Ticker

6/recent/ticker-posts

My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!

  • మైల్యాండ్ ఇన్‌ఫ్రా ‘రియల’ మాయాజాలం: 
  • బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన వైశ్యరాజు శ్రీనివాసరాజు కంపెనీ!
  • ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో చేతులెత్తేసిన మైల్యాండ్ సంస్థ.. నిలిచిపోయిన చెల్లింపులు!
  • రూ. 10 వడ్డీ ఆశచూపి 80 కోట్ల వసూళ్లు.. నిలదీస్తే వెన్నుచూపిన ప్రతినిధులు.
  • గుంటూరులో నెల రోజుల్లోనే కోటి రూపాయల దోపిడీ.. అమాయక ఖాతాదారుల్లో గుబులు!

నకిలీ హోదాలు, లేని ల్యాండ్ బ్యాంకులు, అడ్డగోలు వాగ్దానాలతో అమాయక ప్రజల రక్తాన్ని పిండుకుంటున్న ‘మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స’ అసలు రంగు బయటపడింది. రియల్ ఎస్టేట్ ముసుగులో సాగుతున్న ఈ అక్రమ పెట్టుబడుల దందా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పూర్తిగా కుప్పకూలిపోయింది. నమ్మిన ఖాతాదారులను నట్టేట ముంచుతూ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ కంపెనీ బోర్డు తిప్పేయగా, తాజాగా  విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోచుకునేందుకు సిద్దమైంది.

సవాళ్లకు సమాధానం లేదు.. నిలదీస్తే పలాయనం!

నెలకు రూ. 10 వడ్డీ ఇస్తామంటూ బులియన్ మార్కెట్ (బంగారం, వెండి), బ్యాంక్ నిఫ్టీ, యÖఎస్‌డీటీ (USDT)లలో పెట్టుబడుల పేరుతో ఈ సంస్థ ప్రజల నుండి భారీగా నిధులు గుంజింది. ఈ నేపథ్యంలో సదరు సంస్థ కీలక ప్రతినిధి వైశ్యరాజు శ్రీనివాసరాజు గుట్టు రట్టు చేసేందుకు మా మీడియా ప్రతినిధి నేరుగా సంస్థ ప్రాంఛైజీ తీసుకునేందుకు ఆసక్తి ఉన్నట్లు స్టింగ్ ఆపరేషన్ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ష్యూరిటీ లేకుండా చేసే ఇన్వెస్ట్‌మెంట్‌లపైనే ఎక్కువ కమీషన్ ఆఫర్ చేయటం ఇక్కడ కొసమెరుపు. ఈ విషయాలపై అనంతరం ఫోన్ ద్వారా నిలదీయగా పదునైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక శ్రీనివాసరాజు తోకముడిచారు.

మీడియా సంధించిన అస్త్రాలు ఇవే:

మీరు చెప్పిన 200 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ? నిజంగా భూమి ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలు, సర్వే నెంబర్లు చూపించే దమ్ముందా?

క్రిప్టో, షేర్ మార్కెట్ పెట్టుబడుల సాక్ష్యాలేవి? బంగారం, బ్యాంక్ నిఫ్టీ, USణు లలో పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్న ముఠా, అందుకు సంబంధించిన అధికారిక స్టేట్‌మెంట్లు ఎందుకు దాస్తోంది?


RBI అనుమతి పత్రం ఏది? పబ్లిక్ నుండి డిపాజిట్లు స్వీకరించడానికి NBFC తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే తప్పనిసరి లైసెన్స్ ఎక్కడ?


GST, రిజిస్ట్రేషన్ లేని దొంగ కంపెనీకా MD, CEO హోదాలు? కనీస చట్టబద్ధత లేని ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటూ నకిలీ తగిలించుకోవడం ప్రజలను మోసం చేయడం కాదా?


ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, “వాట్సప్‌లో పంపలేం, డైరెక్ట్‌గా రండి” అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు శ్రీనివాసరాజు, ఆ తర్వాత స్పందించటం మానేసి పూర్తిగా ముఖం చాటేశారు.

నష్టాల్లో కంపెనీ ! చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెట్టుకోండి!

‘గత కొన్ని రోజులుగా సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది, అందుకే పేమెంట్లు ఆపేశాం. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టుకోండి, చూసుకుంటాం” అంటూ కస్టమర్లపైనే సదరు ప్రతినిధి ఎదురుదాడికి దిగడం వీరి బరితెగింపునకు నిదర్శనం.

ఒడిస్సా, రాయ్‌పూర్‌లలో చేతులెత్తేసిన ‘మైల్యాండ్’!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్)లలో గత రెండు నెలలుగా మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ కస్టమర్లకు ఇవ్వాల్సిన నెలవారీ లాభాలను పూర్తిగా నిలిపివేసింది. 20 నుండి 40 నెలల పాటు నిరంతరాయంగా డబ్బులు ఇస్తామని నమ్మించి, తీరా సమయం వచ్చేసరికి “లాభాలు వస్తేనే ఇస్తాం, నష్టాలొస్తే ఇవ్వం” అంటూ మాట మార్చారు.

గుంటూరుపై పడిన ‘నకిలీ రియల’ డేగ కన్ను!

అక్కడ గుట్టు రట్టవడంతో, ఈ ముఠా ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు పరిసర ప్రాంతాలను దోచే పనిలో పడింది. గత నెల రోజుల వ్యవధిలోనే గుంటూరు బ్రాంచ్ ద్వారా అమాయక ప్రజల నుండి ఏకంగా రూ. కోటి వసూలు చేశారు. ఇందులో సగం మొత్తాన్ని బంగారం, వెండి రూపంలో తిరిగిఇవ్వగా, మిగిలిన 50 లక్షల రూపాయలకు ఎలాంటి భూమి అగ్రిమెంట్ కానీ, సేల్ డీడ్ కానీ, మార్టిగేజ్ కానీ చేయలేదు! కేవలం మేడికొండూరు ప్రాంతంలో కేవలం రెండు ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చారు. దానిని చూపించి కాలయాపన చేస్తూ ప్రజల నుండి దోచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 20 నుండి 40 నెలల పాటు నిరంతరాయంగా డబ్బులు ఇస్తామని నమ్మించి, తీరా సమయం వచ్చేసరికి “లాభాలు వస్తేనే ఇస్తాం, నష్టాలొస్తే ఇవ్వం” అంటూ మాట మార్చటంతో గుంటూరు కస్టమర్లు ఇప్పుడు తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయారు.

ప్రజా హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాంచీలు తెరుస్తూ, ప్రకటనల పేరుతో మీడియాను సైతం మభ్యపెట్టాలని చూస్తున్న మైల్యాండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఉచ్చులో ఎవరూ పడవద్దు. ఇది ముమ్మాటికీ భారీ పంజీ స్కీమ్. ఇప్పటికే నష్టపోయిన బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (జుOఔ) మరియు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సిందిగా హెచ్చరిస్తున్నాం.



 

Post a Comment

0 Comments