Ticker

6/recent/ticker-posts

NC 23 : నాగ చైతన్య కెరీర్‌ లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో తండేల్‌



అక్కినేని నాగ చైతన్య కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగ చైతన్య కెరీర్‌ లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో గీత ఆర్ట్స్‌ ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తుంది. నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి లవ్‌ స్టోరీ సినిమాతో మంచి హిట్‌ కొట్టారు. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా కోసం చై-సాయి పల్లవి మరోసారి కలిశారు. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కి దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే అఫిషియల్‌ అనౌన్సమెంట్‌ వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంది. 

తండేల్‌ అంటే బోట్‌ నడిపేవారు అని అర్థం.

అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. నాగచైతన్య బర్త్‌ డే గిఫ్ట్‌ గా ఒక రోజు ముందే నాగ చైతన్య లుక్‌ అండ్‌ టైటిల్‌ ను రివీల్‌ చేశారు మేకర్స్‌. నాగ చైతన్య కెరీర్‌ లో 23వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్టుకు తండేల్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. ఈమేరకు పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. తండేల్‌ అంటే బోట్‌ నడిపేవారు అని అర్థం. గుజరాత్‌ లోని సూరత్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అందమైన ప్రేమకథతో పాటు.. ఊహించని ట్విస్టులు టర్న్స్‌ తో ఈ సినిమా సాగనుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక పోస్టర్‌ లో నాగ చైతన్య లుక్‌ చాలా కొత్తగా ఉంది. ఈ పోస్టర్‌ లో నాగ చైతన్య తెడ్డు పట్టుకోని, కర్లీ హెయిర్‌ తో, ఫుల్‌ గడ్డంతో మాస్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. రిప్డ్‌ ఫిజిక్‌ ని చూపిస్తూ నాగ చైతన్య కనిపించిన విధానం కేవలం అక్కినేని అభిమానులకే కాదు సినీ అభిమానులందరినీ మెప్పించేలా ఉంది. చూస్తుంటే తండేల్‌ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ ను అందుకునేలా ఉన్నాడు. రియల్‌ ఇన్సిడెంట్‌ నేపథ్యంలో తండేల్‌ సినిమా తెరకెక్కుతుంది. మరి జాలరిగా కనిపించనున్న చైతన్య ఏ రేంజ్‌ హిట్‌ కొడతాడు అనేది చూడాలి. ఇప్పటికైతే తండేల్‌ పోస్టర్‌ తో ఇప్పటివరకూ కనిపించని నాగ చైతన్యని చూసాం. త్వరలో షూటింగ్‌ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా