Ticker

6/recent/ticker-posts

NARAYANA JEE ADV 2024 : మసకబారిన నారాయణ ప్రతిష్ట !

  • ఐఐటి ఫలితాల ప్రకటనలో మోసపూరిత చర్య !
  • దేశవ్యాప్తంగా భారీ ట్రోలింగ్‌తో ఎండగట్టిన ప్రజలు !
  • ఇప్పటికైనా బుద్ది తెచ్చుకునేనా ?

ఒక స్టూడెంట్‌కి రెండు ఐఐటి ర్యాంకులు వస్తాయా ? రావు...కానీ నారాయణలో వస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జోరుగా సాగుతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ `24 ఫలితాల్లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో 11 వ తేదీ ప్రచురించిన ప్రకటనలో తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకుంది. తన పరువును తానే బజారుకి ఈడ్చుకుంది. 1 వ ర్యాంకు, 11  వ ర్యాంకుకు ఒకే స్టూడెంట్‌ని ప్రకటించి అభాసుపాలైంది. ముఖ్యంగా నార్త్‌ స్టేట్స్‌లో నారాయణ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తల్లిదండ్రుల్ని ప్రకటనలతో మోసం చేయాలనుకున్న నారాయణను...భారీ ట్రోలింగ్‌తో తిప్పికొట్టారు నారాయణ తీరును వివిధ కామెంట్స్‌తో ఎండగట్టారు. ఇక ప్రకటనలోని వివరాలకు వస్తే ... జాతీయస్థాయి ఓపెన్‌ కేటగిరీ ర్యాంకుల్లో 10లోపు నారాయణ సాధించింది ఒక ర్యాంకు మాత్రమే. అది ఆలిండియా 3 వ ర్యాంకు, ఇక 100 ర్యాంకుల లోపు సాధించింది మొత్తం 13 ర్యాంకులు మాత్రమే. అవి 3, 11, 17, 20, 45, 51, 54, 59, 63, 66, 70, 76, 90 ర్యాంకులు మాత్రమే, కానీ వివిధ పత్రికల్లో ప్రకటించినవి ఎన్నో తెలుసా ? 31 ప్రకటించింది. దాదాపు 18 ర్యాంకులు తనవి కాని ర్యాంకులు ప్రకటించింది. ఆ ర్యాంకులు ఎక్కడివి అంటే...డి.ఎల్‌.పి. (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌) ర్యాంకులు. వీరందరూ నారాయణ క్లాస్‌రూమ్‌లో చదవలేదు. ఎందుకంటే వాటన్నింటికి స్టార్‌మార్క్‌ ఉంటుంది. గమనించండి. ఒక్క 100 లోపు ర్యాంకుల్లోనే ఇన్ని ఫేక్‌ ర్యాంకులు ఉంటే 1000 లోపు ఎంకెన్ని ఫేక్‌ ఉంటాయి. మొత్తంగా ఇంకెన్ని ఫేక్‌ ర్యాంకులు ఉంటాయో ఊహించండి.  దేశంలోని వేరే ప్రాంతాల్లో, వేరే కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కొందరు నారాయణలో మెటీరియల్‌ కోసం, ప్రాక్టీస్‌ పేపర్ల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అయిన విద్యార్థులను నారాయణ తమ విద్యార్థులుగా చెప్పుకుంటోంది. ఇదీ ర్యాంకుల ప్రకటనలో నారాయణ నిజాయితీ. తల్లిదండ్రులు ఈ అంశాలను గమనించాలి. బాగా చదివే విద్యార్థులు లేనప్పుడు , ఫలితాలు సరిగా రానప్పుడు  నారాయణ ఎంత నీచానికైనా దిగజారుతుందో ఈ ఫలితాలే నిదర్శనం. జేఈఈ మెయిన్‌లో ఒక్క నారాయణ నుండి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారు 20124 మంది కాగా, జేఈఈలో ర్యాంకులు సాధించిన వారు కేవలం 3816 మంది అని స్వయంగా నారాయణ తన ప్రకటనల్లో పేర్కొంది. అంటే దాదాపు 16000 మంది సీట్లు సాధించలేదు అన్న మాట.

ఆల్‌కేటగిరీ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల్లో మోసం !

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని సంస్థలు ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తుంటే, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నారాయణ అన్ని కేటగిరీ ర్యాంకులు ప్రకటించి మభ్యపెడుతోంది. 2024లో తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రకటనను దేశవ్యాప్తంగా వేయగలదా ? ఒక చిన్న పొరపాటుకే భారీ ట్రోలింగ్‌కి గురై ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రకటన వేస్తే నారాయణ సంస్థ మూతవేసుకోవాల్సిందే అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరో అంశం ఏమిటంటే ప్రకటించిన ఫలితాల క్రింద అసలు వీరందరూ ఏ ఏ బ్రాంచీలకు చెందిన వారో నారాయణ ఎందుకు ప్రకటించటం లేదు.  ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్‌ సపరేట్‌గా ప్రభుత్వ అనుమతి తీసుకున్న నారాయణ అన్ని కాలేజీలు ర్యాంకులు కలిపి ఎందుకు ప్రకటిస్తోంది. చాలా బ్రాంచీల్లో అసలు ర్యాంకులే రాలేదు.

Post a Comment

0 Comments