- రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్ బాధ్యత జె.డి.లక్ష్మీనారాయణదే.
- సోషల్ మీడియా వేదికగా రెజొనెన్స్ స్కూల్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న జె.డి.లక్ష్మీనారాయణ.
- కొత్త స్కూల్స్‌కి విద్యార్థుల ఇన్ఫర్మేషన్ కోసం స్కాలర్‌షిప్ ట్రాప్ !
- ఇతర స్కూల్స్‌లో విద్యార్థులను మభ్యపెట్టడమే స్కాలర్‌షిప్ టార్గెట్.
- ప్రతి తరగతికి ఎంత మందికి ఇస్తున్నారు ? ఎంతెంత ఇస్తున్నారు ? అనే పూర్తి లెక్కలు వెబ్‌సైట్‌లో ఎక్కడ ?
- రూ. 100 కోట్లు విద్యార్థులకే అందించే లెక్కలు ప్రజలకు బహిర్గతం చేయాల్సిందే.
- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే నిలదీస్తాం అంటున్న తల్లిదండ్రులు.
- రెజొనెన్స్ తరపున స్కాలర్‌షిప్ ఇప్పించే బాధ్యత జె. డి. లక్ష్మీనారాయణదే.
- రూ. 300/- ఎగ్జామ్ ఫీజులతో కోట్ల సంపాదన !
- పర్నిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా పరీక్షల నిర్వహణ !
- తల్లిదండ్రులారా..బోగస్ స్కాలర్‌షిప్‌ల పట్ల పారాహుషార్ !
మీ
పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం అని ఏ కార్పొరేట్ సంస్థ కొంచం హడావుడి
చేసిన చాలు...వారి మోసాల వలకి చిక్కుతున్నారు తల్లిదండ్రులు. ఈ
వీక్‌నెస్‌ని అలుసుగా తీసుకుని Resonance లాంటి సంస్థల ఆగడాలు
పెచ్చుమీరుతున్నాయి. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న Resonance Schools తల్లిదండ్రుల్ని ఆకట్టుకునేందుకు వివిధ రకాల జిమ్మిక్కులను ప్లాన్
చేస్తుంది. అందులో భాగంగా వివిధ స్కూల్స్‌లో చదువుకునే విద్యార్థుల సమాచారం
( Information) సేకరించేందుకు రూ. 100 కోట్లు Scholarship అంటూ ఎర
వేస్తోంది. అనంతరం మీ పిల్లాడికి 10% లేదా 20% ఫీజు రాయితీ అంటూ ఫోన్
కాల్స్‌లో మార్కెటింగ్ చేసుకోవటం కోసమే ఈ Scholarship తతంగం. మరో వైపు
ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు సేకరించి వారిని రెజొనెన్స్
స్కూల్స్‌లో చేర్పించుకుని వారి ద్వారా సాధించే ర్యాంకులను అంతా
రెజొనెన్స్ ప్రతిభ అని ప్రచారం చేసుకోవటం మరింత మంది విద్యార్థులను తమ
స్కూల్స్‌కి ఆకర్షించటం మరింత డబ్బు సంపాదించుకోవటమే రెజొనెన్స్ స్కూల్స్
స్ట్రాటజీ.
స్కాలర్‌షిప్ టెన్ట్‌కి ప్రచారకర్తగా జె.డి. లక్ష్మీనారాయణ !
Resonance Schools ప్రతిష్టాత్మకంగా రూ. 100 కోట్ల Scholarshipను అందించేందుకు ప్రఖ్యాత సి.బి.ఐ. మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన లక్ష్మీనారాయణ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనిని రెజొనెన్స్ యాజమాన్యం జె.డి. లక్ష్మీనారాయణను ప్రచారకర్తగా మార్చుకుని సోషల్ మీడియా (Facebook, Instagram, Youtube) వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. నిజంగా జె.డి. లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ? లేక రెజొనెన్స్ ప్రచారకర్తగా వాడుకుంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక పోతే ఆయన తెలిసో తెలియకో ప్రచారకర్తగా మారి రెజొనెన్స్ స్కాలర్‌షిప్‌ని ప్రమోట్ చేసినందుకు ఆయనే దగ్గరుండి రూ. 100 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇప్పించవలసిన బాధ్యత ఏర్పడిరది. లేదంటే నిగ్గదీసి అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉంది. నిజాయితీని నిరూపించుకోవలసిన బాధ్యత ఇటు రెజొనెన్స్‌కు, అటు జే.డి.లక్ష్మీనారాయణకు ఉంది.
స్కాలర్‌షిప్ అంతా బోగస్ !
రూ.100 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వటం అనేది ఉత్త బోగస్. ఉదాహరణకి ఒకవేళ వేరే స్కూల్స్‌లో చదువుతూ రెజొనెన్స్ మెగా రెజోఫాస్ట్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే రొజెనెన్స్ స్కూల్స్‌లో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. అదీ కూడా ఒక సంవత్సరమే. అదీ కూడా ట్యూషన్ ఫీజు మాత్రమే. మిగతా ఫీజులు యథాతధం. కావలంటే నిశితంగా గమనించండి రెజొఫాస్ట్. కామ్‌లో నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ రొజొనెన్స్ స్కూల్స్‌కి అనుకూలంగా ఉంటాయి. కొన్ని సార్లు అయితే ఆయా ప్రోగ్రామ్స్ & హాస్టల్‌లో చేరిన వారికి మాత్రమే అని తప్పించుకునే అవకాశం ఉంది. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం కోసం రెజొనెన్స్‌తో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలు చేసే ఓ నిరంతర ప్రక్రియ. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన రూ. 300 /-వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. గ్రేటర్ హైద్రాబాద్ చుట్టుప్రక్కల అన్ని తరగతులు కలిపి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో కనీసపక్షం ఒక లక్ష మంది ఎగ్జామ్ వ్రాసిన రూ. సరాసరిన రూ. 3 కోట్ల ఆదాయం మిగులుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విద్యార్థుల సమాచారం దొరుకుతుంది. ఇక వచ్చిన ఆదాయం నుండి వాటి నుండి ప్రతి క్లాసులో మొదటి 10 స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 ట్యాబ్‌లను ఇతర బహుమతులు, మెమెంటోలతో మమ అనిపిస్తారు. ఈ సంవత్సరం రూ.100/` కోట్లు స్కాలర్‌షిప్ సాధించిన సాధించిన విద్యార్థుల వివరాలతో కూడిన సమాచారం ఇచ్చి రెజొనెన్స్ స్కూల్స్ తన నమ్మకాన్ని, విశ్వసనీయతను చాటుకోవాల్సి ఉంది. లేదంటే జే.డీ. లక్ష్మీనారాయణ గారికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఏమి జరుగుతుందో.
లాజిక్ లేదు !
రూ.
100 కోట్ల స్కాలర్‌షిప్ ఇస్తున్నారు అంటే పోలో మని అందరూ ఎగబడి మరీ
రాసేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించడి. 5 వ తరగతి
నుండి 10 వ తరగతి వరకు స్కాలర్‌షిప్ ఎగ్జామ్...అంటే 6 తరగతులు. ప్రతి
తరగతిలో 10 మందిని తీసుకుంటే 60 మంది, లేదు ప్రతి తరగతిలో టాప్ 20
విద్యార్థులను విజేతలుగా తీసుకుంటే 120 మంది. ఈ 120 మంది విజేతలకి
ఒక్కోక్కరికీ ఒక లక్ష రూపాయల స్కాలర్‌షిప్ ఇచ్చినా 120 లక్షలు. అంటే 1
కోటి 20 లక్షలు మాత్రమే. మరి రూ. 100 కోట్లు ఎవరికీ ఇస్తారు. ఎలా ఇస్తారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు ఆలోచించండి. ఇలాంటి స్కాలర్‌షిప్‌లను
తిప్పికొట్టండి. అసలు తరగతిలో ఎంత మందికి స్కాలప్‌షిప్ ఇస్తున్నారు ?
ఎంతెంత ఇస్తున్నారు ? ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు ? ఆ సమాచారం
వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. ఇది మోసపూరిత సంస్థనా లేక నిజాయితీ గల సంస్థనా
అనేది రెజొనెన్స్ తీరుపైనే ఆధారపడి ఉంది.
అసలు రూ. 100 కోట్లు ఎక్కడివి ?
మెగా రెజొఫాస్ట్ పేరుతో స్కాలర్‌షిప్ నిర్వహిస్తున్న రెజొనెన్స్ స్కూల్స్ ప్రకటించిన రూ. 100 కోట్లుకు సంబంధించిన డబ్బు ఎక్కడవి ? రెజొనెన్స్ యాజమాన్యానివా ? సొసైటీలకు చెందినవా ? అనే లెక్కలు చెప్పాల్సి ఉంది. ఇతర ఏదైనా కార్పొరేట్ సంస్థలకు చెందిన నల్లధనాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో విద్యార్థులకు ఇస్తున్నట్లు చూపిస్తే తరువాత తల్లిదండ్రులు విద్యార్థులు కోర్టులు, కేసులు అంటూ తిరగాల్సి ఉంటుంది. అసలు నిజంగా రూ. 100 కోట్లు రొజొనెన్స్ స్కూల్స్ ఎక్కడి నుండి తీసుకువస్తుందో లెక్కలు చెప్పి స్కాలర్‌షిప్ నిర్వహిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


0 Comments