Ticker

6/recent/ticker-posts

Lawrence Bishnoi : బెదిరింపు కాల్స్‌కు ప్రతిఫలంగా డబ్బులు చెల్లిస్తారు - లారెన్స్‌ బిష్ణోయ్‌

 
నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ కస్టడీలో ఉన్న పంజాబ్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తాజాగా సంచలన విషయాలు వెల్లడిరచారు. పోలీసు రక్షణ కావాలనుకునే వారు తాను బెదిరింపు ఫోన్‌ కాల్‌ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్‌ బిష్ణోయ్‌ చెప్పారు. బిష్ణోయ్‌ ఏప్రిల్‌ నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్నారు. ఖలిస్థానీ దుస్తుల నిధులకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ అతన్ని విచారించింది.

భటిండా జైలులో బిష్ణోయ్‌

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడ బిష్ణోయ్‌ ప్రస్తుతం భటిండాలోని జైలులో ఉన్నాడు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తాను చేసిన బెదిరింపు కాల్‌కు ప్రతిఫలంగా డబ్బు చెల్లించారని ఎన్‌ఐఏ అధికారులకు చెప్పినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బెదిరింపు కాల్‌ వస్తే తద్వారా వారు పోలీసులను భద్రత కల్పించాలని అడగవచ్చునని అంటున్నారు. మద్యం డీలర్లు, కాల్‌ సెంటర్ల యజమానులు, డ్రగ్స్‌ సరఫరాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి ప్రతి నెలా రూ.2.5కోట్లు వసూలు చేస్తున్నా లారెన్స్‌ బిష్ణోయ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఐఏ అధికారులు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఆ వివరాలను తెలిపారు. ఈ రోజుల్లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర పోలీసుల నుంచి భద్రత పొందడానికి వీలుగా తాను బెదిరింపు కాల్‌లు చేసినందుకు, వారు తనకు డబ్బు చెల్లిస్తున్నారని బిష్ణోయ్‌ పేర్కొన్నాడు.

క్రిమినల్‌ సిండికేట్‌ ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ 1998వ సంవత్సరంలో జింకలను వేటాడిన కేసులో బిష్ణోయ్‌ కమ్యూనిటీకి ఆయన క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. కాగా సల్మాన్‌ఖాన్‌ను తప్పకుండా హతమారుస్తామని గోల్డీ బ్రార్‌ ప్రకటించారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్లు వారి ప్రత్యర్థులను హతమార్చడానికి వారే తుపాకులతో పాటు షూటర్లను ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసిన కాంట్రాక్టులో తనకు పర్సంటేజీ ఇస్తారని బిష్ణోయ్‌ చెప్పారు. తాను ఇతర నేరగాళ్లతో కలిసి నేరాల సిండికేట్‌ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. తాను ఖలిస్థాన్‌ ఉద్యమానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ ఎన్‌ఐఏకు వెల్లడిరచిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల బోగస్‌ స్కాలర్‌షిప్‌ ట్రాప్‌  !!
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : షెల్‌ కంపెనీల పుట్ట...నల్లధనం గుట్ట ....శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !