Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : సిగ్గులేని శ్రీచైతన్య... మరోసారి దిగజారి IIT ఫలితాలు !

కళ్ళముందే కనికట్టు చేయటం, మభ్యపెట్టడం, మోసగించటం...ఇవి శ్రీచైతన్య అవలంబిస్తున్న నయా అక్రమ మార్గాలు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య తన మోసపూరిత నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని తన ప్రకటనలతో బురిటీ కొట్టిస్తోంది. ప్రకటనల్లో జిమ్మిక్కులు చేయబోతూ అడ్డంగా దొరికిపోయింది. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 10 లోపు 6 ర్యాంకులు అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించింది. కానీ నిజానికి అందులో 5, 9, 10, 14, 34, 55, 68, 71, 96, 97, 100 వంటి ర్యాంకులే శ్రీచైతన్య సాధించిన అసలైన ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు. 1 వ ర్యాంకు ఈ.డబ్ల్యూ.ఎస్‌. కేటగిరీకి చెందినది కాగా, 4, 6 ర్యాంకులు డి.ఎల్‌.పి. (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌) చెందినవి. 4, 6, 12, 16, 28, 31, 38, 43, 57, 74, 77, 83, 85, 88, 91, 93, 94, 95, 99 వంటి 19 ర్యాంకులు సాధించిన విద్యార్థులు శ్రీచైతన్యలో క్లాస్‌రూమ్‌లో చదవలేదు. కేవలం శ్రీచైతన్యకు 100 లోపు వచ్చిన ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు కేవలం 11 మాత్రమే. 100 లోపు ఇన్ని ర్యాంకులు ఉంటే మొత్తంలో ఎంకెన్ని ఫేక్‌ ఉంటాయి. వేరే కాలేజీల్లో చదువుతూ శ్రీచైతన్య సంస్థలో మెటీరియల్‌ కోసం, ప్రాక్టీస్‌ పేపర్ల కోసం రిజిస్టర్‌ అయిన విద్యార్థులను శ్రీచైతన్య తమ విద్యార్థులుగా చెప్పుకోవటం సిగ్గుచేటు. శోచనీయం. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకోవటం ఎంత సమంజసమో, డిఎల్‌పీ ర్యాంకులను తమ సంస్థ ర్యాంకులుగా ప్రకటించుకోవటం అంతే సమంజసం. తల్లిదండ్రులు ఈ అంశాలను క్షుణ్ణంగా గమనించాలి. బాగా చదివే విద్యార్థులు లేనప్పుడు , ఫలితాలు సరిగా రానప్పుడు  శ్రీచైతన్య ఎంత నీచానికైనా దిగజారుతుందో ఈ ఫలితాలే నిదర్శనం. జేఈఈ మెయిన్‌లో ఒక్క శ్రీచైతన్య నుండి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారు 21987 మంది కాగా, జేఈఈలో ర్యాంకులు సాధించిన వారు కేవలం 3728 మంది అని స్వయంగా శ్రీచైతన్య తన ప్రకటనల్లో పేర్కొంది. అంటే దాదాపు 18000 మంది సీట్లు సాధించలేదు అన్న మాట. ఇదీ శ్రీచైతన్య సక్సెస్‌.

ఆల్‌కేటగిరీ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల్లో మోసం !

ప్రకటించిన ఫలితాల క్రింద అసలు వీరందరూ ఏ ఏ బ్రాంచీలకు చెందిన వారో ఎందుకు ప్రకటించలేకపోతోంది. ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్‌ సపరేట్‌గా ప్రభుత్వ అనుమతి తీసుకున్న శ్రీచైతన్య కాలేజీలు..ఆయా కాలేజీలు ఒక్కొక్కటికీగా సాధించిన ర్యాంకులుగా ఎందుకు ప్రకటించకుండా అన్నీ కాలేజీల ఫలితాలను కలిపి ప్రకటిస్తోంది. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదా ?  అదీ కూడా తెలుగు రాష్ట్రాలు అంటే ఎంత చులకన భావం అంటే అన్ని కేటగిరీ ర్యాంకులనీ కలిపి ప్రకటిస్తుంది. తల్లిదండ్రుల అవగాహన లేమి కారణంగా శ్రీచైతన్య తన ఆటలు కొనసాగిస్తోంది. ప్రకటనలను పెద్దగా పట్టించుకోకపోవటం కారణాన్ని అలుసుగా తీసుకోని శ్రీచైతన్య రెచ్చిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వేసిన ఇదే ప్రకటనను ఉత్తరాది రాష్ట్రాల్లో వేయగలదా ? అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి జిమ్మిక్కులు నడవవు. అక్కడ శ్రీచైతన్య కేవలం ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తుంది. కావాలంటే శ్రీచైతన్య వెబ్‌సైట్‌లోని గతం 2023 తాలుక రిజల్ట్స్‌ పేజీని పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి అన్ని కేటగిరీ ర్యాంకులు కలిపి ప్రకటిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య చెప్పిందే వేదం. శ్రీచైతన్య ఏది చెబితే అదే కరెక్ట్‌ అని నమ్మే అమాయక తల్లిదర్రడులు ఉన్నారు కాబట్టే మోసం చేయటం ఈజీ అవుతోంది. అసలు 100 లోపు ఇన్ని ర్యాంకులు ఒకే సంస్థకు ఎలా సాధ్యమవుతున్నాయి అనేది అర్థం కాక సామాన్యులు సైతం విస్తుపోవటం కనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే  జెఈఈ మెయిన్‌లో లెక్కలోకి తీసుకోవలసింది ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు మాత్రమే. అన్ని కేటగిరీ ర్యాంకులు ప్రకటించి ప్రజల్ని కన్యూజ్‌ చేసి అందరికంటే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి అని భ్రమింపజేసి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయటం దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !