Ticker

6/recent/ticker-posts

Vikram, Pragyan : పని మొదలు పెట్టిన విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ !



  • ల్యాండర్‌, రోవర్‌ జీవిత కాలం 14 రోజులే..
  • సోలార్‌ ప్యానెళ్ల ద్వారా శక్తి
  • సూర్యకాంతి ఆగిపోయాక మైనస్‌ 180 డిగ్రీలు

యావత్‌ ప్రపంచమంతా ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది ? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షిత ల్యాండిరగ్‌తో.. రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’ను విడుదల చేయడం దీని ప్రాథమిక బాధ్యత. సురక్షిత ల్యాండిరగ్‌, అన్వేషణ కార్యకలాపాలకు అనేక సెన్సార్లు, దిగేందుకు వీలుగా సోలార్‌ ప్యానెళ్లు ఉండే విక్రమ్‌ రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది. బరువు 1,749 కిలోలు (ప్రజ్ఞాన్‌తో కలిపి). ఇస్రో వెల్లడిరచిన ప్రకారం.. ప్రత్యేక కెమెరా, ప్రాసెసింగ్‌ అల్గారిథమ్‌, లేజర్‌-ఆర్‌ఎఫ్‌ ఆధారిత ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసిమీటర్‌, క్షితిజ సమాంతర వెలాసిటీ కెమెరా, ప్రమాదాల గుర్తింపు- నివారణ సహా అధునాతన సాంకేతికతలు విక్రమ్‌ సొంతం. ఇందులో మూడు పెలోడ్‌లు ఉన్నాయి. కాగా మైక్రోవేవ్‌ సైజ్‌ ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్‌లో కెమెరా, స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. రోవర్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్‌-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్‌ చేస్తుంది.

అవి..రాంభా (RAMBHA): రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌ సెన్సిటివ్‌ ఐనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ దీని పూర్తి అర్థం. చంద్రుడిపై ప్లాస్మా సాంద్రత (అయాన్లు, ఎలక్టాన్ల్రు)ను, కాలక్రమంలో అది ఎలా మారుతుందో అధ్యయనం చేస్తుంది.

ఛాస్టే (ChaSTE): చంద్రాస్‌ సర్ఫేస్‌ ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌. థర్మోఫిజికల్‌ ప్రయోగం ద్వారా చంద్రుడిపై ధ్రువాలకు దగ్గరగా ఉన్న ఉపరితలం ఉష్ణోగ్రతలను కొలుస్తుంది.

ఇల్సా (ILSA): ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సిస్మిక్‌ యాక్టివిటీ. ల్యాండర్‌ దిగిన ప్రాంతంలో భూకంపాల తీవ్రతపై పరిశోధనలు సాగిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పొరలు, మట్టి స్వభావం ఎలాంటిదో అధ్యయనం చేస్తుంది. మున్ముందు ప్రయోగాలకు ఇది ఉపయోగం.

జాబిల్లిపై బుడిబుడి అడుగులతో

ల్యాండర్‌ విక్రమ్‌ గర్భంలో మోసుకెళ్లిన రోబోటిక్‌ యంత్రం రోవర్‌ పేరు ప్రజ్ఞాన్‌. మొత్తం 6 చక్రాలతో 26 కిలోల బరువుండే ప్రజ్ఞాన్‌.. విక్రమ్‌ ల్యాండిరగ్‌ తర్వాత దానిలోంచి బయటకు వస్తుంది. చంద్రుడి ఉపరితల వాతావరణ మౌలిక కూర్పుపై సమాచారాన్ని అందించేందుకు ఇందులో రెండు పెలోడ్‌లున్నాయి. అవి..

ఏపీఎక్స్‌ఎస్‌.. ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌ (ఏపీఎక్స్‌ఎస్‌): చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, పొటాషియం, కాల్షియం, టైటానియం వంటి ఖనిజాల ప్రాథమిక కూర్పును పసిగడుతుంది. మట్టి, రాళ్లలోని రసాయనాలను గుర్తిస్తుంది.

ఎల్‌ఐబీఎస్‌.. లేజర్‌ ఇండ్యూస్ట్‌ బ్రేక్‌ డౌన్‌ స్పెక్టోస్క్రోప్‌: ఇదో విభిన్న పెలోడ్‌. దీనిలోని లేజర్‌ చంద్రుడి మట్టిపై పడుతుంది. దానిని కరిగించి రసాయన మూలకాలు, ఖనిజ సంపద గుర్తింపునకు కృషిచేస్తుంది. మెగ్నీషియం, అల్యూమినియం వంటి మూలకాల కూర్పు విశ్లేషణకు సహాయపడుతుంది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
 Ram Charan Talking About Mega Priences : పాప ఖచ్చితంగా నాన్నలానే ఉంటుంది
 School Seized : నివాస భవనంలో శ్రీ చైతన్య స్కూల్‌.. కుత్బుల్లాపూర్‌లో పాఠశాల భవనం సీజ్‌
JADDAR NEW POLITAL PARTY IN TELANGANA : దొరలపాలనకు జరుగుతోంది అందుకే ‘‘గద్దర్‌’’  ప్రజాపార్టీ !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Sri Chaitanya : శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్‌ సీజ్‌.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!