Ticker

6/recent/ticker-posts

Ankura Hospital ఉప్పల్ LLPలో భారీగా ఆర్థిక అక్రమాలు ?

  • భారీ టర్నోవర్ నుంచి సడెన్‌గా ‘జీరో’ ఆదాయం ! 
  • నిధుల మళ్ళింపుపై పలు అనుమానాలు ! 
  • పన్ను ఎగవేత కోసమేనా ?

హైదరాబాద్: ప్రముఖ విద్యాసంస్థలు మరియు కార్పొరేట్ శక్తుల ఆర్థిక పారదర్శకతపై నిరంతరం నిఘా ఉంచే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కథనంలో భాగంగా, ‘అంకుర హాస్పిటల్స్ ఉప్పల్ ఎలఎల్‌పి’ (ANKURA HOSPITALS UPPAL LLP) సమర్పించిన వార్షిక నివేదికలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గడచిన ఐదేళ్ల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, ఈ సంస్థ ఆదాయం మరియు ఆస్తుల నిర్వహణలో తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కోట్లలో టర్నోవర్ చూపించిన హాస్పిటల్ సంస్థ... గత సంవత్సరంలో అకస్మాత్తుగా “జీరో టర్నోవర” ప్రకటించడం... కానీ కోట్లలో నగదు, రుణాలు మాత్రం కొనసాగుతుండటం వెనుక ఏం జరుగుతోంది. ఇది సాధారణ వ్యాపార పరిణామమా? లేక ఆర్థిక మాయాజాలమా? 

ఏడాదిలోనే మాయమైన రూ. 20 కోట్ల టర్నోవర్ !

ఈ సంస్థ సమర్పించిన ఫారం-8 (Form-8) నివేదికల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంకుర హాస్పిటల్ ఉప్పల్ ఎల్.ఎల్.పి. ఏకంగా రూ. 20.78 కోట్ల నికర టర్నోవర్‌ను నమోదు చేసింది. అయితే, ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి ఏడాది అంటే 2022-23 నాటికి ఈ ఆదాయం ఒక్కసారిగా ‘సున్నా’(0)కు పడిపోయింది. విజయవంతంగా నడుస్తున్న ఒక ఆసుపత్రి ఏడాది వ్యవధిలో రూపాయి కూడా ఆదాయం లేకుండా ఎలా మారిందనేది పలు సందేహాలకు తావిస్తోంది. కానీ అదే సమయంలో సంస్థలో 80 లక్షలకు పైగా నగదు, 1.4 కోట్లకు పైగా లోన్స్ & అడ్వాన్స్‌లు, రూ. 2 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు పత్రాలు చెబుతున్నాయి. అసలు వ్యాపారమే లేకపోతే ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ మరియు రెగ్యులేటరీ సంస్థల ముందున్న అతిపెద్ద ప్రశ్న.  

నిధుల మళ్లింపుపై అనుమానాలు

సంస్థ ఆర్థిక స్థితిగతుల్లో మరో కీలకమైన అంశం ‘ఆస్తుల తగ్గింపు’ (Asset Liquidation). 2021-22లో సంస్థ వద్ద రూ. 7.09 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, 2022-23 నాటికి అవి రూ. 2.30 కోట్లకు పడిపోయాయి. అంతేకాకుండా, 2025 మార్చి నాటి నివేదిక ప్రకారం, సంస్థ యొక్క ఫిక్స్‌డ్ అసెట్స్ (Fixed Assets) విలువ ‘సున్నా’ గా చూపబడింది. ఈ మధ్య కాలంలో ఆస్తులు అమ్మిన రికార్డు లేదు, బదిలీ వివరాలు లేవు, క్యాపిటల్ గెయిన్స్ ఎక్కడా చూపలేదు. ఆదాయం లేకపోయినా, భాగస్వాముల ఖాతాలకు నిధులను బదిలీ చేయడం ద్వారా సంస్థను ఆర్థికంగా ఖాళీ చేసే ఉద్ధేశ్యంతోనే చేస్తున్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో స్పష్టమవుతోంది.  

చట్టపరమైన ఉల్లంఘనలు మరియు తప్పుడు సమాచారం

ఈ సంస్థ సమర్పించిన పత్రాలలో చట్టపరమైన లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టర్నోవర్ రూ. 40 లక్షలు దాటలేదని సంస్థ డిక్లరేషన్ ఇచ్చింది. కానీ, వాస్తవ గణాంకాలు మాత్రం రూ. 20 కోట్లకు పైగా ఆదాయాన్ని చూపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఉద్ధేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సంవత్సరం రూ. 25 లక్షలకుపైగా కస్టమర్ల నుండి అడ్వాన్స్‌లు తీసుకున్నట్లు చూపగా, తరువాత సంవత్సరాల్లో పూర్తిగా మాయం చేశారు. దీనిని ఆదాయంగా చూపించారా ? లేక తిరిగి ఇచ్చేశారా అనే వివరాలు ఎక్కడ పొందుపరచలేదు. కంపెనీ సెక్రటరీ ధృవీకరణ పత్రాలలో కూడా హోదా విషయంలో (Fellow vs Associate) పొంతన లేని సమాచారం పొందుపరిచారు.

ఖర్చులు లేవు... ఉద్యోగులు లేరు... కానీ డబ్బు ఉంది

2024--25లో జీతాలు సున్నాగా నమోదు చేశారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు సున్నా, ఇతర ఖర్చులు సున్నాగా చూపించారు. కానీ కోట్లలో నగదు, అడ్వాన్స్‌లు ఉన్నాయి. ఈ చర్యలను బట్టి గమనిస్తే దీనిని మేనేజ్‌మెంట్ షెల్ కంపెనీగా ఉపయోగిస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతోంది.  

దర్యాప్తు కోరుతున్న పౌరసమాజం !

కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన ఒక వైద్య సంస్థ, అకస్మాత్తుగా కార్యకలాపాలు నిలిపివేసి, ఆస్తులను తగ్గించుకోవడం వెనుక భారీ పన్ను ఎగవేత లేదా నిధుల మళ్లింపు కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. విద్యా మరియు వైద్య రంగాలలో కార్పొరేట్ శక్తుల ఆగడాలను ప్రశ్నించే బాధ్యతాయుతమైన పౌర సమాజం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.







Post a Comment

0 Comments

Popular Posts

My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
AVI CLINIC : IT కన్నుగప్పేలా ‘AVI’ మాయాజాలం ?
Ankura Hospital ఉప్పల్ LLPలో భారీగా ఆర్థిక అక్రమాలు ?
Siddhartha Public School : సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ‘షెల్ ’ కంపెనీల గుట్టు రట్టు !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Target Babu : చంద్రబాబుపై సిఐడి రెండు పిటీషన్‌లు !