Ticker

6/recent/ticker-posts

VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు

  • శ్రీ సిద్దేశ్వరి కన్‌స్ట్రక్షన్స్ నుంచి SSC Developers  దాకా మోసాల దందా ! 
  • నమ్మి వచ్చిన వారికే నమ్మకద్రోహం ! 
  • మోసాల పునాదులపై ఎదిగే ప్రయత్నం.

చదివింది పదో తరగతే అయినా.. మోసాల సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఆరితేరిన కేటుగాడు. మాయమాటలతో మధ్యతరగతి ప్రజలను నమ్మించి నట్టేట ముంచడం, ఒకరి స్థలాన్ని మరొకరికి అంటగట్టి లక్షలాది రూపాయలు కొల్లగొట్టడం, నిలదీస్తే రాజకీయ అండదండలతో బెదిరింపులకు దిగడం.. ఇదీ విశాఖ వేదికగా సాగుతున్న అక్రమ రియల్ దందాల కిలాడీ, ‘శ్రీ సిద్దేశ్వరి కన్‌స్ట్రక్షన్స’ అధినేత బుడారి లక్ష్మణరావు అసలు నైజం ! నిన్నటి దాకా డబుల్ రిజిస్ట్రేషన్లతో అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ మోసగాడు, ఇప్పుడు ‘SSC Developers’ పేరిట అక్రమ మనీ సర్క్యులేషన్ నెట్‌వర్క్‌కు తెరలేపి మరో పెను దోపిడీకి స్కెచ్ వేశాడు.

ఒకే వెంచర్.. మోసాలు అనేకం 

2014 నుంచే అడ్డదారుల్లో అక్రమార్జనకు తెరతీసిన లక్ష్మణరావు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందాపురంలో ‘సాయి నగర’ వెంచర్ పేరిట భారీ స్కామ్‌కు పాల్పడ్డాడు. కుటంబాలకు కుటుంబాలనే రోడ్డున పడేశాడు.

ఒకే కుటుంబానికి రూ.24.50 లక్షల టోకరా: 2020లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. తీరా బాధితులు పరిశీలిస్తే, ఆ ప్లాట్లు అంతకుముందే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తేలింది.
బౌన్స్ అయిన చెక్కులు -గుండాగిరీ: బాధితులు నిలదీయడంతో రాజీ కుదుర్చుకున్నట్లు నమ్మించి చెక్కులు ఇచ్చాడు. అవి బౌన్స్ కావడంతో న్యాయం కోసం నిలదీసిన వారిని “ఈ రోజు, రేపు ’ అంటూ సాగతీత ధోరణిని అవలంబిస్తున్నారు.
70-80 మంది బాధితులు: కేవలం ఒకే వెంచర్‌లో దాదాపు 80 మంది కొనుగోలుదారులను ఇదే తరహా డబుల్ రిజిస్ట్రేషన్లతో నిలువునా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

తగరపువలస నుంచి భీమిలి దాకా విస్తరించిన అక్రమ దందా

తగరపువలస భూ బాగోతం: మÖలకుద్దు అనే వ్యక్తికి చెందిన భూమిని తనదేనని బురిడీ కొట్టించి, నకిలీ పత్రాలు సృష్టించి కొనుగోలుదారులకు కట్టబెట్టాడు.
భీమునిపట్నంలో అపార్ట్‌మెంట్ మాయ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లొసుగులను ఆసరాగా చేసుకుని ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మాడు. బాధితుడు రమణయ్య మీడియా ముందుకు వచ్చి లక్ష్మణరావు అక్రమాలను బట్టబయలు చేశారు.
షీలానగర్‌లో విక్రయం: అనిల్ అనే వ్యక్తి చూపించిన స్థలాన్ని, అసలు యజమానికే తెలియకుండా ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్న ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

SSC Developers ముసుగులో భారీ పొంజీ స్కీమ్

రియల్ ఎస్టేట్ మోసాలు బయటపడటంతో, ప్రతి రెండు మూడేళ్లకోసారి ఆఫీసులు మారుస్తూ బురిడీ కొట్టించే లక్ష్మణరావు.. తాజాగా ‘SSC Developers (www.sscdevelopers.in) పేరుతో సరికొత్త మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మనీ సర్క్యులేషన్ స్కామ్‌కు తెరలేపాడు.

అసాధ్యమైన రాబడుల ఎర: రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ప్యాకేజీలు పెట్టి, వారానికి 1% రిటర్న్స్ (ROI) తో డిపాజిట్లను రెట్టింపు (2X) చేస్తామని ప్రచారం చేస్తున్నాడు.
రిజిస్ట్రేషన్ గారడీ: పూర్తి మొత్తం చెల్లిస్తే 200 రోజుల పాటు రోజుకు 0.5% రాబడి ఇస్తామని అంకెల మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు.
పక్కా మనీ సర్క్యులేషన్: కొత్తగా చేరేవారి సొమ్ముతో పాతవారికి చెల్లింపులు జరిపే ఈ మోడల్‌కు ఎలాంటి వ్యాపార ప్రాతిపదిక లేదు.

20 కోట్ల వరకు సంపాదన.. పక్కాగా పన్ను ఎగవేత!

కస్టమర్ల రక్తాన్ని పిండి సుమారు రూ. 20 కోట్ల మేర అక్రమంగా ఆస్తులు కూడకట్టిన బుడారి లక్ష్మణ్‌రావు ప్రభుత్వ ఖజానాకు కనీస పన్ను కూడా చెల్లించలేదు. కంపెనీ పేరు మీద ఎలాంటి ముందస్తు పన్ను కానీ, ఆదాయపు పన్ను రిటర్నులు సైతం దాఖలు చేయకుండా వ్యవస్థలను తప్పుదోవ పట్టించాడు.

విశాఖ వాసులారా.. తస్మాత్ జాగ్రత్త!

ఈ సంస్థకు డిపాజిట్లు సేకరించేందుకు ఆర్బీఐ (RBI) లేదా సెబీ (SEBI) అనుమతులు లేవు. అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు రెరా (RERA) అనుమతులు లేవు. ఇప్పటివరకు పదేపదే కార్యాలయ చిరునామాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠాపై బాధితులు ఏకమై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మరియు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి.





 

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
My Land Infra : బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన మైల్యాండ్ ఇన్‌ఫ్రా కంపెనీ!
 My Land Infra : రియల్ ఎస్టేట్ ముసుగులో ‘మై ల్యాండ్ ఇన్‌ఫ్రా’ మహా మోసం
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
ANKURA HOSPITALS : మదీనాగూడ బ్రాంచ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా