Ticker

6/recent/ticker-posts

Sri Chaitanya : శ్రీచైతన్యలో పుడ్‌పాయిజన్‌ ! 40 మంది విద్యార్థులకు అస్వస్థత !

ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్తతకు గురైన ఘటన కొండాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజ్‌ వాల్మీకి బ్రాంచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థుల్లో 40 మందికి పైగా ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయితే, విషయం తెలుసుకున్న ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవైఎఫ్‌ )నాయకులు హాస్టల్‌ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఇంత జరిగినా శ్రీ చైతన్య యజమాన్యం విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్‌ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. కానీ,యాజమాన్యం మాత్రం రెండు రోజులుగా విద్యార్థులను బయట ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆర్‌ఎంపీ వైద్యులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తుందని ఆరోపిస్తున్నారు. 40 మంది విద్యార్థుల్లో 27 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని తమ పిల్లలను ఇళ్ళకు తీసుకొని పోయేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. పుడ్‌ పాయిజన్‌ విజయాన్ని కళాశాల యాజమాన్యం బయటకు పొక్కకుండా కప్పిపుచ్చుతోంది. మీడియాను లోపలికి అనుమతించకుండా యాజమాన్యం అడ్డుకుని విషయం బయటకు పొక్కకుండా చూస్తోందని ఏఐవైఎఫ్‌ నాయకులు ఆరోపించారు.

జూలై 16, 2019 లోనూ ఇలాగే !

2019 జూలై నెలలో అచ్చంగా ఇలాగే శ్రీచైతన్య కళాశాలలో పుడ్‌ పాయిజన్‌ జరిగింది. అప్పుడు సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. కొండాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కళాశాలలో వంట చేసి అక్కడ నుంచి మాదాపూర్‌లో ఉన్న హాస్టల్‌కు తరలించారు. ఆ ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.అప్పుడు ఇలాగే గుట్టుచప్పుడు కాకుండా మీడియాను మేనేజ్‌ చేసి విషయాన్ని బయటకు పొక్కకుండా చేశారు.

యాజమాన్యం కక్కుర్తి, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి...

ర్యాంకుల వేటలో పడి విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది శ్రీచైతన్య. క్వాలిటీ లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తోంది. దీనికి తోడు పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాడైపోయిన ఆహారాన్ని వడ్డించటం కారణంగా పలు చోట్ల ఫుడ్‌ పాయిజన్‌ అవుతోంది. హాస్టల్స్‌లో ఫుడ్‌ తినలేక బయట నుండి ఫుడ్‌ ఆర్డర్స్‌ పెట్టుకుంటారంటే విద్యార్థులు ఎలాంటి ఆహారం తింటున్నారో అర్థం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments