షేర్
మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి
సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసిన ఓ ముఠా ఉదంతం ఇప్పుడు గుంటూరులో సంచలనం
రేపుతోంది. ‘అవని వారి క్యాపిటల్ & ఇన్వెస్టర్స’ పేరుతో సాగించిన ఈ
మాయాజాలంలో వందలాది మంది బాధితులు రోడ్డున పడ్డారు. ఎర వేసింది ఇలా..
ఈ దోపిడీ వెనుక దూపాటి వీరాంజనేయ ప్రసాద్, పెడర్ల విజయలక్ష్మి ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దంపతులు పెట్టుబడిని కేవలం 20 నెలల్లో 3 రెట్లు అవుతుందని నమ్మబలికారు. లక్ష రూపాయల పెట్టుబడికి నెలకు రూ. 10,000 భారీ వడ్డీ (అంటే సంవత్సరానికి 120%) ఇస్తామని ఆశ చూపారు. అదేసమయంలో పెట్టుబడిదారులను చేర్పించిన ఏజెంట్లకు లక్షకు వెయ్యి రూపాయల చొప్పున కమీషన్ ఇస్తూ నెట్‌వర్క్‌ను విస్తరించారు.
నమ్మించి ముంచారు!
ప్రారంభంలో నమ్మకం కలిగించడం కోసం కొన్ని నెలల పాటు సక్రమంగా వడ్డీలు చెల్లించారు. దీంతో ఆకర్షితులైన బాధితులు తమ వద్ద ఉన్న నగదుతో పాటు, బంధువులు, స్నేహితుల దగ్గర అప్పులు తెచ్చి రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద 200 నుండి 300 మంది బాధితుల నుండి రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
మనీ సర్క్యులేషన్ & నిధుల మళ్ళింపు
నిజానికి వీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం లేదు, వీరికి అంత అనుభవం లేదు, కనీసం షేర్ మార్కెట్ గురించిన అవగాహన లేక పోవటం గమనార్హం. గుంటూరు పట్టణంలో ఒకరిద్దరు అనుభవం ఉన్న షేర్ మార్కెట్ చేసే వ్యక్తులతో తమ ఆఫీసులోనే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు నమ్మించారు. కానీ వారు చేసింది మాత్రం ఒకరి డబ్బును మరొకరికి ఇచ్చే ‘మనీ సర్క్యులేషన’ దందా చేస్తున్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసూలు చేసిన సొమ్మును అవని రియల్ ఎస్టేట్, విజయశ్రీ వారాహి చిట్‌ఫండ్స్ వంటి ఇతర సంస్థలకు మళ్లించారు. అంతే కాకుండా ఈ నిధులను పెడర్ల విజయలక్ష్మీ కూతురు పేరు మీద భారీగా ఆస్తులు, బంగారం కూడబెట్టినట్లు తెలుస్తోంది.
బెదిరింపులకు దిగుతున్న నిర్వాహకులు
గత కొన్ని నెలలుగా వడ్డీలు చెల్లించడం ఆపేసిన యాజమాన్యం ‘బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి’ అని సాకులు చెబుతూ కాలయాపన చేశారు. బాధితులు గట్టిగా నిలదీస్తే సదరు యాజమాన్యం ఎదురుదాడికి దిగుతోంది. “మాకు గుంటూరులో పెద్ద పెద్ద అధికారులు తెలుసు, కేసులు పెట్టుకున్నా మాకేం కాదు” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నిందితులు ఇప్పటికే ఐ.పి. పెట్టి ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు వినిపిస్తుండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.
తీవ్ర ఆగ్రహంలో భాదితులు !
గత నెలలో రాష్ట్రం విడిచి పారిపోయిన షేర్ మార్కెట్ ట్రేడింగ్ నిర్వహకుడు అన్నం పూర్ణ చంద్రరావు కేసులు పోలీసులు నిర్లక్ష్యం వహించటంతో భాదితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రూ. 30 నుండి రూ. 50 కోట్లు మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తుంటే కేవలం రూ. 47 ýక్షల రూపాయలు మాత్రమే ఫ్రాడ్ జరిగిందని కేసు కట్టడంతో భాదితులు తీవ్ర ఆవేదన ఉన్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోతుంటడంతో మోసాలకు అలవాటు పడిన దూపాటి వీరాంజనేయ ప్రసాద్, పెడర్ల విజయలక్ష్మీ లాంటి వారు పోలీసులు మమ్మల్ని ఏమి చేయరు, ఒక వేళ కేసులు కడతారు, మమ్మల్ని ఏమి పీకలేరు అంటూ బాధితులను బెదిరిస్తుండటం గమనార్హం.
దూపాటి వీరాంజనేయ ప్రసాద్ నేపథ్యం !
దూపాటి వీరాంజనేయ ప్రసాద్ గురించి ఆరా తీయగా 2012లోనే అరండల్‌పేట, బి.ఆర్.కె. కాంప్లెక్స్‌లో సుప్రభాతం అగ్రిఫామ్స్ ఎస్టేట్స్ పేరుతో భారీగా కస్టమర్లను ముంచేసినట్టు తెలుస్తోంది అనంతరం కొన్ని రోజులు అజ్ఞాతం అనంతరం తన పాత బిజినెస్ పాట్నర్ అన్నం వెంకట పూర్ణచంద్రరావు మొదలుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న బిజినెస్ మోడల్‌ను కాపీ కొట్టి వీరాంజనేయ ప్రసాద్ అవని వారి క్యాపిటల్ & ఇన్వెస్టర్స్ పేరుతో ప్రారంభించి 20 కోట్లు సేకరించారు. ఇక్కడ అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే వీరాంజనేయ ప్రసాడ్‌కి డిన్ (డైరెక్టర్ అడెంటిఫికేషన్ నెంబర్) రెండు ఉండటం. 2012లో 06362374 అనే డిన్ నెంబర్ ఉండగా 2025 డిసెంబర్‌లో నెలకొల్పిన విజయశ్రీ వారాహి చిట్‌ఫండ్ ప్రై.లి.కంపెనీలోని డిన్ నెంబర్ (11340753) వేర్వేరుగా ఉండటం గమనార్హం. భారతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒక డైరెక్టర్ అడెంటిఫికేషన్ నెంబర్ మాత్రమే ఉండాలి. కానీ నిuంధనలకు విరుద్ధంగా రెండు డిన్ నెంబర్లు ఉండటం చట్టరిత్యా నేరం. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 153 & 154 ప్రకారం చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. భారీ జరిమానాతో పాటు తీవ్రమైన కేసులలో మోసపూరిత చర్యలకు గాను కఠిన చర్యలు తీసుకోవచ్చు.
0 Comments