- ఎడ్యుటెక్ కంపెనీలకు ఎన్నో ప్రతిబంధకాలు ! మరెన్నో సవాళ్ళు !
- రూ. 3,480 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం !
- కంపెనీ విస్తరణకు నిధుల వెచ్చింపు !
తీవ్రమైన పోటీలో నెగ్గటం కష్టమే !
ఫిజిక్స్
వాలా ఐపీఓ విజయవంతం అవుతుందా ? మదుపరుల నుండి ఆదరణ లభిస్తుందా ? అంటే
కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎడ్యుటెక్ కంపెనీ సక్సెస్ అయిన దాఖలాలు
లేవు. ఉదాహరణకు బైజూస్‌నే తీసుకుంటే ఆన్‌లైన్ పేరుతో ఇండియన్
మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. ఎంత స్పీడ్‌గా ఎదిగిందో అంతే స్పీడ్‌గా
పాతాళానికి జారిపోయింది. అంతా స్వయంకృతాపరాధం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఏ
ఒక్కరిపైనో ఆధారపడి నడవదు. అదో పెద్ద టీమ్. టీమ్‌ని ఎంత సమన్వయం
చేసుకున్నా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, సెంటిమెంట్లు పరంగా ప్రతి రోజూ ఓ
ఛాలెంజ్. అతితక్కువకి ఫీజు ఆఫర్ చేయటం వంటి సక్సెస్ మంత్ర అన్ని సార్లు
పనిచేయకపోవచ్చు, ఓన్లీ ఆన్‌లైన్‌కి మాత్రమే అయితే బాగుటుంది. అదే
ఆఫ్‌లైన్ మరియు హైబ్రీడ్‌కి వచ్చే సరికి తక్కువ ఫీజుతో వర్కవుట్ కానీ
పరిస్థితులు తలెత్తుతాయి. మోయలేని నిర్వహణ భారం నెత్తిన పడుతుంది. అదే
సమయంలో ఇతర ఎడ్యుటెక్ కంపెనీలు మరియు సాంప్రదాయ స్థానిక విద్యాసంస్థల
నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొన వలసి ఉంటుంది. ఒక్కసారి బ్రాండ్ మీద
నెగెటివ్ వచ్చిందా అంతే బ్రాండ్ వ్యాల్యు అమాంతం దిగజారిపోతుంది.
మదుపర్లకు నష్టాలను తెచ్చిపెడుతుంది.
ఫిజిక్స్ వాలాకి పొంచి ఉన్న ప్రమాదాలు !
కంపెనీ నష్టాలను నివేదిస్తోంది:
ఫిజిక్స్ వాలా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన నష్టాలను నమోదు చేసింది.
నష్టాలు తగ్గినప్పటికీ, కంపెనీ ఇంకా నికర స్థాయిలో లాభాలను ఆర్జించలేదు. గత
సంవత్సరం చూపించిన దూకుడు ఇక ముందు చూపుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే
ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఇప్పటికే నిలదొక్కుకుని ఉన్న సంస్థల నుండి
విపరీతమైన పోటీ ఏర్పడినా, స్థానిక రాజకీయ నాయకుల జోక్యం చేసుకున్న నష్టాల
బారిన పడకతప్పదు.
నియంత్రణ ప్రమాదాలు: కోచింగ్
సెంటర్ల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మార్గదర్శకాల
రూపంలో నిర్దిష్ట నియయనిబంధనలను పెంచడం వలన అనుమతులకు లేదా కార్యాచరణ
పరిమితులు ఏర్పడవచ్చు. ఉదాహరణకి తెలంగాణలో ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్
విద్య పూర్తి చేయాలంటే రెండేళ్ళకు ఫీజు రూ. 3520/- మాత్రమే. ప్రభుత్వాలు
పట్టించుకోవటం లేదు కనుక ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఆటలు సాగుతున్నాయి.
ఇటీవల రేవంత్ రెడ్డి కాలేజీలు డోనేషన్లు ఎలా వసూలు చేస్తాయో చూస్తా,
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాల్సిందే అని హకుం జారీ చేశారు. దీంతో
ప్రైవేటు కాలేజీలు కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు.
మేధో సంపత్తి ప్రమాదాలు: పుస్తకాలు మరియు స్టడీమెటీరియల్స్ కాపీ చేయవచ్చు. వాటిపై హక్కుల కోసం జరిగే పోటీలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
పోటీ తీవ్రంగా ఉంటుంది: ఆఫ్‌లైన్‌లో
గణనీయమైన ఆదాయం దిల్లీ, పాట్నా మరియు కాలికట్ వంటి నగరాల నుండి మాత్రమే
వస్తోంది. ఏదైనా స్థానిక అంతరాయాలు, ప్రాంతీయ పోటీ మరియు విద్యార్థుల వలస
ధోరణి కారణంగా ఆదాయంలో తీవ్ర అసమానతలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కోటాలో
2023 సంవత్సరంలో 27158 అడ్మిషన్లు ఉన్న జరుగగా,అదే 2025 సంవత్సరానికి 11540
పడిపోయాయి. అడ్మిషన్లలో హెచ్చుతగ్గులతో ఖర్చులు పెరగవచ్చు, మార్జిన్లు
తగ్గవచ్చు.
అధ్యాపకులు మానివేయటం మరియు బోధనా నాణ్యత తగ్గటం :
ఎలాంటి పెద్ద సంస్థకైనా అధ్యాపకులే ఆస్తి. అనుభజ్ఞులైన అధ్యాపకులు వారి
బోధనా నాణ్యతతోనే ఎక్కువ విజయాలు సొంతం అవుతాయి. కానీ అధ్యాపకులకు ఇతర
సంస్థలు ఎక్కువ మొత్తంలో జీతాలు ఆఫర్ చేయటం, కొంత మంది విజయవంతం అయిన
అధ్యాపకులు సమూహం వారే సొంతంగా నూతన కోచింగ్ సెంటర్లు నడుపుకోవటం వంటి
కారణాల వల్ల చాలా చోట్ల సంస్థ దెబ్బ తిన్న సందర్భాలు అనేకం. లేదా ఇంతకన్నా
పెద్ద సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులతో వస్తే దుకాణాలు సర్ధుకోవలసిందే.
భద్రతా ప్రమాదాలు: విద్యార్థుల
భద్రతను నిర్ధారించడంలో లేదా ప్రతికూల సంఘటనలను నిర్వహించడంలో వైఫల్యం
ప్రతిష్టకు భగమే, చట్టపరమైన వాదనలు లేదా నియంత్రణ పరిశీలనకు దారితీయవచ్చు.

0 Comments