Ticker

6/recent/ticker-posts

Balayya Birthday Celabrations : గ్లోబల్‌ లయన్‌...బాలయ్య బర్త్‌డే వేడుకలకు సర్వం సిద్ధం చేసిన ఫ్యాన్స్‌ !

 

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. శ్రీ లీల మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమా టైటిల్‌ గురించి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనే జరుగుతున్న విషయం తెల్సిందే. భగవత్‌ కేసరి అనే టైటిల్‌ను మేకర్స్‌ పిక్స్‌ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. ఈ సినిమా టైటిల్‌ ను జూన్‌ 8 న రివీల్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే బాలయ్య బర్త్‌ డే వేడుకలు మొదలయయ్యాయి.

కాగా.. ఈసారి బాలయ్య బర్త్‌ డే కు ఫ్యాన్స్‌ గొప్ప బహుమతిని ఇచ్చారు. ఇప్పటి వరకు బాలయ్య అంటే.. యువరత్న బాలకృష్ణ, నందమూరి నట సింహం, లెజెండ్‌ బాలయ్య అని బిరుదులు ఉండేవి. ఇక ఈ బిరుదులు కాకుండా ఇప్పుడు కొత్తగా ఆయనకు మరో బిరుదును ఫ్యాన్స్‌ అందించారు. అదే గ్లోబల్‌ లయన్‌. బాలకృష్ణ బర్త్‌ డే వేడుకలను మొదలుపెడుతున్న తరుణంలో ఈ బిరుదును డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి రివీల్‌ చేసి బాలయ్యకు ముందుగా బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. గ్లోబల్‌ లయన్‌ అనేది బాలకృష్ణకు పర్ఫెక్ట్‌ గా సెట్‌ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిరుదును తాను రివీల్‌ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా