Ticker

6/recent/ticker-posts

NARAYANA : ఒత్తిడికి తలొగ్గి విద్యార్థి ఆత్మహత్య...నారాయణ కాలేజ్‌లో దారుణం !



మాదాపూర్‌ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్‌ (17) అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్‌ క్యాంపస్‌ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్‌..అయ్యప్ప సొసైటీలోని రామానుజన్‌ క్యాంపస్‌లో విజయ్‌ ఐఐటీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఒత్తిడికి చిత్తవుతున్న విద్యార్థి !

మార్కులు, ర్యాంకులే కొలమానంగా మార్చి లేని పోటీ ప్రపంచాన్ని సృష్టించిన కార్పొరేట్‌ సంస్థలు...నేడు విద్యార్థుల జీవితాల్ని బలిగొంటున్నాయి. విద్యార్థి ప్రాణం పోయినా ఎవరికీ ఏమాత్రం పట్టడం లేదు. ఒక్క తల్లిదండ్రుల కడుపుకోతను ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. పోలీసులు కేసుతో సరిపెడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకుని విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించవలసిన అవసరం ఉంది. విద్యావ్యవస్థలో పోటీ లేని, చావులు లేని సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా