Ticker

6/recent/ticker-posts

Ashu Reddy : ఫోన్‌ వాడలేకపోతున్నా ! మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా

 

 

డ్రగ్స్‌ (Drugs Case) కేసులో అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరి (KP CHOUDARY) వ్యవహారంలో తన పేరు బయటకి రావడంపై నటి అషురెడ్డి (ASHU REDDY) మరోసారి స్పందించింది. గత వీడియోలో కూడా ఆమె వాడివేడిగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా అని హెచ్చరించారు. తాజాగా తనపై ట్రోలింగ్‌ (TROLLING) ఎక్కువ కావడంతో మరోమారు ఓ వీడియో (VIDEO) పోస్ట్‌ చేశారు.

‘‘డ్రగ్స్‌ కేసుకు, నాకు ఏ సంబంధం లేకపోయినా కొన్ని మీడియా చానళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాస్తున్నాయి. కేపీ చౌదరి కాల్‌ డేటాలో నా పేరు, ఫోన్‌ నంబర్‌ ఉండడంతో నా నంబర్‌ను టెలికాస్ట్‌ చేశాయి. దీంతో నేను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా నంబర్‌ బయటపెట్టడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీని వల్ల ఇప్పుడు నా నంబర్‌ ఉపయోగించలేకపోతున్నా. నన్ను కించపరిచేలా వార్తలు వండిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తా. కేపీ చౌదరితో గంటల సమయం ఫోన్‌ మాట్లాడానని చెబుతున్నారు. అతడితో నాకున్న పరిచయం, ఫోన్‌ కాల్స్‌పై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది కేసు బయటికి వచ్చినప్పుడు నేను ఇండియాలో లేను. నేను ఇక్కడ లేకపోయినా, ఆ కేసుకు నాకు సంబంధం లేకపోయినా కేవలం నా ఫోన్‌ నంబర్‌ అతని దగ్గర ఉందనే కారణంగా ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా’’ అని అషురెడ్డి పేర్కొంది.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా