Ticker

6/recent/ticker-posts

Rahul Gandhi: ప్రధాని మోడీ “చెడు శకునం”

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచును ప్రస్తావిస్తూ.. ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరుపున ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ, పీఎం మోడీని టార్గెట్‌ చేశారు. భారత్‌ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు. జలోర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి పనౌతి (చెడుశకునం) వచ్చాడు, దీంతో భారత్‌ గెలిచే మ్యాచ్‌ కూడా ఓడిపోయింది. టీవీలో దీనిని చూపించదరు, కానీ దేశ ప్రజలకు తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక ‘‘చెడు శకునం’’ గా అభివర్ణించారు. నవంబర్‌ 25న రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ని అధికారం నుంచి దించాలని బీజేపీ, మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రధానంగా కులగణన హమీని ఇస్తుంటే.. బీజేపీ రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలను అడ్డుకుంటామని, కాంగ్రెస్‌ అవినీతిని బయటపెడతామని ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !