Ticker

6/recent/ticker-posts

Nagashaurya new movie rangabali : రంగబలితో రచ్చచేయనున్న నాగశౌర్య !

 

యంగ్‌ హీరో నాగ శౌర్య హిట్‌ కొట్టి చాలా కాలం అయ్యింది. ‘క్రికెట్‌, గర్ల్స్‌ అండ్‌ బీర్‌’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్‌ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు . ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఆతర్వాత కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక రీసెంట్‌ గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాగ శౌర్య. ఈ సినిమాను పవన్‌ బాసంశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్‌ను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. సత్య, బ్రహ్మాజీ, గోపరాజు రమణ, షైన్‌ టామ్‌ చాకో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 7 న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాగ శౌర్య గోదావరి యాసలో మాట్లాడనున్నాడు.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !