Ticker

6/recent/ticker-posts

Etela Jamuna Sensational pressmeet : ఎమ్మేల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు !

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ.20కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు  తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు. ‘‘ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఓటుతోనే ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. కౌశిక్‌ రెడ్డిని.. కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం’’ అని జమున ఆరోపించారు.

బిజెపిలో ఈటల రాజేందర్‌ సంతృప్తిగా ఉన్నారని ఈటల జమున చెప్పారు. పార్టీ మారను అని ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు.

Post a Comment

0 Comments

Popular Posts

VIZAG :  రియల్ ఎస్టేట్ ముసుగులో మల్టీ లెవల్ మార్కెటింగ్: SSC DEVELOPERS అసలు రంగు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
VIZAG : డబుల్ రిజిస్ట్రేషన్ల కిలాడీ..బుడారి లక్ష్మణరావు
 Genesis Capital : లక్ష పెట్టు...4 లక్షలు పట్టు....మరో ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ !
GUNTUR : భారీ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం: రూ. 20 కోట్లతో బోర్డు తిప్పేసిన ‘అవని’ ముఠా!
Ankura Hospitals : AS Rao Nagar LLP ఆర్ధిక లావాదేవీలపై సంచలన కథనం!
AVIGNA LABORATORIES : ఈ లెక్కల్లో పెద్ద లోసుగుంది ? భారీ పన్ను ఉల్లంఘనలు?
NEET 2024 ఫలితాలు ప్రకటించేసుకున్న శ్రీచైతన్య ! NTA ని అవమానిస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : తల్లిదండ్రుల్ని దోచేస్తున్న ఒలింపియాడ్స్‌ మాఫియా