Ticker

6/recent/ticker-posts

NEET UG 2024 : ర్యాంకుల కొనుగోలుతో రోజురోజుకి దిగజారిపోతున్న శ్రీచైతన్య !

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NEET UG- 2024) ఫైనల్‌ ఆన్సర్‌ కీ ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. NEET ఫలితాలతో పాటు ఆల్‌ఇండియా టాపర్ల వివరాలను మరియు కేటగిరీ వారీగా కట్‌`ఆఫ్‌ మార్కులు మరియు పర్సంటైల్‌ ర్యాంకులను NTA ప్రకటించింది. శ్రీచైతన్య 720 మార్కులకు గాను 720 మార్కులను సాధించే వారి వివరాలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఆ ప్రకటనలో 7 గురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించినట్లు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. 3 (ముగ్గురు) స్టూడెంట్స్‌ పేరు ప్రక్కన DLP (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌) AITS (ఆల్‌ఇండియా టెస్ట్‌ సిరీస్‌) అని 3 పేరు ప్రక్కన తోక తలిగించారు. అంటే శ్రీచైతన్య అసలైన విద్యార్థులు 4 గురు మాత్రమే 720 మార్కులు సాధించారు. అంటే మిగతా 3 (ముగ్గురు) వేరే సంస్థలో క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా చదివిన వారు, శ్రీచైతన్యలో డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా చదివినట్లు చెప్పి ప్రకటనల్లో వాడుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ర్యాంకు సాధించిన అసలైన సంస్థ నుండి ర్యాంకులు కొనుగోలు చేసి తమ ర్యాంకులుగా శ్రీచైతన్య ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఇదీ చాలదు అన్నట్లు నీట్‌ యూజీ 2024 ఫలితాలు అని ప్రకటించిన ప్రకటన మధ్యలో గత సంవత్సరం 1 ఫస్ట్‌ ర్యాంకు ప్రకటించటం శ్రీచైతన్య దిగజారుడు తనానికి నిదర్శనం.

శ్రీచైతన్య ర్యాంకులన్నీ DLP ర్యాంకులేనా ?

శ్రీచైతన్య క్లాస్‌రూమ్‌లో చదివిన వారికి ర్యాంకులు రావా అన్న సందేహం ప్రజల్లో ఇప్పటికే వచ్చింది.  శ్రీచైతన్య DLP. ర్యాంకులు ఎందుకు ప్రకటిస్తుందో తల్లిదండ్రులు గుర్తించవలసిన అవసరం ఉంది. ర్యాంకులు ప్రకటించక ముందు 7 గురు విద్యార్థులకు 720/720 మార్కులు అని ఫేస్‌బుక్‌లో  ప్రకటించిన శ్రీచైతన్య, రాత్రికి రాత్రి మరో 2 ర్యాంకులు కొనుక్కొచ్చి శ్రీచైతన్య ర్యాంకులుగా ప్రకటించుకుంది. ఆ ఇద్దరికీ DLP. ( (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌) అని ట్యాగ్‌ తగిలించింది. శ్రీచైతన్య చర్యలు ఎవరో కన్న బిడ్డకి నేనే తండ్రిని అని ప్రకటించుకున్నంత ఛండాలంగా ఉందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. శ్రీచైతన్యకు ఎక్కువ ర్యాంకులు ప్రకటించి ఎక్కువ అడ్మిషన్లు పొందాలనే దుర్భుద్ది తప్పించి మరో ఆలోచన లేనట్లు తెలుస్తోంది. మెల్లగా మెల్లగా శ్రీచైతన్య తన నమ్మకాన్ని కోల్పోతోంది. 


Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !