Ticker

6/recent/ticker-posts

Prabas First Look in Project K: ఇండియన్‌ ఐరన్‌మెన్‌ లుక్‌లో ప్రభాస్‌ !

 

 

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌  ప్రభాస్‌  హీరోగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం PROJECT-K. ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలోని యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ లుక్‌లో ప్రభాస్‌ని చూసిన వారంతా.. ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి అవతార్‌లో ఇంత వరకు టాలీవుడ్‌ హీరోస్‌ కనబడిరది లేదు. దాదాపు ఐరన్‌ మ్యాన్‌ లుక్‌ని పోలివున్న ప్రభాస్‌ని చూడగానే.. ఇది అలాంటిలాంటి సినిమా అయితే కాదనే క్లారిటీ అయితే జనాలకి వచ్చేస్తోంది. అలాగే ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్‌ మైథాలజితో లింక్‌ ఉంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. 

500 కోట్ల భారీ బడ్జెట్‌

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌ తో వైజయంతి మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో..  అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారంతా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. PROJECT-K టైటిల్‌, గ్లింప్స్‌ భారత్‌లో జూలై 21న, అమెరికాలో జూలై 20న విడుదల చేసేందుకు మేకర్స్‌ ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు. PROJECT-K శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌ 2023లో లాంచ్‌ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్‌ చేయబోతోంది. ఈ వేడుకకు ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, నాగ్‌ అశ్విన్‌, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం PROJECT-K. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్‌ సక్సెస్‌ ఫుల్‌గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్‌ లెవల్‌లో ఉండబోతోంది. PROJECT-K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.  మరి ఈ సినిమా రిలీజ్‌ తరువాత ఎన్ని రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి మరి.

Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
Sri chaitanya : శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !