Ticker

6/recent/ticker-posts

goods Train Accedent : ఒడిశాలో మరో రైలు ప్రమాదం !



విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు అనటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.  వర్షం వస్తుందని తడవ కుండా కాపాడుకోవటం కోసం ఎన్నో రోజలుగా పట్టాలపై అగి ఉన్న గూడ్స్‌ రైలు కిందకు వెళ్లారు కూలీలు.. ఈ సమయంలో పెద్దగా.. భారీగా వీచిన ఈదురుగాలులకు గూడ్స్‌ రైలు కదలటం.. ఆ రైలు కూలీలపైకి దూసుకెళ్లటం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు రైల్వే కూలీలు చనిపోయారు . మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.  ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. ఒడిశా రాష్ట్రంలో.. మొన్నటికి మొన్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం మర్చిపోకముందే.. అదే ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదం ఇది. దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

తలదాచుకునేందుకు వెళితే

రైల్వేస్టేషన్‌లో 2023 జూన్‌ 07  బుధవారం రోజున కూలీలు పనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు పక్కనే ఎన్నో రోజలుగా పట్టాలపై అగి ఉన్న గూడ్స్‌ రైలు కిందకు వెళ్లారు.అయితే వర్షం మరింతగా పెరగడం,  భారీగా వీచిన ఈదురుగాలులకు గూడ్స్‌ రైలు ముందుకు కదిలింది.దీంతో అక్కడికక్కడే ముగ్గురు కూలీలు చనిపోయారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులను కటక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి బయట పడకముందే మళ్లీ అలాంటి ప్రమాదమే జరగడం స్థానికులను షాక్‌ కు గురిచేస్తుంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా