు ఆర్థిక రికార్డులను పరిశీలిస్తే, కేవలం వైద్యం మాత్రమే కాదు, అకౌంటింగ్ లెక్కల్లోనూ ఈ సంస్థ ‘అద్భుతాలు’ చేస్తోందని అర్థమవుతోంది. రాత్రికి రాత్రే ఆస్తులు మాయం కావడం, వ్యాపారం లేకపోయినా అప్పులు పెరగడం వంటి అంశాలు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాత్రికి రాత్రే మాయమైన రూ. 5.3 కోట్ల విలువైన ఆస్తులు? 

ఈ సంస్థకు సంబంధించిన అత్యంత విస్తుగొలిపే అంశం ఆస్తుల విలువలలో వచ్చిన మార్పు. మార్చి 31, 2022 నాటికి ఈ హాస్పిటల్ వద్ద రూ. 5,37,47,021 (రూ. 5.3 కోట్లు పైచిలుకు) విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, కేవలం ఏడాది తిరిగే సరికి అంటే మార్చి 31, 2023 నాటికి ఈ ఆస్తుల విలువ సున్నా (0) గా చూపబడింది. ఒక హాస్పిటల్‌లోని మెడికల్ ఎక్విప్‌మెంట్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఒక్క ఏడాదిలోనే ఎలా మాయమవుతాయి? ఆస్తులను విక్రయించినట్లు ఆదాయం చూపకుండా, తమకే చెందిన ఇతర సంస్థలకు తక్కువ ధరకు బదిలీ చేయడం ద్వారా పన్ను ఎగవేతకు (Section 40A(2)  ఉల్లంఘన) పాల్పడ్డారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

రూ. 70 కోట్ల ‘పార్టనర్ డెట’ : 

అంకుర సంస్థలో పెట్టుబడి కేవలం రూ. 10,00,000 (పది లక్షలు) మాత్రమే. కానీ, ‘పార్టనర్స్ కరెంట్ అకౌంట’ పేరిట ఉన్న అప్పులు మాత్రం కొండలా పెరిగిపోయాయి. 2018లో రూ. 2.9 కోట్లుగా ఉన్న ఈ అప్పులు, 2025 నాటికి ఏకంగా రూ. 7,02,31,000 (రూ. 7 కోట్లు పైచిలుకు) కు చేరాయి.  వ్యాపారం లేని సమయంలో కూడా ఇంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇది ఆదాయాన్ని అప్పుల రూపంలో మార్చి పన్ను ఎగవేసే మార్గమా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సెక్షన్ 68 (Unexplained Cash Credits) కింద విచారణకు అర్హమైన అంశం.  

రూ. 23 కోట్ల టర్నోవర్ నుండి ‘జీరో’ కి పతనం 

వ్యాపార నిర్వహణలో వచ్చిన వింత మార్పులు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ సుమారు రూ. 23.11 కోట్ల టర్నోవర్ సాధించింది. కానీ, 2023 నుండి టర్నోవర్ సున్నా గా నివేదించబడింది. విచిత్రమేమిటంటే, వ్యాపారం ఏమీ లేకపోయినా ఆడిటర్లకు ఫీజులు చెల్లించడం, ఇతర నిర్వహణ ఖర్చులు చూపించడం గమనార్హం. 

20కి పైగా అంకుర సంస్థల నెట్‌వర్క్ 

ఈ సంస్థ ప్రధాన భాగస్వాములైన కృష్ణ ప్రసాద్ రావు ఉన్నం మరియు టి. శ్రీనిధిలు అంకుర బ్రాండ్ పేరుతో దాదాపు 10 నుండి 20 ఇతర కంపెనీలలో డైరెక్టర్లుగా లేదా పార్టనర్లుగా ఉన్నారు. ఒక సంస్థలో వచ్చిన లాభాలను మరొక నష్టాల్లో ఉన్న సంస్థకు మళ్లించడం ద్వారా గ్రూప్ మొత్తం మీద కట్టాల్సిన పన్నును తగ్గించుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. విచిత్రమేమిటంటే, ఈ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ నుండి తీసుకున్న రూ. 75 లక్షల రుణాన్ని చెల్లించి 2024 జనవరిలో ‘నో డ్యూస’ సర్టిఫికెట్ కూడా పొందింది. బయటి బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తున్న ఈ సంస్థ, సొంత భాగస్వాములకు మాత్రం రూ. 70 కోట్లు బాకీ ఉండటం వెనుక ఏదో మర్మం దాగి ఉంది.

లోతైన విచారణ అవసరం 

ఆస్తుల మాయం, భారీ అంతర్గత అప్పులు, ఆదాయం లేని వ్యాపారాలు.. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి (Financial Irregularity) సంకేతాలుగా ఉన్నాయి. అంకుర హాస్పిటల్స్ మాదినగూడ ఎల్.ఎల్.పి. కి సంబంధించిన లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ యొక్క ఇన్వెస్టిగేషన్ వింగ్ సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయి.

 

Post a Comment

0 Comments

Popular Posts

My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
VIZAG :  QVSE తరహాలోనే SSC DEVELOPERS ఘరానా మోసం !
 Neet Ranks : శ్రీచైతన్యలో నీట్‌లో సీటు హామీ పథకమా ? నమ్మేలాలేదే...!?
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
 Sri Chaitanya : సిగ్గులేని శ్రీచైతన్య... మరోసారి దిగజారి IIT ఫలితాలు !
ChatGPT: చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు..
Resonance : రెజొనెన్స్‌ బరితెగింపు !
No Qualified Teachers in SriChaitanya : అనర్హులతో శ్రీచైతన్య పాఠాలు ... విద్యార్థుల భవితపై నీలినీడలు !