Ticker

6/recent/ticker-posts

JEE MAIN FAKE RESULTS : జేఈఈ మెయిన్‌లో శ్రీచైతన్య ఫేక్‌ర్యాంకులు !

 

  • పర్సంటైల్‌ రాకున్నా వచ్చినట్టు బోగస్‌ ప్రకటనలు !
  • సోషల్‌ మీడియా వేదికగా దుష్‌ప్రచారం !
  • శ్రీచైతన్య జిమ్మిక్కులకు అవాక్కవుతున్న తల్లిదండ్రులు !

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా, వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించి రికార్డు సాధించారు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి ఒక్క విద్యార్థి మాత్రమే 100 పర్సంటైల్‌ సాధించాడు. అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి విజయవాడ నుండి ఈ ఘతన సాధించాడు. అదే సమయంలో నారాయణ విద్యాసంస్థ  నుండి 8 మంది 100 పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారు. దీంతో శ్రీచైతన్య తనదైన కనికట్టుకు తెరతీసింది. శ్రీచైతన్యకు సైతం 8 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనతో తల్లిదండ్రులను , విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోంది.

నైతిక విలువలు పాటించని శ్రీచైతన్య !

గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్‌ సాధించిన 7 విద్యార్థులను  300ల మార్కులకు గాను 300 మార్కులు సాధించిన విద్యార్థులుగా చూపుతూ జేఈఈ మెయిన్‌లో శ్రీచైతన్యకు 8 మంది పర్సంటైల్‌ సాధించిన వారు ఉన్నారు అని శ్రీచైతన్య నిసిగ్గుగా ప్రకటించుకుంటోంది. తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. ఒక్క శ్రీచైతన్య నుండి దాదాపు 85000 లకు పైగా స్టూడెంట్స్‌ పరీక్షలో పాల్గొన్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరికే 100 పర్సంటైల్‌ వచ్చింది. అంటే శ్రీచైతన్యలో చదువు ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా తల్లిదండ్రులు, విద్యార్థులు కళ్ళు తెరుచుకుని శ్రీచైతన్య జిమ్మిక్కులను ఈ ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !