Ticker

6/recent/ticker-posts

Ex Minister Nellore Narayana : నెల్లూరు నారాయణపై తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు

నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, ఏపీ మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆయన తమ్ముడి భార్య ప్రియ పొంగూరు సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. ఇంట్లో రెండవ భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ నన్ను తీవ్రంగా కొట్టారు, నన్ను టార్చర్‌ చేసేవాడు’’ అంటూ నారాయణ తమ్ముడి భార్య ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా ప్రియా పొంగూరు తన అనుభవాలను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 

నారాయణ విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలకుకారణాలు తెలియజేస్తా

క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రియ పొంగూరు చికిత్సకు సైతం డబ్బులు అందకుండా అన్ని మార్గాలు మూసివేసినట్లు పేర్కొన్నారు. తన కుటుంబ ఆస్తులు అమ్మి చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నారాయణ విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలకు కారణాలను త్వరలోనే బయటపెడతానన్నారు. కుటుంబంలో జరిగే విషయాలను ప్రపంచానికి తెలియకుండా ఇప్పటి వరకు తన నోరు కట్టేశారన్నారు, కానీ ఇప్పుడు నన్ను ఎవరు మాట్లాడకుండా ఆపలేరనన్నారు. ఈ రోజు కూడా గంటా శ్రీనివాసరావు గారితో రాయబారం పంపారు. ఆయన మీటింగ్‌ వలన ఒరిగిందేమీ లేదని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని  ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడిరచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో​ వైరల్‌గా మారింది. నారాయణ తమ్ముడి పేరు మణి.. ఆయన భార్యపేరు ప్రియ. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీడీపీ నేత నారాయణపై ఇలాంటి ఆరోపణలు తెరపైకి రావడంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఇప్పటి వరకు చేయని ఆరోపణలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్న సమయంలోనే ఎందుకు చేశారు.. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.

Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !