Ticker

6/recent/ticker-posts

మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్‌ ! వర్కవుట్‌ అవుతుందా ?


తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశం ఉందా ? ఏపీలో కాస్త ముందు.. తెలంగాణలో కాస్త ఆలస్యం కానున్నాయా..? ఏపీలో వైఎస్‌ జగన్‌.. తెలంగాణలో కాంగ్రెస్‌, కేసీఆర్‌ను కట్టడి చేయడానికి కేంద్రం సరికొత్త ప్లాన్‌తో రంగంలోకి దిగబోతుంది అనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయంతో పార్టీలు కంగుతినడం ఖాయమా..? అంటే తాజా పరిణామాలను గమనిస్తే నిజమనిపిస్తోంది.

కేంద్రం సరికొత్త వ్యూహం !

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈసీ కసరత్తులు షురూ చేయడంతో.. కేసీఆర్‌ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసేసుకున్నారు. ఇక వాటిని ప్రతిపక్షాలు ఎక్కుపెట్టి.. ప్రజలకు వరాల జల్లు కురిపించడమే తరువాయట. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్‌ కలలపై కేంద్రం నీళ్లు చల్లిందట. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయట. కాంగ్రెస్‌, కేసీఆర్‌ కట్టడికి కేంద్రం కొత్త ఎత్తుగడతో తెలంగాణలో కాషాయ పార్టీ అడుగుపెడుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటే తెలంగాణ ఎన్నికలు జరపాలన్నదే కేంద్రం వ్యూహమట. వచ్చే ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభతో పాటు పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపించే వ్యూహంలో కేంద్రం ఉందన్నది తాజాగా అందుతున్న సమాచారం. షెడ్యుల్‌ ప్రకారం డిసెంబర్‌లోపు తెలంగాణ, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే లోక్‌ సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగాలి. అయితే.. కేంద్రం మాత్రం లోక్‌సభతో ఇలా జరగకూడదని ప్లాన్‌ చేస్తోందట

సాధ్యమేనా ?

లోక్‌సభతో పాటు మొత్తం 10 రాష్ట్రాల ఎన్నికలు జరపాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందట. ఇందులో మహారాష్ట్ర కూడా ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహారాష్ట అసెంబ్లీని రద్దు చేసే యోచనలో బీజేపీ ఉందని ముంబై వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలా రద్దు చేయాల్సినవి.. ఇంకా తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో మొత్తం అన్నీ కలిపి 10 రాష్ట్రాలకు వచ్చే ఏడాది అనగా మార్చి-2024లో ఒకేసారి ఎన్నికలు జరిపించే యోచనలో కేంద్రం ఉందట. ఇందుకు అనుగుణంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టబోతోందని సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లు పాస్‌ అయితే ‘మిని జమిలి ఎన్నికలు’ జరుగుతాయన్న మాట. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల కమీషన్‌కు పూర్తిగా విచక్షణా అధికారాలు కేంద్రం ఇవ్వనుందట. అయితే.. దీనిపై ప్రతిపక్షాలు కోర్టు మెట్లెక్కకుండా పక్కాగా బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రం సర్వం సిద్ధం చేసుకున్నదట. వృధా ఖర్చును అరికట్టే ఉద్దేశంతో జమిలి ఎన్నికలు జరపబోతున్నామని ఆర్టికల్‌ 172 ప్రకారం అసెంబ్లీ గడువును పెంచే యోచనలో కేంద్రం ఉందట. అంటే ఆ ఆర్టికల్‌ ప్రకారం షెడ్యుల్‌కు కొద్ది నెలలు అటు ఇటుగా ఎన్నికలు జరిపే వెసులు బాటు ఉంటుందన్న మాట. ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ బిల్లు ఎంతవరకూ పార్లమెంట్‌లో పాసవుతుందన్నది తెలియాల్సి ఉంది

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !