Ticker

6/recent/ticker-posts

RAM AND BOYAPATI NEW MOVIE SKANDA : మీరు బరిలో ఉంటే ఊడేదుండదు !

 
మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని ఓ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. వరుస అప్‌డేట్‌లతో సందడి చేస్తోన్న చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది. RAPO20 అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ మూవీకి ‘స్కంద’ (SKANDA) అనే పేరు ఖరారు చేసింది. ఈ మేరకు చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల (SREELEELA) నటించింది.

ఆ టీజర్‌లో రామ్‌ మాస్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు.. రామ్‌ చెప్పిన ‘‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు’’ డైలాగ్‌ సినిమా ఎంత మాస్‌గా ఉంటుందో చెప్పేలా ఉంది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ కూడా చూపించని రేంజ్‌ మాస్‌ యాంగిల్‌ లో బోయపాటి శ్రీను చూపించినట్టు గా అర్థం అవుతుంది. గుబురు గెడ్డం తో లావుగా చాలా కొత్తగా ఇందులో రామ్‌ కనిపిస్తున్నాడు. బాలయ్య బాబు తో తప్ప కుర్ర హీరోలతో సక్సెస్‌ రేట్‌ తక్కువ ఉన్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం తో తాను కుర్ర హీరోలతో కూడా సూపర్‌ హిట్స్‌ తియ్యగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. అందుకే రామ్‌ లాంటి మాస్‌ హీరోను ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేస్తున్నట్లు ఇటీవల మూవీ యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్‌ సన్నివేశాలు హైలైట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్‌ పాన్‌ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, ‘స్కంద’ పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ నటించనున్నాడు.  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్‌ ఇండియా మూవీగానే రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న విడుదలవుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.



Post a Comment

0 Comments

Popular Posts

Scholarships : కార్పొరేట్‌ విద్యాసంస్థల కుతంత్రం ! బోగస్‌ స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులపై దండయాత్ర !!
Sri Chaitanya Trust : ఇష్టారాజ్యంగా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లు/ సొసైటీలు !
SRI CHAITANYA NEET 2025 : కూలిపోతున్న డాక్టర్‌ కలలు !
JEE ADVANCED 2025 : IIT ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల్ని బకరాల్ని చేస్తున్న శ్రీచైతన్య !
Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
INFINITY META JR APP పేరుతో అడ్డంగా దండుకుంటున్న శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
Sri Chaitanya Sisters : శ్రీచైతన్య షెల్‌ కంపెనీల గుట్టు రట్టు !
RAM AND BOYAPATI NEW MOVIE SKANDA : మీరు బరిలో ఉంటే ఊడేదుండదు !