Ticker

6/recent/ticker-posts

Knowledge Hub : పేదవాడికి చదువుని దూరం చేయటమే శ్రీచైతన్య నాలెడ్జ్‌హబ్‌ ఉద్దేశ్యమా ?

మభ్యపెట్టడం, మోసగించటం, దోచుకోవటం శ్రీచైతన్య యాజమాన్యానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. తల్లిదండ్రుల్ని డబ్బులు అందించే ఏటీయమ్‌లుగా భావిస్తోంది. విద్యార్థుల్ని ర్యాంకు సాధించే మెషిన్స్‌గా మార్చుతోంది. రెండిరటినీ సమన్వయ పరుచుకుంటూ వేలకోట్లు వెనకేసుకుంటోంది. తల్లిదండ్రులు నెత్తినోరు మొత్తుకున్న మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందిచేనా ? లేక కార్పొరేట్‌ మాఫియాలా చేతిలో బందీలుగానే నాయకులు ఉండిపోతారా ? చూడాలి.

నాలెడ్జ్‌హబ్‌ పేరుతో ప్రీమియంకోచింగ్‌ సెంటర్‌లు

ఇప్పటి వరకు శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలు, శ్రీచైతన్య కోచింగ్‌ సెంటర్‌లు, శ్రీచైతన్య అకాడమీల పేరుతో విద్యావ్యాపారం నిర్వహిస్తోన్న శ్రీచైతన్య... నాలెడ్జ్‌హబ్‌ పేరుతో కొత్త కోచింగ్‌ సెంటర్‌లను నెలకొల్పింది. శ్రీచైతన్య కోచింగ్‌ సెంటర్‌లను వచ్చే ఫీజులు చాలవన్నట్టు ప్రీమియం పేరుతో ఎక్కువ ఫీజులు వసూలు చేసేందుకు నాలెడ్జ్‌ హబ్‌ను తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో విద్యార్థుల పేరుతో కచ్చితంగా రిజల్ట్స్‌ సాధింపజేస్తామని చెబుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తోంది. చదువుని ఓ లగ్జరీగా వస్తువుగా మార్చి దానికి ఓ సోషల్‌ స్టేటస్‌ మలిచి ఉన్నత వర్గాలను, ధనవంతుల దగ్గర నుండి ఫీజుల పేరుతో దోపిడీ చేసేందుకు శ్రీచైతన్య ఎన్నుకున్న మార్గం. అదే సమయంలో విద్యను పేద వర్గాలకు దూరం చేయటమే అంతర్గత ఆలోచనగా తెలుస్తోంది.

నాలెడ్జ్‌హబ్‌ దగ్గర వీటికి సమాధానం ఉందా ?

  • శ్రీచైతన్య విద్యాసంస్థలు వేరు...నాలెడ్జ్‌హబ్‌ సంస్థ వేరు...యాజమాన్యం మాత్రం ఒక్కటే. 
  • శ్రీచైతన్య విద్యాసంస్థల ర్యాంకుల్ని నాలెడ్జ్‌హబ్‌ తన ర్యాంకులుగా ఎలా ప్రకటించుకుంటోంది ?
     
  • నాలెడ్జ్‌హబ్‌లో చదివి ర్యాంకులు సాధించిన వారి పూర్తి వివరాలు బహిరంగంగా ప్రకటించగలరా ?
     
  • నాలెడ్జ్‌ హబ్‌ అంటే ఏంటి ? స్కూల్సా ? జూనియర్‌ కాలేజీనా ? కోచింగ్‌ సెంటర్స్‌ఆ ?
     
  • కోచింగ్‌ సెంటర్స్‌ అని ప్రకటనలు హోరెత్తిస్తూ, ఇంటర్‌ అడ్మిషన్లు ఎలా చేస్తున్నారు ? నిబంధనలకు విరుద్దం కాదా ?
     
  • నాలెడ్జ్‌హబ్‌ జూనియర్‌ కాలేజీలు ఎక్కడ ? అన్నీ కోచింగ్‌ సెంటర్‌ ముసుగులోనే ఎందుకు నిర్వహిస్తున్నారు ?
     
  • నాలెడ్జ్‌హబ్‌ స్కూల్స్‌ ఎక్కడున్నాయి ? లేవు మరీ ఫౌండేషన్‌ కోచింగ్‌ ఎలా ఇస్తారు ? శ్రీచైతన్య టీచర్స్‌తోనేనా ?
     
  • 8, 9, 10 తరగతులుకు ఫౌండేషన్‌ కోచింగ్‌ పేరిట మరో మోసం, ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో అదనపు దోపిడీకి వ్యూహరచన.
     
  • అదనపు భారం మోపి ఎక్కువ ఫీజు వసూలు చేయటమే అసలు ఉద్ధేశ్యం.
     
  • శ్రీచైతన్య స్కూల్స్‌లో పనిచేసే టీచర్స్‌తోనే నాలెడ్జ్‌హబ్‌లోనూ బోధన.
     
  • నాలెడ్జ్‌హబ్‌ (సొసైటీ) నుండి సొమ్మును వేరే ప్రై.లి. కంపెనీల్లోకి మళ్ళించే పథకం.
     
  • నాలెడ్జ్‌హబ్‌ శ్రీలీల ఎందుకు ప్రమోట్‌ చేస్తోంది ? నాలెడ్జ్‌హబ్‌తో నిజంగా ఎండార్స్‌మెంట్‌ చేసిందా ?
     
  • తన తప్పులను కప్పిపుచ్చేందుకు బీఆర్‌ఎస్‌కు రూ. 12 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్స్‌ కప్పం కట్టి మేనేజ్‌ చేసిన శ్రీచైతన్య.

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya Prodigy : తల్లిదండ్రులపై మోయలేని పెనుభారం !