Ticker

6/recent/ticker-posts

JEE Main Results : సిగ్గులేని శ్రీచైతన్య... మరీ ఇంతగా దిగజారాలా ?

  • ప్రకటించిన 25 ఓపెన్‌ కేటగిరీ ర్యాంకుల్లో 10 డీఎల్‌పీ (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌)వే.
  • శ్రీచైతన్య 10 లోపు వచ్చింది ఒకటే ర్యాంకు, అదీ 9 మాత్రమే.
  • 14 వ ర్యాంకు విద్యార్థిపై కాపీయింగ్‌ ఆరోపణలు ?
  • శ్రీచైతన్య జేఈఈ మెయిన్‌ ప్రకటనలో షరతులతో అసలు విషయం తేటతెల్లం.

మభ్యపెట్టడం, మోసం చేయటం శ్రీచైతన్యకు తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియదేమో. ఆ తెలివితోనే మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని మభ్యపెడుతూ మోసపుచ్చుతోంది శ్రీచైతన్య. ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ప్రకటించిన జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో శ్రీచైతన్య కుట్రకోణం బయటపడిరది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టటంలో భాగంగా భారీ ప్రకటనల్లో అడ్డంగా దొరికిపోయింది. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 10 లోపు శ్రీచైతన్య ప్రకటనలో ప్రచురించిన 1, 3, 6, 9 ర్యాంకుల్లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీ ర్యాంకు 9 వ ర్యాంకు మాత్రమే. మిగతా 3 ర్యాంకులు వివిధ కేటగిరీ ర్యాంకులు అని తల్లిదండ్రులు గుర్తించాలి. (1 వ ర్యాంకు అని ప్రకటించిన కె.సి.బసవ రెడ్డికి ఓపెన్‌ కేటగిరీ 14 వ ర్యాంకు వచ్చింది, 3 వ ర్యాంకు తోతంశెట్టి నిఖిలేష్‌కి ఓపెన్‌ కేటగిరీలో 20 వ ర్యాంకు వచ్చింది, ఇక 6 వ ర్యాంకు సాధించిన హిమాన్షు తలార్‌కి ఓపెన్‌ కేటగిరీలో 22 వ ర్యాంకు వచ్చింది). ఒక్కసారి శ్రీచైతన్య ప్రకటనను తీక్షణంగా గమనించండి చాలు. ఎన్ని అబద్దాలు శ్రీచైతన్య ప్రచారం చేస్తుందో తెలుస్తుంది. ఒక స్టార్‌ మార్క్‌ పెట్టి నియమనిబంధనలు వర్తిస్తాయి పెట్టి చెప్పింది. చెప్పేటి ఒకటి, చేసేది మరొకటి అని ఇట్టే అర్థం అయిపోతుంది.

తల్లిదండ్రులారా తస్మాత్‌ జాగ్రత్త !

ఇక ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 100లోపు 25 ర్యాంకులు అని ప్రకటించిన శ్రీచైతన్య అన్నీ స్టార్‌ మార్క్‌లు, డాలర్‌ మార్కులు, హ్యాష్‌ట్యాగ్‌లు, ఎట్‌దిరేట్‌ సింబల్స్‌తో బురిడీ కొట్టించింది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, మేధావుల్ని టాప్‌ ర్యాంకులు సాధించినట్టు కనికట్టు చేసి మోసగించింది. 100 లోపు 25 ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు అని చెప్పుకుంటున్న శ్రీచైతన్య అందులో 10 డిఎల్‌పీ (డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌) ర్యాంకులే. 1, 22, 28, 34, 40, 46, 53, 57, 95, 98 ర్యాంకులు సాధించిన విద్యార్థులు శ్రీచైతన్యలో క్లాస్‌రూమ్‌లో చదవలేదు. వేరే కాలేజీల్లో చదువుతూ శ్రీచైతన్య మరియు ఇతర కార్పొరేట్‌ సంస్థల్లో మెటీరియల్‌ కోసం, ప్రాక్టీస్‌ పేపర్ల కోసం రిజిస్టర్‌ అయిన విద్యార్థులను శ్రీచైతన్య తమ విద్యార్థులుగా చెప్పుకోవటం సిగ్గుచేటు. శోచనీయం. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకోవటం ఎంత సమంజసమో, డిఎల్‌పీ ర్యాంకులను తమ సంస్థ ర్యాంకులుగా ప్రకటించుకోవటం అంతే సమంజసం. తల్లిదండ్రులు ఈ అంశాలను క్షుణ్ణంగా గమనించాలి. బాగా చదివే విద్యార్థులు లేనప్పుడు , ఫలితాలు సరిగా రానప్పుడు  శ్రీచైతన్య ఎంత నీచానికైనా దిగజారుతుందో ఈ ఫలితాలే నిదర్శనం. అదీ కూడా తెలుగు రాష్ట్రాలు అంటే ఎంత చులకన భావం అంటే అన్ని కేటగిరీ ర్యాంకులనీ కలిపి ప్రకటిస్తుంది. ఎందుకంటే శ్రీచైతన్య ఏమి చెప్పిన నమ్ముతారు అని బలమైన విశ్వాసం. అందుకే అలవోకగా మోసపూరిత చర్యలకు పాల్పడుతోంది శ్రీచైతన్య. ఉత్తర భారతదేశంలో శ్రీచైతన్య ఆటలు సాగవు. అక్కడ ఒక్క ఓపెన్‌ కేటగిరీ ర్యాంకులు మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. అందుకే డిస్టెన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా వేరే విద్యార్థులు సాధించిన ర్యాంకులను తమ ర్యాంకులుగా ప్రకటించుకుంది.

శ్రీచైతన్యలో చదివితే ర్యాంకులు వస్తాయి అనేది అపోహే !

ఇక పోతే జెఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 1179569 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా వారిలో 75000 మంది పైగా విద్యార్థులు ఒక్క శ్రీచైతన్య విద్యాసంస్థల నుండి మాత్రమే రాశారు. కానీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 21987 గా పత్రికా ప్రకటనల్లో ప్రచురించారు. మిగిలిన 53000 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ఏంటి ? అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే శ్రీచైతన్యలో చదివిన ప్రతి ఒక్కరికీ విజయం సాధ్యపడదు. తెలివైన విద్యార్థులు మాత్రమే ర్యాంకులు సాధించగలరు. ఒకటి, రెండు ర్యాంకులు చూసి  శ్రీచైతన్యలో చేరితే మీ డబ్బు వృధా తప్పించి మరేమి ఉండదు. ఈ విషయం మీకు ఆలస్యంగా తెలుస్తుంది. కావాలంటే శ్రీచైతన్యలో చదివి ర్యాంకు రాని తల్లిదండ్రులకు అడిగి చూడండి. వాళ్ళు పడిన కష్టాలు, సవాళ్ళు, నరకం ఏమిటో మీకే తెలుస్తుంది. శ్రీచైతన్యలోని వివిధ ప్రోగ్రామ్స్‌లో ఒక రకమైన శిక్షణ అందిస్తున్నప్పుడు ప్రతీ విద్యార్థికి 10 లోపు, 100 లోపు ర్యాంకు ఎందుకు రావటం లేదు. కొందరికే ఎందుకు వస్తున్నాయి. దీనికి శ్రీచైతన్య యాజమాన్యం సమాధానం చెప్పగలదా ? 

Post a Comment

0 Comments

Popular Posts

Resonance Schools : J.D.లక్ష్మీనారాయణ రెజొనెన్స్‌కి ప్రచారకర్తగా మారారా ?
Resonance Schools : టీచర్లు లేకుండా బోధన ఎలా ?
Kadapa Sri Chaitanya : శ్రీచైతన్య హాస్టల్స్‌లో ఆగని మరణమృదంగం !
Physics Wallah : 'సరసమైన ధరకే చదువు' ఫిజిక్స్‌ వాలా IPOని గట్టెక్కిస్తుందా ?
Sri Chaitanya Fake Olympiads : ఆగని శ్రీచైతన్య ఫేక్‌ ఒలింపియాడ్స్‌ దందా !
Sri Chaitanya Score Scholarship : శ్రీచైతన్య రూ.350 కోట్లు మాయాజాలం !
sri chaitanya : తవ్వేకొద్ది బయటపడుతున్న శ్రీచైతన్య షెల్‌ కంపెనీల అక్రమాలు !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Resonance Schools : పర్మిషన్లు లేకుండా అడ్మిషన్లు ఎలా ?
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !